Posts

Showing posts from November, 2025

Ravi Agraja's Birthday (Telugu 29.11.2025)

Image
⚛️🪷🌳 ప్రభాకరుని ప్రకాశం వసుమతి వర్చస్సులతో దంపతులకు దివ్య సంతానంగా సాధికారికంగా  నాగపూర్ నందు పుట్టి పెరిగి స్నేహితుడి సాంగత్యంలో  వివేకానంద కేంద్రకు క్రమంగా వస్తూ ప్రయత్నాలు, పద్ధతులకు ఆకర్షితుడై అంతర్లీనం  చేసుకుని, చేరి  నియమాల నిర్ణయంతో క్రమశిక్షణా కార్యదక్షుడివై బహు భాషావేత్తవై సుసంపన్నమైన సానుకూలతతో సైనికుని సౌష్టవం మానసిక నిపుణుడి మది కలిగి కోమల  పరిపక్వత ప్రయత్నాలతో పౌర ప్రజలకు  సున్నితులకు, సంపన్నులకు దగ్గరవుతూ దిగ్విజయంగా  వివేకానంద కేంద్రను వివిధ క్షేత్రాల్లో విస్తరణకు కీలకంగా ఉంటూ ఉన్నతంగా ఆజానుభాహుడిగా అజాతశత్రువై అందరివాడిగా అందనివాడిగా చిద్విలాసంగా చిరస్మరణీయంగా రాణిస్తున్న రవి అగ్రజులకు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖29.11.2025✍️ x

Aruna Sri Birthday (Telugu 24.11.2025)

Image
 ⚛️🪷🌳 హేతువాది హరిరాఘవ గారి కథనంతో కనుగొని  ఫేస్‌బుక్‌లో పరిచయంతో "ప్రత్యేకత"  "ప్రకృతి" వివిధ విషయాల సంబంధిత సంపాదకీయాలతో తాదాత్మ్యంగా తెలుసుకున్నాను కంచు కంఠం కలిగిన  కోమల కాంత ప్రిలిమ్స్ పాసైన పండితురాలు విశాఖపట్నం వాస్తవ్యురాలు,  విశ్లేషణ విహంగి  అభ్యుదయ అభిప్రాయాల  అరుణశ్రీ అక్క ప్రత్యక్షంగా మన మధ్య పలుకులు  లేకపోయినా, లిఖితపూర్వకంగా  సంభాషణలు సాగించినందుకు  సంతోషిస్తూ,  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖24.11.2025 ✍️ https://bharghavashyam.blogspot.com/2023/05/discussions-on-uniqueness.html

Matriarchy (Telugu 23.11.2025)

Image
⚛️🪷🌳  ధృతి అమ్మ స్వాతి, స్వాతి అమ్మ మాధవి, మాధవి అమ్మ అన్నపూర్ణ, అన్నపూర్ణ అమ్మ లక్ష్మీనరసమ్మ, లక్ష్మీనరసమ్మ అమ్మ మహాలక్షమ్మ, మహాలక్షమ్మ అమ్మ సీతమ్మ 1.సీతమ్మ  2.మహాలక్ష్మమ్మ 3.లక్ష్మీ నరసమ్మ  4.అన్నపూర్ణమ్మ  5.మాధవమ్మ 5.స్వాతమ్మ 7.ధృతమ్మ మృదువైన మాతృస్వామ్య  ఏడు తరాలను ఏకం చేసిన  ఈ చిరస్మరణీయ చిత్రం తరాలకు తార్కానంగా  వారసత్వ వారధి  కలిగి కమనీయంగా  ఉన్నతంగా ఉంది. 💭⚖️🙂📝@🌳 📖23.11.2025✍️

Eknath Ranade (Telugu 19.11.2025)

Image
⚛️🪷🌳   రామకృష్ణ రమాబాయి  ధార్మిక దంపతులకు  ప్రార్ధన ఫలితంగా  ఎనిమిదివవానిగా ఏకనాథ్ రానాడే జన్మించి రాణిస్తూ,  దైవ రూపంలో దర్శించిన లోకమాన్య చిత్రం చూసి లోతుగా  ప్రేరణ పొంది  సమాజ సంక్షేమానికి  నిలబడాలని నిర్ణయానికి  వచ్చిన వాడై  తత్వచింతనతో తాత్వికశాస్త్రంలో  పట్టా పొంది  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో రాణించి సర్వసంఘ సంచాలక కార్యదర్శిగా ఎదిగి ఒదిగి సాగుతున్న సమయంలో స్వామి వివేకానంద శతాబ్దుత్సవాలలో వివేకానందునికి వ్యక్తిగత  నివాళిగా నిలిచే హిందూజాతికి మేలుకోలుపు పుస్తకం ప్రారంభించి పూర్తిచేస్తున్న  సమయంలో కన్యాకుమారి స్థానిక  వ్యక్తులు వివేకానంద విగ్రహావిష్కరణకై  రామకృష్ణమఠం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సంప్రదించిన సమయంలో  ఆచార్యుల ఆదేశానుసారం  కన్యాకుమారి కడలి వద్ద వివేకానందుని  శిలా స్మారక స్థాపన స్వప్న సాకారనికై సంకల్పించి సాధికారతతో సాగిన  ప్రామాణిక ప్రయత్నాలలో ప్రతికూల పరిస్థితులను  దాటుకుంటూ దృఢంగా నిర్మాణానికై నిల్చుని  రాష్ట్రీయ రాష్ట్రాలును ప్రభుత్వాధికారులు  ప్...

Generalized Childhood Memories (14.11.2025)

Image
⚛️🪷🌳 సుమారు ఏదో సమయాంలో  పసి ప్రాయపు  బాల్యాన్ని భావనలోకి  తాదాత్మ్యంగా తీసుకొరావడానికి, పసితనాన్ని పునఃపరిశీలించడానికి  కొన్నింటిని కృత్రిమ మేధ మనకు  మధుర స్మృతిగా మనముందు  ఉన్నపలంగా ఉంచేసింది 💭⚖️🙂📝@🌳 📖14.11.2025 ✍️ 📸©️: #అనామిక

On Cricket (Telugu 03.11.2025)

Image
⚛️🪷🌳   క్రికెట్ అనేది భారతదేశంలో భావాత్మకంగా మతంలాగ కొనసాగుతుందంటారు. ఇప్పుడు అది అంత తీవ్రంగా లేకపోయినా ఏదో ఒక విషయంలో దానిమీద సానుకూలంగానైనా లేదా ప్రతికూలంగానైనా లేదా తటస్థంగా నైనా దృష్టి పెడుతూనే ఉంటాం. క్రికెట్ కేవలం ఆట కాదు అది ఒక సామూహిక అనుభూతి అనిపించింది. కపిల్ దేవ్ నాయకత్వంలో 1983లో వచ్చిన ప్రపంచ కప్ విజయం, ధోని నేతృత్వంలో 2011లో ముంబైలో గెలిచిన ప్రపంచ కప్ కేవలం క్రీడా ఘట్టాలుగా మాత్రమే కాదు, ఇవి భారతీయుల జీవితాల్లో క్రికెట్ ద్వారా పొందిన ఒక భావోద్వేగ శిఖరం అనిపించింది. ఈ గెలుపులు దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చాయి. పేద, ధనిక, గ్రామీణ, పట్టణ ప్రజలందరూ ఒకే జెండా క్రింద ఆనందించగలిగారు. ఆ గెలుపు ఒక జాతీయ గర్వం, ఒక భావాత్మక ఉత్సాహం. భారతీయుల జీవితంలో ఒక దశాబ్దాల కాలానికి సరిపడ అద్భుతమైన ఉద్వేగ మధుర స్మృతిగా అనిపించింది.  ధోనీ నేతృత్వంలో 2007 టీ20 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, విరాట్ కోహ్లీ సారధ్యంలో 2016 నుండి 2020 వరకు అగ్రగామ్య టెస్టు జట్టుగా ఉండడం అనేవి మంచి జ్ఞాపకాలుగా ఉన్నాయి. ఇక వరిష్ట (సీనియర్) పురుషుల 2015 & 2019 ప్రపంచ కప్పు ఆటలో భారతదేశం స...

Women's World Cup 2025 (Telugu 02.11.2025)

Image
⚛️🪷🌳 క్రికెట్ క్రీడలో  విశ్వ విజేతకై  నారీమణుల నడుమ  సాగిన సంగ్రామంలో  భాగమైన భారతదేశం ఆతిథ్యం అందిస్తూ  ఆడిన ఆటలలో ఘనంగా గెలుపులతో మొదలై, మధ్యలో  ఓటమిలలో ఓదార్చుకుని సంకల్పంగా సరిదిద్దుకొని ఆఖరిన అర్హత  సాధించి, సెమీఫైనలులో అద్భుతమైన ఆటతో  అదరహో అనిపించి  ఆశలు అందించి అందలాన్ని అందుకున్న మహిళా మణులు... ఆట అసాంతం  అద్భుతమైన ఆరంభాలతో పరుగుల ప్రవాహం పారించిన ప్రతీక, స్థిరంగా స్మృతి, స్ఫూర్తిగా సారధ్యంలో హార్దికంగా హార్మన్, అన్నివిధాలుగా అటు బ్యాటింగ్ & బౌలింగులో దేదీప్యమానంగా దీప్తి  జ్ఞాపకంగా జెమీనా సంతృప్తిగా శ్రీచరిణి తీసిన విలక్షణ వికెట్లు,  వికెట్ల వెనుక కాపు కాసిన  రిచా ఘోష్,  ప్రశాంతంగా పనిచేసిన  అమన్ జ్యోత్,  ఆఖరి ఆటలో సమర్థంగా షెఫిలీ అలా అందరూ  సమిష్టిగా సాధించిన  తొలి తాదాత్మ్య ప్రఖ్యాత ప్రపంచకప్పు మురిపెంగా ముద్దాడిన  మహిళలకు మనసారా  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖02.11.2025✍️ (జిఎంటి)