పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

Chandu Mama (Telugu 23.02.2026)

చిత్రం
⚛️🪷🌳  నిదానమైన  నిర్మాణాత్మకంగా  నడుస్తూ నిలిచి, మాటల మాటున మేధోమథనంతో  మెదులుతూ మెరిసే మామయ్య మీరు .... తల్లితండ్రులకు  తేలికైన తనయుడిగా తమ్ముడికి తోడుగా చెల్లికి చక్కగా  ఆదర్శమైన అన్నయ్యగా అనువైన అర్ధాంగికి  అనుగుణంగా అడుగులేస్తూ, పెద్దనాన్నగా పుత్రులకు  ప్రేమ పెంచుతూ, మేనల్లుడ్ల ముందు  మధురమైన మేనమామగా ఉంటూ ఉన్న  చందుమామకు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖23.02.2026✍️ "All Humans are Potentially Unique" Chandu Mamaiya,  You manifested-(ing) your specialty with  Analytical thoughts, Diplomatic words and Calm actions,  with these characteristics in your unique style  You became an influential (Special) person.  💭⚖️🙂📝@🌳 📖23.02.2019✍️ https://bharghavashyam.blogspot.com/2023/02/chandu-mamaiya.html ⚛️🪷🌳 "మానవులందరూ వారి శైలిలో వారు ప్రత్యేకమైన వారు" చందు మామయ్య  మీరు మీ జీవిత ప్రక్రియలో  విశ్లేషణాత్మక ఆలోచనలు,  దౌత్య పదాలు మరియు  ప్రశాంతమైన చర...

Ch.Rama Krishna (Telugu 14.02.2026)

చిత్రం
⚛️🪷🌳  ప్రకటనల పరిభాగం  ఆంధ్రజ్యోతిలో అందరికంటే  చిన్నవాడైన చదలవాడ  రామకృష్ణ, నిన్ను రామా   పిలుపుతో పిలిచి  పులకరించేడిని నాణ్యమైన నాణెంలా  ఇరువైపులా, ఇరువురికి  రమణీయత/రాటుతేలినతనం చూపించే చతురుడివి,  కనుసన్నలతో  కదిలించే వాడివి  క్రమపద్దతిలో..... గుంటూరు గడ్డపై పుట్టి పెరిగి చదువుకై చక్కగా ప్రకాశం ప్రయాణించి నెల్లూరు నేపథ్యంలో  ఉద్యోగంలో ఉండి మహానగరం ముందుకు  వచ్చి వాలి ప్రవేశ పరీక్షలో ప్రతిభ పాటవాలు  చూపి, చేరి అంచనాలను అందుకుంటూ ధృవీకరణలో ధృవికృత సంతకందారుగా సాగుతున్న  నీకు నిర్మలంగా  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳   📖14.02.2026✍️

Shripad (Telugu 12.02.2026)

చిత్రం
⚛️🪷🌳   'చంద్ర రమ'ణీయ తల్లి తండ్రులకు కనిష్ట కుమారుడివై పెద్ద పుత్రునితో సమానంగా సంకల్పంగా లౌక్య లయతో ధైర్యం ధారణజేసి బాధ్యతల బరిలో  దిగి దూసుకుపోతూ ఉంటూ, ఉమ్మడిగా  కుటుంబంలో కలిసి కుటుంబానికి కవచంగా  సాగుతున్న శ్రీపాద  మహిదరుకు మోహనమైన హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖12.02.2026✍️

Subbarao Mamaiya (Telugu 10.02.2026)

చిత్రం
⚛️🪷🌳  పరిపక్వత పండిన  ప్రస్తుత పాతపాటి  ప్రియమైన పెద్దవారు" కోమల కాఠిన్యం,  లౌకిక లయ,  సమతుల్య స్థిరత్వం సమయ స్ఫూర్తితో గుణ గంభీరంగా  హుందాగా హుషారుగా   సాగే సుబ్బారావు  మామయ్యకు మనసారా  హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖10.02.2026✍️

Ravinder Anna (Telugu 10.02.2026)

చిత్రం
⚛️🪷🌳   బాల్యంలో బాగా  ఆటలు ఆడుతూ  చదువులో చురుగ్గా, గణితంలో గణనీయమైన  పట్టు పొంది  కొంత కాలం  సంధ్యా సమయాన  ఉపాధ్యాయ ఉపాధిలో ఆర్థిక ఆరంభం  పొంది, పరివారనికి ఊతంగా ఉన్నారు. ప్రేమను పొందిన ప్రియుడై, భర్తగా బాధ్యతలు అందుకుని అర్ధాంగి, కుమార్తెతో కుతూహలంగా  ప్రణయ ప్రయాణకారి. చిరంజీవిని చిరకాలంగా   ఆదరిస్తున్న అభిమాని. 'వార్త'లోకి వచ్చి, ఆతర్వాత ఆంధ్రజ్యోతిలో చేరి చక్కగా  ప్రకటనలను ప్రణాళికాబద్దంగా  పత్రికలో ప్రచురణకై  సరళంగా సిద్ధపరుస్తూ అభినందనలు అందుకున్న  అధికారి. పత్రికా పరిభాగాన  ఏటా ఏర్పాటుచేసే క్రికెట్టు క్రీడలో  కీలకమైన క్రీడాకారుడిగా విజయుడైన వారు.  బహుళ బహుముఖ  ప్రజ్ఞాశాలి ప్రతిభావంతుడు  హుందాతనం హోదగల రవిందర్ అన్నకు  హార్థిక హృదయపూర్వక  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖10.02.2026✍️

Hymavathi Nannamma (Telugu 09.02.2026)

చిత్రం
⚛️🪷🌳  ప్రపంచమే గ్రామం అవుతున్న అప్పుడు గ్రామమే (ఇల్లే) ప్రపంచంగా  భావించి భవ్యంగా నిలయంలో నిత్యం  నిలిచి నిలకడగా  పాకశాస్త్రంలో ప్రావిణ్యం  పొంది, ప్రతిభగా ప్రతి పూట  వంటల వ్యాపకాలతో గడిపే గృహస్థురాలుగా పుత్రపుత్రిక పౌత్రులకు ఇంటి వద్ద ఇష్టంగా  ఆనందంగా ఆరగించే ఆహారం అందించి ఆనందించే అన్నపూర్ణ  నిరవధికంగా నిత్యం  మెదడుకు మేతమైన పద వినోదినితో ప్రశాంతంగా పరవసిస్తూ హైమావతి నాన్నమ్మకు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖09.02.2026✍️

On Facebook- Reflection (Telugu 04.02.2026)

చిత్రం
⚛️🪷🌳  ఈరోజు ఫేసుబుక్ ప్రారంభమైన రోజు. ఈ ఫేసుబుక్ నాకు ఒక వార్తాపత్రిక మరియు దైనందిని. ఇంకా విశ్లేషిస్తూ తాత్వికంగా చెప్పాలంటే నాలోని కవిని రచయితను బహిర్గతం చేసే ఒక బంగారం గని లాంటిది.  ఈ ఫేసుబుక్ (వాట్సాప్) నేను రాసిన ఎన్నో సానుకూల రచనలు, కవితలకు వేదికగా ఉంది. నా రచనలకు వెచ్చించిన సమయం కంటే, వృధా చేసిన సమయమే ఎక్కువ. వృధాను ఆపేస్తే విలువైన విశేషమైనవి రావు అనిపించింది.  బంగారం కోసం తవ్వినప్పుడు ముడి సరుకును బయటికి తీస్తాము, దానిలో ఎక్కువ వ్యర్ధాలు ఉంటాయి, వాటిని శుద్ధి చేస్తేనే స్వచ్ఛమైన స్వర్ణం తయారవుతుంది.‌ ముడి సరుకు లేకుండా బంగారం రాదు, కాబట్టి బంగారం కోసంగా ముడి సరుకును (వ్యర్ధాలను) తీసుకోవలసి ఉంటుంది మరియు శుద్ధి చేసి స్వచ్ఛమైనది తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల ఇలాంటి అంశాల నుంచి మంచి పొందాలంటే దుర్ఘుణాలను స్వీకరించి వదిలేయాలి.  బంగారం కంటే విలువైనవి కూడా ఉన్నాయి, వాటిని సాధించాలని ఉంది. 💭⚖️🙂📝@🌳 📖04.02.2026✍️  

VK Rachakonda Trip (Telugu 01.02.2026)

చిత్రం
⚛️🪷🌳 సంఘ సభ్యులు  (జ్ఞాన)సరస్వతీ సంస్థ సంస్థాపకుడైన సదానందం సహాయంతో సిద్ధమై  వివేకానంద కేంద్ర  వైభవంగా కృతిపరిచి సామూహికంగా సాగిన  పర్వతారోహణ ప్రయాణం  రాచకొండ కోట  రాతి కొండలనుకున్న కానీ కనిపించని చరిత్ర చూసి ఆశ్చర్యం అనిపించింది. కొంతకాలం కాకతీయ  పరిపాలన పరిధిలో  తదనంతరం తదనుగుణంగా  రేచర్ల రాజుల రాజధానై రాణించింది. భాగ్యనగరానికి భాగంగా  ఉండి ఉన్న  తొలి తెలంగాణ  రాజధాని రాచకొండ. ప్రకృతిలో పొందుపరిచిన  కొండలు కొనలు  కార్తీకాన కాంతితో వెలిగే వన్నెల కోటపై కోవెలలు స్థానిక సంస్కృతిని  తతంగాలను తెలుపుతూ  వచ్చిన వెంకటేశ్వర్లు, సహావాసంగా సభ్యులతో తృప్తిగా తిరిగాము. 💭⚖️🙂📝@🌳 📖01.02.2026✍️

Rachakonda Fort (Telugu 01.02.2026)

చిత్రం
⚛️🪷🌳  రాచకొండ పర్వతారోహణకై రాజమార్గంలో ప్రయాణిస్తూ పంట పొలాల దగ్గర దిగి  తీసుకున్న తీపి చిద్విలాస చిత్రం 💭⚖️🙂📝@🌳 📖01.02.2026✍️ -------------------------- రవళి వేల రాతిపై  అలా ఆసినమై  మోముపై మందహాసంతో   తీపిచ్చుకున్న తాజా చక్కని చిత్రం  💭⚖️🙂📝@🌳 📖01.02.2026✍️ -------------------- రాతి కొండల రాచకొండ కోటపై తీసుకున్న తీపి  చిద్విలాస చిత్రాలు  వొకే వస్త్రమైన వివిధ వెలుతురుల వలన  వివిధ రంగులలో  వివిధ రకాలుగా  కనపడుతున్నాయి కదూ... 💭⚖️🙂📝@🌳 📖01.02.2026✍️

Kanneganti Brahmanandam (Telugu 01.02.2026) కన్నెగంటి బ్రహ్మానందం

చిత్రం
⚛️🪷🌳  వడ్రంగి వృత్తిలో వున్న (నాగ) లింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు దైవానుగ్రహంతో చక్కగా చాగంటివారిపాలెంలో  పురుడు పోసుకుని  సత్తనపల్లి శరభయ్య పాఠశాలలో పదవతరగతి వరకు విద్య  పొంది, పశ్చిమగోదావరి  భీమవరంలో బసచేసి  ఇష్టంగా ఇంటర్మీడియట్  డిగ్రీ దాక  పూర్తిచేసుకున్న ‌పిమ్మట గాఢంగా గుంటూరులో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పొంది అత్తిలిలో అధ్యాపకునిగా  కుదురుకున్న కాలంలో  కళాశాల కార్యక్రమాలలోని సాంస్కృతిక బృందాలలో స్వర అనుకరణలు  చేస్తూ చురుకుగా  పాల్గొంటూ, ప్రశంసలు పొంది  స్నేహితుడి సిఫార్సుతో దూరదర్శన్ ధారావాహిక “పకపకలు”లోని ప్రదర్శనతో ప్రేక్షకాదరణ పొంది,  గాఢమైన ప్రతిభను గుర్తించిన చలనచిత్ర దర్శకులు  “సుబ్రహ్మణ్య శాస్త్రి (జంధ్యాల)” “వేజళ్ల సత్యనారాయణ” చెల్లిన దారిలో  తొలిసారిగా శ్రీ తాతావతారంలో నరేష్ నలుగురు నేస్తాలలో  ఒక్కడిగా ఒదిగి నటించినా… మొట్ట మొదట  విడుదలైన విశేష  చిరస్మరణీయ చిత్రం “ఆహనా పెళ్ళంట”తో  అరగుండుగా అద్భుతమైన  ప్రశంసలు పొంది, పరిశ్రమలో  సుస్థిర స్థానానికి శ్రీకారంచు...