Mother Tongue Day (మాతృభాష దినోత్సవం)
⚛️🛞🪷
మాతృభాష దినోత్సవం
మనందరం మాతృత్వాన్ని ప్రేమిస్తాం, కానీ మన తల్లి పట్లే ప్రేమ, బాధ్యతగా ఉంటాం.. అందరి తల్లుల బాధ్యత తీసుకోలేము కదా. గౌరవం ఉంటుంది అవసరమైనప్పుడు సహాయం చేయగలము అంతే.....
తెలుగు భాష నా మాతృభాష కాబట్టి అది అంటే ప్రేమ మరియు బాధ్యత. తెలుగు భాష విషయం కొద్దిసేపు పక్కన పెడితే భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేయడం నాకు కొంచెం ఇష్టం.
ఈరోజు అవసరాలకు భాష సరిపోతుందా? సరిపోవట్లేదు. భాషతో ప్రయాణం చేస్తుంటే కొత్త పదాలతో పరిచయం ఏర్పడుతుంది. కొత్త పదాలు రావాలి అంటే భాష మీద సాధికారత ఉంటే కొత్త పదాలు పుట్టించే మనో వైశాల్యం వస్తుందని నాకు అనిపిస్తుంది.
భాషల మధ్య వైరాలు నిధానంగా అయిన నశించాలి, సాహిత్య లోతులకు వెళ్లి మన భావ ప్రకటనను సులభతరం చేసుకోవాలి. సాహిత్య సౌందర్యాన్ని ఆస్వాదించాలి.
ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంది. చెట్టు వేర్లను అట్టి పెట్టుకున్నట్లుగా.. భాష కూడా సంప్రదాయాన్ని అట్టి పెట్టుకుని రూపాంతరం చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్నో కొత్త పదాలను ఆ భాష కుటుంబం నుంచి దాని దగ్గర కుటుంబం నుంచి గాని చేర్చుకోవాలి.
ఆంగ్లము హిందీ భాషలు ఇతర భాషల నుంచి పదాలను స్వీకరిస్తూ వేగంగా ఎదుగుగుతున్నాయని నాకు అనిపిస్తోంది. జంగిల్ అనే హిందీ పదం నుంచి ఆంగ్ల జంగల్, మలయాళం నుంచి మాంగో... ఇలా ఎన్నో పదాలను ఇతర భాషల నుంచి ఆంగ్లం స్వీకరించింది.
మన భారతదేశంలో అధునాతన భాష హిందుస్తానీ (ఉర్దూ మరియు హిందీ), రెండిటి మాటలు చాలా వరకు ఒకటే లాగా ఉన్నా, వాటి లిపులు వేరు. సంస్కృతం నుంచి హిందీ, అరబిక్ నుంచి ఉర్దూ లిపులను స్వీకరించి కొత్త అస్తిత్వాన్ని సృష్టించుకుని ముందుకు వెళుతోంది. స్వీకరణ శక్తియే సమగ్ర ఎదుగుదలకు మూలం అని నాకనిపిస్తోంది.
ఇంకో చిన్న విషయం, నేను ఆంగ్ల భాష నేర్చుకునే కొద్ది నాకు తెలుగులో ప్రావీణ్యం పెరిగింది. ఇతర భాషలు మీద దృష్టి పెట్టికొద్ది బుద్ధి మరింత సచేతనంగా ఉండి అభిజ్ఞాశక్తిని పెంచుతుంది...
అందరికీ ప్రపంచ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు...
💭⚖️🙂📝@🌳
అక్షర అనంద అస్తిత్వం
Energy Enjoy Entity
🙏
ReplyDeleteBravo 👍
ReplyDelete♥️
ReplyDelete🙏
ReplyDelete🙏
ReplyDelete👌👌🙏🙏🙏
ReplyDelete