Padmaja BLR (స్పందన)

⚛️🛞🪷
పద్మ స్పందన 
-------------
అసలు పేరు ఆదమరిచేలా
కలం పేరుతో కుతూహలంగా 
(తగినవి, తగ్గట్టుగా తెలియజేస్తూ)
ఆనందాన్ని అందాన్ని &
ఆధ్యాత్మికతను ఆరాధించే అవనిగా
వ్యక్తీకరిస్తూ వ్యక్తపరుస్తూన్న వనిత

సాంప్రదాయ సాంస్కృతిక 
సౌందర్యాది సుందర 
సరళతను సాహిత్యలను 
అనుభవ అనుభూతులను
అక్షరంలోకి అనుసంధానిస్తూ....
సారాంశ సంపుటిలు
రమణీయంగా రాస్తు
సానుకూల సాధికార స్ఫూర్తితో 
స్నేహితుల సంహితలకు స్పందిస్తూ
సంభాషణలకు సాగిస్తున్న 
సాధ్వీ స్పందన గారు

మీకు హార్థిక హృదయపూర్వక 
జన్మదిన శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity



24.11.2023
ఉదయం ఎవరి గోడ దగ్గరో బుద్ధుని లాంటి బొమ్మలు 
బహుమతిగా ఇస్తే బాగుంటుంది అని చూసా....😁
బాగుంది.. !!కానీ 
బహుమతి సందర్భానుసారంగా,
తీసుకునేవారి వయసును బట్టి ఉంటే బాగుంటుంది. 
ఒకరి పెళ్లికి ఈయన గిఫ్ట్ గా ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుని బొమ్మ తెచ్చి ఇచ్చారు..
దాని meaning...??🤔🙄🤐😃.
So.... బహుమతి అర్థవంతంగా ఉండాలి...😁
#కబుర్లు


25.11.2023
కొన్ని ఆశలు నెరవేరక పోయినా...
కొన్ని ఊహలు స్వాగతించిన రేయిలో 
నన్ను నేను కోల్పోయిన తీరు... చెప్పగలనా..?🥰
#క్షణాలు 

26.11.2023
ఎప్పుడూ వుండే చంద్రుడేగా అని
పెదవి విరిచేవారికి అర్ధం కానిది...
ప్రకృతిలోని పరిపూర్ణతత్వం..🥰
కళ్లెదుట నిలిచే దైవత్వం...😁
#చల్లటి_తరంగాలు 

27.11.2023
చీకటి వెలుగుల వీడిపోని బంధం...
సుఖదుఃఖాలు జతగలిసిన చందం...
#ప్రకాశ_తరంగాలు 

29.11.2023
రెప్పపాటు దర్శన భాగ్యానికి 
చెమ్మగిల్లిన కంటిపాప..
వీడిరాలేని ఆనందనిలయం
ఇది నా అనుభవం..😊🙏
రాత్రి ఏకధాటిగా కురిసిన కుంభవృష్టికి, 
గిరులను కప్పేసిన పొగమంచుకి 
తడిసి ముద్దైన వెంకటాచల సౌందర్యానికి
ఏ పర్వత ప్రాంతం సాటి రాదు...🥰
#పరమానందం

30.11.2023
నిజమైన పండుగ,అసలయిన హక్కు...
తెలంగాణా ప్రజలు తప్పక ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....😁🤝
#ప్రజాస్వామ్య వేడుక 

01.12.2023
ఏకాంబరేశ్వర ఆలయంలో స్వామి సన్నిధిలో అత్యద్భుత దర్శనం ప్రశాంత వాతావరణంలో అయింది🙏

మానవ జన్మ ఉన్నతి పరమార్ధంగా నిర్మించిన 
ఈ పురాతన ఆలయాలలో ఏదో కనపడని ఆకర్షణ మనల్ని మన నుండి వేరు చేసి చూపిస్తుంది. 

ప్రవీణ్ అనే ఒక 23 ఏళ్ల అబ్బాయి Hyd నుండి 
కామ కోటి పీఠంలో ఆ vibe కోసం 4 days అక్కడే ఉండడానికి వచ్చాడట. ఎంత బాగా మాట్లాడాడో... 
ఈ తరం యువతలో ఒక వర్గం ఒక మంచి మార్పు దిశగా పయనించడం స్వాగతించదగ్గ విషయం..

భవిష్యత్ బాగుండాలి అంటే ఈ రోజు ఆలోచనపై అదుపు ఉండడం ఒక్కటే మార్గం. 
దానికి కావలసినదే సాధన...😊😁.
#కంచి ప్రయాణం 

02.12.2023
మనిషిని ప్రకృతి వైపు నడిపించి
మనుగడలో తనవంతు సాయం అందించి
ముందు గతికి వంతెన వేసేదే...
హైందవ ధర్మం.....🙏
#సంప్రదాయం

04.12.2023
సింహద్వారాలు....
మనలోకి మనల్ని పయనింపజేసే
హృదయ కుహరాలు.....💖
#ఉదయాలు💐#సంప్రదాయం 🙏

05.12.2023
దైవం ఏ ఒక్కరి సొత్తూ కాదు...
కర్మలకు అతీతంగా పాంచభౌతికతత్వంలో ఇమిడివున్న ఆ దైవత్వాన్ని మనసులో నిలుపుకోవడమే అంతిమంగా ఆ పరమాత్మ సూచించిన పరిపూర్ణతత్వం..😊😁
#సంప్రదాయం 

05.12.2023
నన్ను కోల్పోవడం చాలా తేలిక...😁
కానీ తర్వాత మర్చిపోవడమే.... కష్టం🥰
#తరంగాలు

08.12.2023
డబ్బుది ఏముంది అని చులకనగా చూస్తే 
తేరుకోలేని దెబ్బ తీస్తుంది...
పసిపాపలా పొదువుకుంటే 
పదికాలాలు కాపు కాస్తుంది.....😊
ఎంపిక మనదే...😁
#క్షణాలు

12.12.2023
కనపడని దూరాలు 
చేరుకోలేని తీరాలకు తరలిస్తే...
పేలవపు పలకరింపుల వంతెన 
ఇంకెంత కాలం కలిపి ఉంచుతుంది...?
విధి మీదకు నెపం నెట్టినా,
కన్ను కానని ఖైదులో 
జీవితకాలపు బందీనే....🥰
#క్షణాలు

13.12.2023
ఎంత చేసినా ఇచ్చేది అంతే కదా అని,
అంకితభావం లేకుండా చేసే పనివారు...
ఇచ్చే 10 రూపాయలకి ఒక్క పైసా వృధా కాకుండా 
పని రాబట్టాలి (వీలయితే ఒకింత ఎక్కువ). 
అనుకునే యజమాని😉.
(అందరూ అలా వుండరు 😁😊.)
#పెయింటింగ్ ప్రహసనం

16.12.2023
50 దాటాక ఏ మాత్రం ఆస్కారం వున్నా,
సరైన వనరులు వుంటే 
వదిలి వచ్చిన ఊరిలో వుండడానికి 
ప్రణాళిక చేసుకోవడం... 
అన్ని రకాలుగా, ముఖ్యంగా ఆరోగ్యపరంగా 
అతి ఉత్తమం.
ఎంత ఘనంగా ఉండే ఇంట్లో అయినా.. 
ఆ 1200 చ.అ.లలో తిరగడానికి, 
పచ్చని ప్రకృతిలో మసిలినదానికి 
ఎంతో తేడా ఉంది.

నాకున్న అతి కొద్ది మంది స్నేహితులలో 
ఇప్పుడే ఒకరు కాల్ చేసి తోట నుండి వచ్చిన ఆనందాన్ని ఆయన మాటల్లోనే వ్యక్తపరుస్తూ వుంటే (హైదరాబాద్ లో అదే ఉద్యోగం లో కొనసాగి వుంటే CEO స్థాయికి వెళ్ళేవారు).. చాలా సంతోషం అనిపించింది .😍
ప్రకృతికి దగ్గరగా సహజంగా వుండడమే బహుశా మనం పొందగలిగే అత్యున్నత పదవి ఏమో.....!!🥰
#మాటమంతి




29.12.2023
దుమ్ము ధూళి వారి సొంతం 😣😔
దిష్టి తగిలే అందాలను మనకు అందిస్తూ...
అసలు ఈ ఉత్తరప్రదేశ్ బీహార్ వాళ్ళు లేకపోతే
నిర్మాణరంగం నెమ్మదిస్తుంది అనడంలో
నాకు ఎలాంటి సందేహం లేదు...😊
#గౌరవం🙏

31.12.2023
మొదటిసారి గోడకి రంగుల కాయితాలు వాడాం,
కాస్త భిన్నమైన దృశ్యం కోసం...
ఆధునిక పెయింటింగ్ కన్నా ఈ ధోరణి
సులభం & తక్కువ ఖర్చు కూడా...
పైగా మార్పు చేయడం సరళం…
మీ ఇంట్లో ఎక్కడైనా మీరు ప్రయత్నించవచ్చు 🙂
#Trending

02.01.2024
ఈ గన్ పోలీస్ పని చేసేవారు 
ఆ రసాయనాలు చల్లడం వల్ల
ఊపిరితిత్తులు కలుషితమై తొందరగా చనిపోతారట....😣
తెలిసికూడా ఇలా.... బ్రతుకు పోరాటం.
మొత్తం మా రంగులద్దే పని వల్ల
సంతోషం కాక ఒకలాంటి నిర్వేదం వచ్చేసింది.
తళుకుల వెనుక కానరాని వెతలు చూసి.😊
#జీవన_శైలి

14.01.2024
పండుగ అయిపోతోంది...
కానీ ఇంకా మా ఇంటి పనులు మిగిలి ఉన్నాయి 🤭.
అయోధ్య రాముని అసలయిన పండుగకు
కచ్చితంగా అయిపోతాయి... 😁😃
అక్షతలు అందాయి...😊🙏
#పరమానంద క్షణం

15.01.2024
ఏదిపడితే అది తినేసి, 
ఎలా పడితే అలా మాట్లాడేసి, 
ఏ పదాలు పడితే అవి వాడేసి, 
ఎప్పుడు పడితే అప్పుడు పడుకుని లేచి, 
పోసుకోలు కబుర్లతో కాలం గడుపుతూ... 
ఇలానే బ్రతకాలి అని తెలియక 
ఏం చెప్పినా చెల్లుతుంది అనుకునేవారు కూడా 
మోదీ గారి గురించి వాగేవారే...!!🤔😃
చాలా హాస్యాస్పదం....😁😁
#ధర్మో రక్షతి రక్షితః

15.01.2024
వస్తువుల ఆస్తుల
ప్రదర్శన వల్ల...
పొందే ఆనందం, 
గౌరవం శాశ్వతమా....?😊
కానీ కాదు 😁
#అంతర్ముఖం

15.01.2024
ఏ కాస్త వైరాగ్యం కలిగించలేని
వ్యామోహం తగ్గించలేని
ఇహానికి కొంచెం అయినా దూరం జరపలేని 
భక్తి వ్యర్థం.......😊😁
#రాత్రి_స్థితి

22.01.2024
కుటుంబం అంటే నాలుగు గోడల మధ్యదా..?
నాలుగు దిక్కుల మధ్యదా...?😊😁🙏
#శుభరాత్రి

28.01.2024
"అవసరం" అనే మాట లేకపోతే (రాకపోతే)
బహుశా ఈమాత్రం బంధాలు కూడా
మిగిలేవి కావేమో...!!😁😊
#జీవన_శైలి

29.01.2024
నిన్నటి స్థితికి కృంగిపోక...
నేటి స్థితికి పొంగిపోక..
రేపటి తన పరిస్థితి 
ఎలాంటిదో ఎరుకగలిగి..
సిద్ధపడి, స్థితప్రజ్ఞత చూపడం....
యోగిగా మారిన మనిషికే సాధ్యం...🙏
#వ్యక్తిత్వం

31.01.2024
ఒక్క నిమిషం కుళాయిలో నీళ్లు రాకపోతే గగ్గోలు పెడతాం, మరి ట్యాంకులో సంపులో నీళ్లు పొంగిపొర్లతూ ఉంటే అస్సలు పట్టించుకోము.
ఇప్పుడు స్వయం నియంత్రణ వ్యవస్థతో బోలెడన్ని వున్నాయి కదా...! 
ప్రకృతి వనరులు అందరివీ కదా, అది కనీసం మన బాధ్యత కదా.....!! 
బిందెడు నీళ్ళ కోసం కిలోమీటర్లు నడిచే వీడియోలు చూస్తూనే వున్నాం...
#ఉదయాలు

31.01.2024
ఈరోజు భర్తల దినోత్సవం అని చూసా 🤭 నిజం...😃
ఏటికేడు కదలిపోతున్నా , 
కొట్లాట లేని రోజు లేకున్నా 🤭,
కొత్తదనం పోతున్నా ,
ఊరుతున్న ఊరగాయలా
ఊరిస్తూ సాగిపోతున్న మా ఈ బంధం... 🥰😃
#జీవన_శైలి

01.02.2024
ఏ కాస్త పుణ్యానికో
తల్లి గోదారి ఒడిలో పుట్టాను 🤗.
ఏమంత శాపానికో
దూర తీరాల తరలిపోయాను😔.
ఎన్ని వున్నా , ఏమరుపాటుగా కూడా
మర్చిపోలేని పుణ్యభూమి 
నా ఈ కోనసీమ లోగిలి 😍.
సేద తీరేది, ఒక్క ఆ జ్ఞాపకాల కౌగిలి 🤗.
ముక్తేశ్వరం రేవు 🙏

12.02.2024
కనుల తోటలో
పూసిన కలువలకెందుకు
ఇంతటి నిర్మలత్వం...!!

రానున్న ఘడియలలో
రాలుతున్న వెన్నెల తునకల
గాలివాటు రాగాలు పసిగట్టి
సెలయేటి అలజడుల సడికి
అప్పగించెనేమో...!!

అవునని చెప్పే ఆ పాత గాథలకు 
ఇప్పుడిక చింత లేదు...!!

రానున్నవి అన్నీ రాశులుగా కురిసే 
శుక్ల పక్ష వెలుగురేకలే....!!

వసివాడని ఆ మాలతీలత మురిపెం సాక్షిగా... 
ఇక అన్నీ వేడి సెగలే....🥰
#మనోహరి

14.02.2024
నేను గుడిలో దైవానికి పూజారిని
అవునో కాదో తెలియదు గానీ......
మా భారతికి మాత్రం సదా పూజారిని 🥺🙏

14.02.2024
గుండె లోతులలో నిలిచిన బంధానికి 
గుర్తుగా ఆత్మీయ భావన చూపడం తప్ప

ఏమి ఇచ్చుకోలేని స్నేహానికి
ఎద పరచడం తప్ప

ఏకాంత సేవల ఊసైనా
గగనమైన మమతల నీడన
ఈ వసంత కాలపు పంచమి
ఏకంగా నెమరువేసి వినిపిస్తున్న 
నెలరేడు ముచ్చట్లు ....
ఏమని తెలిపేది....!

విన్నవించేది...!!!

Happy valentines day....💖


16.02.2024
ఎవరి ప్రెజెన్స్ లో,
ఇంకేం వద్దు అనిపిస్తుందో..
ఎవరి సాంగత్యంలో 
బ్రతుకు అర్ధం ఇమిడి వుందో....
అదే అలనాటి ప్రేమ...🥰
#మల్లీశ్వరి

18.02.2024
Prepared గా లేకుండా
Instant గా తీసిన click లో
తళుకులు లేకపోయినా
జీవం ఉంటుంది....🥰😁😃
#Sunday Mngs 💐

18.02.2024
వంగ దేశం సాహిత్య, భక్తి వైరాగ్యాలకు,
పసందైన పదార్థాలకు పుట్టినిల్లు...💖
మొన్ననే ఈయన జీవిత చరిత్ర ఫిల్మ్
చూసాక బెంగాలీ భాష వచ్చి వుంటే
ఎంత బాగుండేది అనిపించింది...🙏
ఆయన జన్మదినం అట ..😊
#Today

25.02.2024
ఒక మనిషిని విమర్శించడానికి ముందు
మన అర్హత ఏమిటో చూసుకోవాలి కదా..!😁
#Proud

26.02.2024
డిమాండ్, సప్లై...
వీటిని బట్టి మారే 
ప్రేమ అనబడే అనుబంధంలో 
అంతర్గతంగా అవసరం మాత్రమే 
దాగి ఉంటుంది... 
అలవాటుగా మారుతుంది..
అది మాత్రమే ఒక్కటిగా 
కలిపి వుంచుతుంది...😁
#శుభరాత్రి

07.03.2024
ప్రొద్దుటే లేవడం అనే ఒక్క మంచి అలవాటు,
ఉన్న చెడు అలవాట్లను, ఆలోచనలను, 
రోగాలను దూరం చేస్తుంది....
Yess @Sunrise spot 
#Mngs

07.03.2024
దేవాలయం అంటేనే 
ఒక Pleasant positive vibe వున్న 
పవిత్ర స్థలం కదా....
ఎందుకు చాలా Serious mode లో వుంటారు, 
చాలా మందిని చూసా..
ఆ దైవం కూడా చిరుమందహాసంతో
వుంటాడు (ఉంటుంది) కదా...!!
మనం కూడా కాస్త నవ్వు మొహంతోనే
నమస్కారం చేద్దాం...😁🙏
#Festive mood

09.03.2024
ఈ నగరానికి ఏమైంది...?
మార్చిలోనే విపరీతమైన నీటి కరువు
అని News లో చెబుతున్నాడు..
(మా Borewell బాగుంది 🤗🙏.
చూడాలి, మే వరకూ.. 🙄)
పిచ్చుక గూళ్లులాంటి ఆకాశ హర్మ్యాలు లో
వలస పక్షుల జీవనానికి తగినట్లు
ప్రకృతి వనరులు పెరగవు కదా....!!🥺
#Life pattern

09.03.2024
ఒక ప్రశాంతత, ఒక సందేశం, 
ఒక మంచి ఆలోచన, ఒక సత్సంగం, 
ఒక ఆహ్లాద పరిసరం,
వెరసి ప్రకృతిలోని ఒక దైవత్వం....
అదే దేవాలయం.....🙏
@ Sri Govardhana Kshethra
     Bengaluru......

10.03.2024
ఆలోచనలో మార్పు రానంతవరకూ...
ఆచరణలో అణకువ లేనంతవరకూ...

ఆ సర్వేశ్వరుని దీవెన అందదు....😊
ఆడంబరాలకు హద్దు ఏముంది...?😁
#Life pattern

12.03.2024
అది ఎలా ఉన్నా సరే....
Accept Our own life....🥰
to make the journey Simple..😁😊

14.03.2024
తప్పు ఒప్పుకుని తగ్గడం కూడా..
తాత్కాలిక సమస్యకు, ఉపశమనమే...😊
ముందడుగుకు తోడయ్యే పరిమళమే....🥰
#Mngs 💐

15.03.2024
అసలు ఈ తమిళనాడు ఏలిన ప్రభువుల అభిరుచికి, శిల్పుల పనితనానికి, మానవ మనుగడ ఉన్నతికి 
దిశా నిర్దేశం చేసిన హైందవ ధర్మానికి పొగడడానికి అక్షరాలు, మాటలు సరిపోవేమో....!!

గుండె నిండుగా నింపుకునే ఆ అనుభూతులు, 
కంటి నిండుగా వెలుగు నింపే 
ఆ కట్టడ వైభవాలు తప్ప...
మనతో ఇంకేం తీసుకు వెళ్లగలం...!!

గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేయబడ్డ దేవతామూర్తుల 
ఆ నాలుగు ఘడియల సాంగత్యంలో జన్మకు సరిపడా ఆశీర్వాదం తప్ప... ఇంకేం మనం ఆశించగలం....🥺🙏
@Kancheepuram
Memories

17.03.2024
మురిసిన క్షణాల నెమరువేత,
మందగించిన అడుగులకు 
చేయూతగా మారునేమో....!!🥰

రతనాలు రాశులుగా పోసి అమ్మిన
రాయల శిథిల వీధుల దారుల.....@హంపి
#Mngs 🌻

19.03.2024
వయసుతో పాటు మారుతున్న 
Priorities గుర్తించి, 
అనుగుణంగా ముందుకు సాగడానికి
అనువైన బాట వేసుకోకపోవడమే.....
"ఫెయిల్యూర్"😊😁
#Mngs 💐

21.03.2024
హద్దులు, నిర్దేశాలు వుంటే 
అది కవిత్వం ఎలా అవుతుంది.....?

జిహ్వకో రుచి అన్నట్లు 
మనసుకో ఆలోచన.....🥰

ఆలోచనలో నిగూఢంగా వున్న 
భావానికి అక్షర రూపం కవిత....☺️

ఇష్టంగా మాట్లాడినా, 
వెక్కిరింపు కు గురి అయినా, 
హేళన చేసినా.....
ఆ భావం అచ్చంగా ఆ మనసు సొంతం...🌷

అసలు అక్షరాలను ముత్యాలుగా పేర్చాలి 
అనే తలంపునే ఒక blessing అనుకోవాలి...😍

భావాన్ని పదాల మాలగా అల్లి 
ఉద్వేగానికి చరమ గీతం పాడడం 
అనేది...Truely its an art...💖

ఇందులో తూకంలో కొలిచి 
సత్కారాలు చేసే అంశాలు ఉన్నా లేకున్నా....
అందులో దాగిన ప్రతి అర్ధం వెనుకా, 
ఆ కలాన్ని కదిపే మనసు చూసిన 
ఒక అద్భుత సన్నివేశం వుండి తీరుతుంది....

చెప్పించిన సందర్భం 
సిరాలో కలిసిపోతుంది.... 
అప్పటికి శాంతిస్తుంది....😊

కొంచెం ఎక్కువగా చెప్పానేమో..🤔😁😃

#ఎందరో మహానుభావులు 🙏

22.03.2024
(Emotional bonding....)
భావోద్వేగ బంధం 
అది మనుషులతో అయితే దుఃఖమే...
అదే ప్రకృతితో, అంతర్లీనం అయిన
ఆ దైవంతో పెంచుకుంటే
వేరు కాలేని భావనే....🥰
#Mngs 🌺🌞

30.03.2024
పంచుకుని తినడంలోని ఆనందం
అనుభవంలోకి వస్తేగానీ తెలియదేమో...!😁
ఆధ్యాత్మికతలా...😊
#గోదారి డైరీస్

03.04.2024
దేనికి ఎంతవరకూ
స్పందించాలో తెలియడమే
వివేకమేమో....!!
దానితోనే మనసుకు 
ప్రశాంతత ఏమో....!!
పదిమంది కావాలి అనుకుంటే
అదే ఒక తారక మంత్రమేమో...!!😁
@గోదారి డైరీస్

04.04.2024
కాల గమనంలో మన పాత్ర అత్యల్పం
అని గ్రహించడమే.. వేదాంతధోరణి నా...🤔
#Mngs💐
#గోదారి డైరీస్

09.04.2024
మధుర స్వప్నం కనుమరుగైనా...
వెంటాడే తీయదనం...
అదొక అనుభూతి..🥰
#Moments 💖

11.04.2024
ఎక్కడో చదివినట్లు....
ప్రశాంతత కోసం మనిషి ప్రపంచం చుట్టినా,
అది తన ఇంటి గడపలోనే పొందుతాడు..
నిజం....😁
#Life pattern






13 Dec 2023
Crash.....
ఎంత చేసినా ఇచ్చేది అంతే కదా అని,
అంకితభావం లేకుండా చేసే పనివారు...
ఇచ్చే 10 రూపాయలకి ఒక్క పైసా వృధా కాకుండా 
పని రాబట్టాలి (వీలయితే ఒకింత ఎక్కువ). 
అనుకునే యజమాని😉.
(అందరూ అలా వుండరు 😁😊.)
#పెయింటింగ్ ప్రహసనం

14 Dec 2023
Pic పెడితే సరిపోద్ది కదా 🤔😍
ఓ... తెగ రాసేయకపోతే...🤨🧐😆
#సాయంత్రాలు ❄️



Comments

  1. Thankuuuuuuu 🥺🤝🥰My dear 🌷Stay blessed....
    I didnt expect all this...u have made my day...💖💖🙌🏻

    ReplyDelete
  2. ఇంత ఇలా నువ్వు గమనిస్తున్నావు అని నేనెప్పుడూ అనుకోలేదు....
    Thanku so much 😊

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao