Posts

Showing posts from December, 2025

On Aesthetics by Metaphor (Telugu 30.12.2025)

Image
⚛️🪷🌳 సాధారణంగా ఆభరణాలు అన్ని స్వర్ణంతో చేస్తారు, కొన్ని మాత్రమే ఇతర లోహాలతో చేస్తారు, లోహాల్లో కొన్ని స్వర్ణం కంటే ఉన్నతమైనవి, కొన్ని కావు. కానీ ప్రతి ఆభరణం విలువైనదే. ఆభరణాలు కొన్ని సాంప్రదాయంగా, కొన్ని ఆధునికంగా, కొన్ని సరళంగా, కొన్ని సున్నితంగా, కొన్ని స్థూలంగా, కొన్ని తేలికగా ఉంటాయి. ఇలా ప్రతి ఆభరణం ప్రత్యేకమైనదే.  దాదాపు అందరూ స్వార్జితంతో ఆభరణాలను పొందుతారు, ఇది చాలా మేలైన మార్గం, ఉత్తమమైనది. కొందరికి వంశపారంపర్యంగా లభిస్తుంది, ఇది వారి యోగ్యత ఆధారంగా ఉంటుంది. ఇది ఆమోద యోగ్యమైనది. కొందరు వేరే వారికి చెందిన దానిని తెలివిగా, ఒక రకమైన గౌరవంగా సమ్మతితో అనుభవిస్తారు అది వారి లౌక్యం, ఇది మధ్యమమైనది. కొందరు దౌర్జన్యంతో దోచుకుంటారు అది దోపిడి, ఇది హేయమైనది. ఎప్పుడైనా ఎక్కడైనా ఆభరణాలు సంస్కృతిని చాటడానికి, విలువను చూపించడానికి, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడానికి, అందాన్ని పెంచుకోవడానికి, గౌరవాన్ని పొందడానికి, గొప్ప అనే గర్వాన్ని ప్రదర్శించడానికి, ఇలా కొన్ని కారణాలు చేత ఆభరణాలు ప్రదర్శనలలో ఉంచబడతాయి, అప్పుడు ఆ సమయంలో ప్రదర్శనకు ఉంచిన ఆ ఆభరణాలను ఎక్కువ మంది చూస్తే బాగుంటుంది. కొన్నిసా...

Jyothi Akka Birthday (Telugu 27.12.2025)

⚛️🪷🌳  పెద్దనాన్న పెద్దమ్మల కనిష్ట కుమార్తెగా  నెల్లూరు నేపథ్యన  జన్మించిన జ్యోతక్క తల్లిదండ్రులతో తూర్పుగోదావరి  జిల్లాలకు జాగ్రత్తగా  చిద్విలాసంగా చేరి గోదావరి గలగలల రాజమండ్రిలో రూపాంతరం చెంది చక్కగా  విద్యా & వృత్తిలో  వడివడిగా వృద్ధి అవుతూ, ఆతర్వాత  కడపకు కదిలి ఉపాధ్యాయురాలుగా ఉంటూ కుదురుకున్న కాలంలో హైదరాబాదులో హృద్యంగా  శంకరమఠంలో శుభశకున  సమయాన, స్వామి సమక్షంలో  భవ్యంగా భావించి  నిశ్చయమైన నిశ్చితార్థంతో నెల్లూరు నేలపై హాయిగా హరి బావతో కళ్యాణంతో  కలిసి భాగ్యనగరంలో భార్యాభర్తలుగా చేరి చక్కగా సాయిముకుంద్ శ్రీలహరి  సంతానంతో సానుకూలంగా  జీవిస్తున్న జ్యోతక్కకు  పుట్టినరోజు పండుగ  శోభనమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖27.12.2025✍️

Atal Bihari Vajpayee (Telugu 25.12.2025)

Image
⚛️🪷🌳 ప్రతిపక్షంలో ఉన్న వాజపేయిపై అధికార పక్షంలో ఉన్న అప్పటి ప్రధానమంత్రుల ఆలోచనలు అనగా నెహ్రూ ఆశ, రాజీవ్ గాంధీ ఉపకారం, నరసింహారావు గారి నమ్మకం, అన్నింటికీ ప్రతిరూపంగా నిలిచిన ప్రతిపక్ష ప్రముఖుడు వాజపేయి నెహ్రూ దృష్టి:  1957లో అటల్ బిహారీ వాజపేయి గారు మొదటిసారి లోకసభకు ఎన్నికయ్యారు. అప్పట్లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. వాజపేయి గారు హిందీలో మాట్లాడే అనర్గళమైన ప్రసంగాలు, విదేశీ విధానాలపై ఆయనకున్న పట్టు చూసి నెహ్రూ ముగ్ధులయ్యేవారు. ఒకసారి విదేశీ ప్రతినిధులు భారతదేశానికి వచ్చినప్పుడు, నెహ్రూ గారు వాజపేయిని పరిచయం చేస్తూ.. "ఈ యువకుడు భవిష్యత్తులో ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు" అని చెప్పారు. రాజీవ్ గాంధీ మానవీయత:  మరో సంఘటన 1988లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి భారత ప్రతినిధి బృందంలో అటల్ బిహారీ వాజపేయిని చేర్చారు. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు, కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయిని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి...

Meditation Day (Telugu 21.12.2025)

Image
⚛️🪷🌳   ఎక్కడైనా ఏకాగ్రత  ఏర్పరిచిన ఏకాంతంలో  మనసు మౌనమై అంతరంగం ఆనంతమై అసలేమి ఉండని/ అన్ని ఉన్నాయి అనే అనిర్వచనీయ  శూన్యంలో సమస్తం సాధించే సిద్ధి  స్థితి సుసంపన్నంగా అందించే అద్భుతమైన  దారి, ధ్యానం. ----------------- ధ్యానం దారిలో  తక్కువగా తిరిగిన కానీ, అదృష్టవశత్తు కలిగిన  తాత్విక తాదాత్మ్యమైన  భావనలతో బలంగా  అలా అట్టిపెట్టుకుని  సుదీర్ఘంగా సాగిన  వాడినై వున్నాను. ఆ అద్భుత అనుభూతి అనుభవపూర్వకంగా కాకపోయినా  ఆలోచనలతో కదిలిన మదిలో మెదిలిన స్పందనల సారాంశం కవిత్వంగా కుదురుకుని నిర్వచనంగా నిలిచింది. అందరికీ అంతర్జాతీయ  ధ్యాన దినోత్సవ శోభమైన శుభాకాంక్షలు   💭⚖️🙂📝@🌳 📖21.12.2025 ✍️

Pardhu Mama Kala Atta (16.12.2025)

Image
⚛️🪷🌳  సకుటుంబ సమక్షంలో కడపలో కళ్యాణంతో సామర్థ్యం సున్నితత్వం సంగమించి సంశ్లేషణతో ఉమ్మడిగా ఉంటూ సంబంధాన్ని సానుకూల స్ఫూర్తితో సాధికారంగా  స్వాగతిస్తూ, సాధిస్తూ సంతోషంగా సంతానంతో సాగుతున్న సంధి స్ఫూర్తి పార్ధుమామ కళాత్తకు వివాహ వార్షికోత్సవ  శోభమైన శుభాకాంక్షలు   💭⚖️🙂📝@🌳 📖16.12.2025✍️

Fire Camp (Telugu 11.12.2025)

Image
⚛️🪷🌳 చలి మంచును ఎదుర్కొనేందుకు  చలి మంటల ఏర్పాటులో స్థానికునితో సంభాషణలాడి  సహాయపడి, సహచరునితో చిన్న నాటి చిన్ని చిన్ని  జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకున్నాము. 💭⚖️🙂📝@🌳 📖11.12.2025✍️