Posts

Showing posts from February, 2024

Karunakar

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము అఖిల నీకు అందిన నక్షత్రం నీ భాగ్య భాగస్వామి తను అనుబంధాన్ని అందాన్ని  ఆనందాన్ని అందించే అర్థాంగిగా అదృష్టం అవుతుంది అనిపించింది. తల్లి తండ్రులు తలిచి తెరిచిన తొలి పరిచయ పలకరింపుతో ప్రేమ ప్రయాణం ప్రారంభించి కళ్యాణంతో కలవబోయే  భార్యాభర్తలగా బాధ్యతలు  పంచుకుంటూ ప్రేమ పెంచుకుంటూ  సంతోషంతో సాగాలని కోరుకుంటున్నాను కరుణాకర్ 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity --------- కరుణాకర్ కోసం రాసిన రచన సుమధుర సుభాషణ స్నేహ నీ మీద నాకున్న మంగళమైన ప్రేమ పతాకస్థాయిలో  ప్రవహిస్తున్నప్పుడు పెదాలపై  పదాలు పలుకక లేక మనసులో మారుమోగిన భావాత్మకతను అను'భవించి' పదాలతో పద్యం రాస్తూ ప్రేమని పంచుతున్నాను.  శేఖర (శిఖరం) స్నేహ (సన్నిహితం) శిఖరంత సన్నిహితంతో ఒకరికొకరుగా ఒకటై కాల చక్రంలో చిరు కాంతిలా సమతుల్యంతో సాగాలని అభిలాషీస్తూ ఆకాంక్షిస్తూ  నీ ప్రేమకై నిరీక్షిస్తూ పరితపిస్తూ తాదాత్మ్య తత్వాన్ని తెలుపుతూ స్నేహకు సానుకూల స్ఫూర్తితో రాజశేఖర్ రాసినలేఖ. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్త...

Geeta Vellanki

 EnTREE     ⚛️🪷🌳     కల్పవృక్షము గీత  వెల్లంకి/Geeta Vellanki కాఠిన్య కాలక్రమ నుడుమ నడిచిన కమలంలా కోమల కవియిత్రి (సరైన) కచ్చితమైన సూటి కోపం  సున్నితమైన స్వతంత్ర సుభాషణం  పద్యాలతో పరిచయమయ్యారు.  వంశీ విరించిల వారి నేస్తంలా పరిచయమై  కాఫీ కవితల మీద మమకారం కలిగిన వారిలా ముద్రపడింది.  గట్టిగా కనిపించే గీతకు  వంశీ విరించిల నేస్తమైన వెల్లంకి  గారికి హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Sanjana

 EnTREE     ⚛️🪷🌳     కల్పవృక్షము కెమెరా కంటితో పరిచయమైన ప్రకృతినే వైవిధ్యమైన విధంగా  సృజనాత్మకంగా సుందరంగా  చూస్తూ చూపించే  చిత్రాల చిత్రకారుని  సంజనకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Ratha Saptami (రథసప్తమి)

Image
 EnTREE     ⚛️🪷🌳     కల్పవృక్షము రథ సప్తమి అంతరిక్షంలో ఉంటూ  అవనికి ఊతంగా  తెల్లవారుజామున తూర్పున సుప్రభాత సమయంలో  ఉదయిస్తూ ఉదాత్తంగా అందించే ఆరోగ్యం. సంధ్య సమయంలో  పశ్చిమానికి ప్రయాణించి అస్తమిస్తూ అందించే  అందం అపురూపం.  రథసప్తమి రోజున సూర్యుని స్మరిస్తూ 🙏 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity -------------- కనువిందుగా కడపలో  సూర్యోదయ సూర్యాస్తమయ  చక్కని చిత్రాలు  📷: @2022 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Self Love Letter

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము స్వీయ ప్రేమ లేఖ ప్రియమైన భార్గవ శ్యామనికి నీ జీవన అస్తిత్వం రాయునది!!! ఒక చిన్న తీవ్రమైన అంతరంగిక ఉత్సహంతో, భవిష్యత్తు దృష్టి ఉండి, ప్రస్తుతంలో నా గత వ్యక్తిగత అనుభవాలు ఆధారం చేసుకుని నైరూప్యమైన భావనలతో... స్పష్టమైన సారాంశ పదాలతో ఈ లేఖని రాస్తున్నాను. నా హృదయం లో చాలా భాగాలు నీ యొక్క జ్ఞాపకాలతో నిండి ఉంది. ఇప్పుడు ఆ గడిచిన కాలాపు జ్ఞాపకాలు లేకుండా ఈ నిన్ను ఉహించలేకపోతున్నాను....  నీ గురించి ఆలోచించేటప్పుడు, గడిచిన కాలాన్ని గుర్తు చేసుకున్నప్పడు, నా మనసులో ఆలోచనలు/భావనలు చాలా అస్పష్ట ఆనందంతో మరియు స్పష్టమైన సమగ్రత సంతోషంతో అద్భుతంగా ఉంది. దాన్ని ఒక ఆతిశయంబైన సమతుల్య పారమర్దిక అనుభూతిగా నేను భావిస్తున్నాను.  నాకు ఈ అస్పష్ట స్పష్ట అంతరంగిక అనుభవాల గురించి, వాటి కాల పరిమితి గురించి నాకు తెలియదు. కానీ ఎందుకో, ఇది నీతో పంచుకోవాలి అని ఆరాటంగా ఉంది. నా ఆతిసయంబైన పారమర్దిక సమతుల్య అనుభూతికి ప్రేమ అని నామకరణం చేస్తూ  “నేను నిన్ను ప్రేమిస్తున్నాను”. నేను నీ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నువ్వు నీ స్వీయ స...

Padmaja BLR (స్పందన)

Image
 EnTREE     ⚛️🪷🌳     కల్పవృక్షము పద్మ స్పందన  ------------- అసలు పేరు ఆదమరిచేలా కలం పేరుతో కుతూహలంగా  (తగినవి, తగ్గట్టుగా తెలియజేస్తూ) ఆనందాన్ని అందాన్ని & ఆధ్యాత్మికతను ఆరాధించే అవనిగా వ్యక్తీకరిస్తూ వ్యక్తపరుస్తూన్న వనిత సాంప్రదాయ సాంస్కృతిక  సౌందర్యాది సుందర  సరళతను సాహిత్యలను  అనుభవ అనుభూతులను అక్షరంలోకి అనుసంధానిస్తూ.... సారాంశ సంపుటిలు రమణీయంగా రాస్తు సానుకూల సాధికార స్ఫూర్తితో  స్నేహితుల సంహితలకు స్పందిస్తూ సంభాషణలకు సాగిస్తున్న  సాధ్వీ స్పందన గారు మీకు హార్థిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity 24.11.2023 ఉదయం ఎవరి గోడ దగ్గరో బుద్ధుని లాంటి బొమ్మలు  బహుమతిగా ఇస్తే బాగుంటుంది అని చూసా....😁 బాగుంది.. !!కానీ  బహుమతి సందర్భానుసారంగా, తీసుకునేవారి వయసును బట్టి ఉంటే బాగుంటుంది.  ఒకరి పెళ్లికి ఈయన గిఫ్ట్ గా ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుని బొమ్మ తెచ్చి ఇచ్చారు.. దాని meaning...??🤔🙄🤐😃. So.... బహుమతి అర్థవంతంగా ఉండాలి...😁 #కబుర్లు 2...

Vamsi Kalugotla (వంశీ కలుగోట్ల)

 EnTREE     ⚛️🪷🌳     కల్పవృక్షము   "భార్గవ విషయ వ్యక్త రూపస్య వంశీ (Vamsi)" ఏమో అలా అనిపించింది అందుకే రాశాను. ఇది అతిశయోక్తి కూడా కావచ్చు!!  నా భావనలే తను వ్యక్తపరుస్తున్నాడా  నా కోసమేనా తను రాసేది అని అనిపించేలా చేసిన నా వాస్తవ వ్యక్తిగత  విషయ వ్యక్తరూప వ్యాసకర్త వంశీ (గారు).. 😇🙏 19 Apr 2021- (Bharghav Shyam) కోందరు అప్పుడప్పుడు ఆలోచనలకు వస్తూ ఉన్నా! శ్రద్ధ పెట్టి బహిర్గతం అవ్వము. ఒక ప్రత్యేకమైన రోజు కానీ, సందర్భం ప్రేరేపించినప్పుడు శ్రద్ధగా వారికి సంబంధించిన ఆలోచనల్లో లీనం అవుతాము.  వంశీ గారితో కేవలం ఆరు నెలలే పరిచయం, ఆ పరిచయం డు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ వారు నన్ను సిద్ధాంతికంగా ఒక సాహిత్య లోకానికి తీసుకెళ్లి రచనలతో రాణిస్తూ.. సాధారణమైన విషయాలలో ఉండే సౌందర్యాన్ని సామాజికాంశాలను చూపిస్తూ, నన్ను రమణీయపరుస్తున్నారు.  అద్భుత సాధారణ వ్యక్తిని తలుచుకుంటూ నివాళులర్పిస్తున్నను. ----- 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity