మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈరోజు మానసిక ఆరోగ్య దినోత్సవం (10 Oct 2022)_
వివిధ సందర్భాల్లో విరాట్ కోహ్లీ ఉదాంతలను ఈనాడు పత్రికలో చదివి దాచుకున్నాను వాటిని సంకలనం చేసి సవరించి ఇలా పంచుకుంటున్నాను సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
----------------
‘కుంగుబాటుకు గురయ్యారా అన్న ప్రశ్నకు వివిధ సందర్భాల్లో కోహ్లీ ఇలా జవాబు ఇచ్చాడు. 

“మానసికంగా కుంగిపోయాను అని చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపడను. అవును అయ్యాను.. "ప్రపంచంలో నేన్కొడినే ఒంటరి" అనే భావనలో కూడ ఉన్నాను’’.
ఇది చాలా సాధారణ విషయమే అయినప్పటికీ, దీని గురించి మాట్లాడేందుకు మనం సంకోచిస్తుంటాం. మనల్ని మనం మానసికంగా బలహీనులుగా చూసుకోలేం. కానీ, నిజమేంటంటే. మనం బలహీనంగా ఉన్నామని అంగీకరించడం కంటే.. మానసికంగా దృఢంగా ఉన్నామని నమ్మించడం చాలా దారుణం" 

ఇటీవల కొన్ని రోజుల పాటు నా సామర్థ్యాన్ని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నానని గ్రహించాను. నువ్వు చేయగలవు.. పోరాడగలవు.. నీకు ఆ సామర్థ్యం ఉంది.. అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. కానీ, శరీరం మాత్రం ఆగిపొమ్మని చెప్పింది. వెనక్కి తగ్గాలని.. విశ్రాంతి తీసుకోవాలని మనసు సూచించింది. నేను మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తిగా కన్పించొచ్చు. కానీ ప్రతి ఒక్కరికీ కొన్ని పరిమితులుంటాయి. వాటిని మనం గుర్తించాలి. లేదంటే పరిణామాలు హానికరంగా మారొచ్చు"

ఏమీ చేయలేకపోతున్నామని తెలిసిన అనుభూతి గొప్పదేం కాదు. ప్రతి ఒక్కరు ఏదో ఒకదశలో తన నియంత్రణలో ఏదీ ఉండదని అనుకుంటాడు. అప్పుడు నా జీవితంలో అండగా నిలిచేవాళ్లున్నా ప్రపంచంలో నేను ఒంటరినని అనిపించేది. మాట్లాడేందుకు మనుషులు లేరని కాదు. నా మనసులో ఏముందో పూర్తిగా అర్థం చేసుకొనే నిపుణుడు లేరనిపించింది. నిజానికి ఇది పెద్ద విషయం. ఈ పరిస్థితిలో మార్పు చూడాలనుకున్నాను. 

‘నాకిలా అనిపిస్తోంది. నిద్రపోవడమూ కష్టంగా ఉంది. పొద్దున్నే లేవాలనిపించడం లేదు. నాపై నాకు నమ్మకం ఉండటం లేదు. వీటిని పోగొట్టుకోవడానికి నేనేం చేయాలి? అని చెప్పుకొనేందుకు ఒకరు ఉండాలి. కొందరు ఇలాంటి అనుభవాలతోనే సుదీర్ఘ కాలం గడుపుతారు. ఒక్కోసారి ఎక్కువ కాలం ఇలాగే బాధపడతారు. దాన్నుంచి తప్పించుకోలేరు. కెరీర్‌ను నాశనం చేయగల మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూదని ఇలాంటప్పుడు నిపుణుల సహాయం అవసరమని నిజాయతీగా చెప్పగలను....
------
నేను శారీరకంగా దృఢం అయ్యేకోద్ది మానసికంగా స్థిరత్వాన్ని సాధించాను. నా భౌతిక పాలనను మార్చి నాలో నేను ఉన్నట్లు భావించాను. “సరే.. ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దాం అనుకునే వ్యక్తిని నేను. ఏ పనిలోనైనా పూర్తిగా వివేకం, ఆనందంతో భాగస్వామినవుతా. ఎప్పుడూ అలాగే ఉండటానికి ఇష్టపడుతా. మైదానంలో ఇలా ఎలా ఉండగలుగుతారు? ఆ సామర్థ్యాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. వారికి నేను చెప్పాలనుకునేది ఒకటే.. నాకు ఆట మీదున్న ప్రేమ. ప్రతి బంతితో జట్టుకు సహకరించాల్సింది ఇంకా ఎంతో ఉందని భావిస్తా. మైదానంలోనూ నా పూర్తి శక్తిని ప్రదర్శిస్తా. ఇదేం అసాధారణం కాదు. - విరాట్ కోహ్లీ

మూలం: ఈనాడు
సవరణ: భార్గవ శ్యామ

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao