Women's World Cup 2025 (Telugu 02.11.2025)
⚛️🪷🌳
క్రికెట్ క్రీడలో
విశ్వ విజేతకై
నారీమణుల నడుమ
సాగిన సంగ్రామంలో
భాగమైన భారతదేశం
ఆతిథ్యం అందిస్తూ
ఆడిన ఆటలలో
ఘనంగా గెలుపులతో
మొదలై, మధ్యలో
ఓటమిలలో ఓదార్చుకుని
సంకల్పంగా సరిదిద్దుకొని
ఆఖరిన అర్హత
సాధించి, సెమీఫైనలులో
అద్భుతమైన ఆటతో
అదరహో అనిపించి
ఆశలు అందించి
అందలాన్ని అందుకున్న
మహిళా మణులు...
ఆట అసాంతం
అద్భుతమైన ఆరంభాలతో
పరుగుల ప్రవాహం
పారించిన ప్రతీక,
స్థిరంగా స్మృతి,
స్ఫూర్తిగా సారధ్యంలో
హార్దికంగా హార్మన్,
అన్నివిధాలుగా అటు
బ్యాటింగ్ & బౌలింగులో
దేదీప్యమానంగా దీప్తి
జ్ఞాపకంగా జెమీనా
సంతృప్తిగా శ్రీచరిణి
తీసిన విలక్షణ వికెట్లు,
వికెట్ల వెనుక కాపు కాసిన
రిచా ఘోష్,
ప్రశాంతంగా పనిచేసిన
అమన్ జ్యోత్,
ఆఖరి ఆటలో
సమర్థంగా షెఫిలీ
అలా అందరూ
సమిష్టిగా సాధించిన
తొలి తాదాత్మ్య
ప్రఖ్యాత ప్రపంచకప్పు
మురిపెంగా ముద్దాడిన
మహిళలకు మనసారా
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖02.11.2025✍️ (జిఎంటి)

Comments
Post a Comment