Bhargava G
EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము 31 Mar 2023 ప్రకృతి క్రమాలకు ఉద్దేశ్యాలు, అర్థాలు ఉండవు. వాటిని సహానుభూతితో అర్థం చేసుకోవడం ఉండదు. వివరించడమే ఉంటుంది. ఎందుకంటే.. మనుషులంగా మనమిచ్చుకునే అర్థాలకు అతీతమైనది ప్రకృతి. సంస్కృతి విషయం అలా కాదు. వివరించడానికి ప్రయత్నించేందుకు మొదలు దాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఆ సంస్కృతిని పాటించే వారు స్వయంగా ఏ అర్థం ఇచ్చుకుంటున్నారో గ్రహించడంతో మొదలు బెట్టి ఇతర అర్థాలు ఏమయినా సాధ్యమా అన్న ప్రశ్నకు జవాబు వెదకవలసి ఉంటుంది. ఆ తరువాత మాత్రమే... ఆ సంస్కృతి పుట్టడానికీ కారణమేమిటో... ఆ సంస్కృతి నెరవేర్చుతున్న ప్రయోజనమేమిటో వివరించడం సాధ్యమయ్యే అవకాశం ఉంది. మానవ జీవితంలో జరిగే ఘటనలకు కారణాలతో పాటు, ఉద్దేశ్యాలూ, అర్థాలు కూడా ఉంటాయి. ప్రకృతి లో కార్యకారణాలు మాత్రమే ఉంటాయి. మనం నిర్ణయించుకునే ఆర్థమే కానీ ప్రకృతికి స్వయంగా ఏ అర్థం ఉండదు. మన కోసం ఉండదు. మనలను దృష్టిలో పెట్టుకోదు. ప్రకృతి లో జరిగే ఘటనలకు అర్థం ఉండదు. ఆ ఘటనలను జనింపచేసే నిర్మాణాలు (Structures), శక్తులూ (Forces), సంపర్కాలు (Interactions) ను వ...