Discussion & Judgement

భాస్కర్: 
ఆల్కహాల్ సేవించడం లో 3rd place lo మన బంగారు తెలంగాణ 😀

మల్లేష్:
తాగే వాళ్ళందరూ చెడ్డవారు కాదు, తాగనోళ్ళు అందరూ సుద్ద పూసలు ఎం కాదు...
ఏదైనా విమర్శ చేయాలి అంటే ఇష్యూ బేస్డ్ ఉండాలి, అదేదో తెలంగాణ మొత్తం అన్నట్టు ఎంటి ఆ రాతలు, ఇది బంగారు తెలంగాణ అని ఎంటి, తెలంగాణ అంటే అర్ధం తెలియక పోతే తెలుసుకో భాస్కర్!...
అనవసర కామెడీలు పెట్టీ తెలంగాణ అంటే తాగుడు అన్నట్టు అడ్డమైన పోస్టులు ఈ గ్రూపులో పెట్టకు...

భాస్కర్:
🙏 పటేలా ఎందుకు అంతలా ఎమోషనల్ ఔతున్నవు నువ్వూ తప్పుడు ప్రచారం చేస్తున్నావు నేను తాగే వాళ్ళు చెడ్డవారు తాగనోల్ల్లు బుద్ధిమంతులు అని నేను అన లేదు అది తప్పని నిన్ను నన్ను చూస్తేనే తెలిసిపోతుంది. అయినా పాపం వాళ్ళు తాగి డబ్బులు ఖర్చు చేసుకుని health పాడు చేసుకుని గవర్నమెంట్ కి ఆదాయం ఇస్తెనే కదా మీ mummy ki మా డాడీ కి పింఛను మన ఆడ పదుచులకు బతుకమ్మ చీరలు వచ్చేది😀.

Chill chill patela అంత hot ఐతే ఎలా విమర్శల కోసం పెట్టలే జస్ట్ ఫన్నీ గా పెట్టిన మేము సదుకొలే మాకు అంతలా జ్ఞానం లేదు కాబట్టే మీ లాంటి మేధావులు అపర చానుక్యులు మా లాంటి వాళ్లకు తెలిసేలా చెప్పాలి కదా కొప్పడిత్ ఎలా. పోస్ట్ లు పెట్టోధంటే ఎలా తెలియని వి తెలుసుకుంటాం తప్పేముంది.

K మన బంగారు తెలంగాణ లో బై ఎలక్షన్స్ అనే సినిమా chusinav కదా గా సినిమా స్టోరీ రెండు వాక్యాల్లో చెప్పు patela కోపమొద్దు be cool. నిమ్మలం.

Patela కోపమొద్ధు మా లాంటి uneducated వాళ్ళని మీ లాంటి educated persons guide cheyyali thappa సీరియస్ అవ్వ కూడదు.

మల్లేష్:
తాగుడు లో ఇది మన బంగారు తెలంగాణ అనేది ఏంది!?
తెలంగాణ తాగుడు అన్నట్టు ఎం రాత!?
ఎన్నో రంగాల్లో దేశంలో రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది మన రాష్ట్రం ఆ మంచి కనిపించదా!!! 
ఇది మన బంగారు తెలంగాణ అవమానించడం ఎందుకు! రాష్ట్రం పట్ల వెటకారం మాను! ప్రభుత్వానికి ఆదాయం ఎదో మొత్తం తాగుడు నుండి వస్తుంది, చీరలు పింఛన్లు ఎంటి! ఆదాయం మార్గంలో లో రెవిన్యూ ఆదాయం, gst పన్నుల ఆదాయం, ఇంధన ధరల టాక్స్ పన్నులు, ఇతర ఎన్నో మార్గాల ద్వారా ఆదాయం రాష్ట్రీనికి వస్తుంది. తాగుడు తో వస్తుంది అనే ఇంకో తప్పుడు రాతలు రుద్దకు, మీ రాజకీయాలు ఏమైనా ఉంటే బయట చూసుకోండి.

నువ్వు అనే దాని ప్రకారం, మన ఒకప్పటి ఫౌండేషన్ లో ఒక్క భార్గవ్ గారు తప్ప ఎక్కువ మందికి మందు అలవాటు ఉంది. అప్పుడు తాగుబోతుల ఫౌండేషన్ అనేలా ఉన్నారు!?
మీ పోస్ట్ ఫన్నీ లా లేదు పరోక్షంగా తెలంగాణ అంటే తాగుడు అనేలా అంటున్నావు, దానికి మాత్రమే వ్యతిరేకం. అందులో కోపం ఎం లేదు...

చీరలు, పింఛను కి తాగుడు ఆదాయం తో రావు, రోజు మనం కొనే ప్రతి వస్తువు నుండి టాక్స్ రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది. అందులో ఉప్పు పప్పు ఇంట్లో సామాను నుండి మొదలు పెడితే ఎన్నో వాటికి మనం పరోక్షంగా పన్నుల ద్వారా ఆదాయం ఇస్తాము. తాగుడు ఒక్కటే కాదు భాస్కర్!

భాస్కర్:
నువ్వు మరీ డీప్ గా వెల్లినవ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. మనిషికి కాస్త కళా పోషణ ఉండాలి. అదేదో భూతు మాట లాగా ఫీల్ ఔతున్నవ్.

మల్లేష్:
సీరియస్ ఏమి లేదు! తెలంగాణ అర్థం కాకుంటే పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించు. అంతే కానీ ఇలా నీ అభిప్రాయాలు రుద్దవద్దు భాస్కర్!
ఒకప్పుడు నువ్వే అన్నావు మంచి చూడాలి అని! మీరు చూసే మంచి ఇదేనా!

భాస్కర్:
అదే మరి మనకు కావల్సినంత ఆదాయముంది మందు మానుకుంటే తప్పేముంది. మందు తాగితే తప్పేంటి అని వాళ్ళని miss guide చెయ్యొద్దు. మేధావులు మీరే ఇలా కరెక్ట్ గా అర్ధం చేసుకోక పోతే ఎలా. పిల్లలను చెడగొట్టే ప్రయత్నం చెయ్యొద్దు. వాళ్ళు తాగిండ్రు వీళ్ళు తాగితే తప్పేంటి అంటే నాకేమీ నష్టం లేదు తాగుండ్రి తరువాత భాధ పడుండ్రి చెపితే విననొడిని మనం ఏమి చేస్తాం.

మల్లేష్:
ఆ చివర్లో రాసిన రాత ఏ రకమైన కళా పోషణ చెప్పు గురూజీ!?
మరీ అంతలా రాస్తారా!!
మిస్ గైడ్ చేయలేదు, ఇదిగో ఇది మన బంగారు తెలంగాణ అని అంటున్నారు. దాని గురించి మాత్రమే చెప్తున్నా!

ఏ మనిషి స్వతహాగా మంచి వారు కారు, చెడ్డవారు కారు, పరిస్థితులు మనిషిని మార్చేస్తాయి. 
తాగుడు పట్ల నేనెవర్ని ఎంకరేజ్ చేయను. ఆ మధ్య కాన్సర్ హాస్పిటల్లో 6 నెలలు వార్డుల్లో తిరిగినప్పుడు ఆ అలవాటు పూర్తిగా మనుకున్నా! ఒక కల్లు తప్ప ఇంకేం తీసుకోవట్లేదు, మద్యం గురించి వాటి పర్యవసానాలు నా వంతుగా ఇప్పుడు కూడా ప్రచారం చేస్తుంటాను. ఒకప్పుడు మీ టీమ్ తో కలసి పనిచేశాను. 
ఎదుటి వారిని ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఏమాత్రం ఎంకరేజ్ చేయను భాస్కర్!

భాస్కర్:
మీకు బుక్ knowledge thappa general thinking ledhu ప్రతిది బంగారు తెలంగాణ అంటే ఇదేనా మనం ఎంత మంచి చేశామో కాదు తప్పులు కూడా చూసుకోవాలి. బంగారు తెలంగాణ అంటే road lu buildings project lu మాత్రమే నా మనుషులు ఎలా పోయిన పర్లేధా. నాకు ardhamavvakane మీ అభిప్రాయం తెలుసుకుంటున్న. తప్పేముంది మీరు చెపితే తెలుసుకుంటాం మాకు ఈగో ఫీలింగ్ ఏమి లేదు తెలియని తెలుసుకుంటాం.

మల్లేష్:
అవును, అలాంటప్పుడు మీరు తాగుడు, ఇది మన బంగారు తెలంగాణ అని రాయడం ఎందుకు!? 
తెలంగాణ అంటే మందేనా మీకు కనిపించేది!?..
సరే మీరు జనరల్ థింకింగ్ చేసి చెప్పండి!
తాగుడెనా మన బంగారు తెలంగాణ!?..

భాస్కర్:
అర్రే తెలంగాణ నీది ఒక్కడిదే అయినట్టు నాది పాకిస్థాన్ అన్నట్టు మతడుతున్నవ్ 😀 అదే చెప్తున్న మనుషులను చంపుకుని వాళ్ళ సమాధుల మీద పెద్ద పెద్ద బిల్డింగ్ లు, జబర్దస్త్ road lu. కళ్ళు చెదిరే project lu kattadamena. Naku తెలీదు చెప్పు మరీ అర్థమయ్యేలా. ఓ ఊగిపోతున్నరు....
ఎందుకు అంతలా ఎమోషనల్ ఫీల్ ఔతున్నవు patela 😀take light

మల్లేష్:
ఆ నెగెటివ్ ఆలోచనలు కరెక్ట్ కాదు, తాగుడు ఆదాయం తో రాష్ట్రం లేదు బంగారం, అక్కడ ఎమోషనల్ కాదు, తెలంగాణ అంటే మీరు అంటున్నది సరీ కాదు అని చెప్తున్నా!!
ఆ తాగుడు తో మా వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నారు, అన్ని వాటి ద్వారా చేస్తున్నారు అనే కోణం సరైనది కాదు! కొద్దిగా ఆలోచించు! ఆల్రెడీ గురువు స్థానం వచ్చారు! బోధించే విధానం, వ్యక్తపరిచే విధానం ఆల్రెడీ మీకు తెలుసు, అన్ని తెలిసిన వారే ఇలా మాట్లాడుతున్నారు, సరే! అది మీ ఆలోచనలు మీ వ్యక్తిగతం కానీ తెలంగాణ అంటే ప్రజలు దాన్ని తాగుడు తో ముడి పెట్టవద్దు.
అంతకు మించి ఏమీ లేదు...
That's Fianl డియర్

భాస్కర్:
K k take light mee telangana nu kinchaparichinandhuku sry patela jai telangana jai మల్లేష్ పటేల్ జై హింద్ 😀

మల్లేష్:
సమస్యను సాల్వ్ చేసే విషయం లో కానీ, వ్యక్తిని కన్విస్న్ చేసే విధానం లో కానీ, ఒపికలో కానీ నువ్వు నాకు ఆదర్శం భాస్కర్!
అందుకే మిమ్మల్ని గురూజీ అని మనసులో ఎప్పుడు అనుకుంటాను!!
నా అభిప్రాయాలు ఏవైనా ఇబ్బంది పెడితే
సారీ డియర్
🤝

భాస్కర్:
K patela nenu చెప్పేది ఒకటే మనకు కులము మతము ప్రాంతము అనే బేద బావాలు వద్దు అని నా అభిప్రాయం. మంచి మంచే చెడు చెడే అది అంతే తప్ప తెలంగాణను తక్కువ చేసి చూడాలని కాదు. నాది మాత్రం తెలంగాణ కాదా but just వీటిని అంత సీరియస్ గా తీసుకోవద్దు. జస్ట్ ఫర్ ఫన్ అండ్ fact also 😀🤝

మనం ఒక కెసిఆర్, బండి సంజయ్, K A pal laga alochinchoddhu మనకు. మనకెందుకు గొడవలు జస్ట్ ఫన్నీ గా తీసుకోవాలి don't ఎమోషనల్ ❤️

-------------
మీ ఇరువురి వాద ప్రతి వాదనలు విన్న తరువాత, తటస్థ అభ్యర్థి అయిన నేను స్వచ్ఛందంగా న్యాయ నిర్ణీత పదవిని అలంకరించి ఈ మాటలు చెబుతున్నాను

భాస్కర్ గారు 
(బంగారు తెలంగాణ) గొప్ప వాళ్ళు అందులోనూ మన వాళ్ళు కూడా వ్యసనాల బారిన పడతారు. అది సాధారణమే.. ఆ తప్పులను బయటకు చెప్పడం అభినందనీయం.‌‌....
మనవాళ్లు అందులోనూ గొప్పవాళ్లు తప్పు చేసినప్పుడు విమర్శించవచ్చు కానీ వెటకారం చేయకూడదు......
ప్రతికూలమైన అంశాలను (బంగారు తెలంగాణ అంటూ) వెతకారంగా చెబితే విమర్శించేందుకు కారణాలు వెతుక్కుని మరి విమర్శించినట్టు అనిపిస్తుంది. మార్చాలి మారాలి అనే భావన అక్కడ కనపడదు.. కనపడటం లేదు కూడా......
అందుకే మల్లేష్ గారికి అంత ఆవేశం వచ్చింది. అందులోనూ తప్పులేదు. (ఆ విషయం మనందరికీ తెలుసు)
-------
మల్లేష్ గారు
బంగారు తెలంగాణ పట్ల మీ బాధ్యత కూడా అభినందినీయం.....
మన రాష్ట్రం గొప్ప రాష్ట్రం అనే భావనలు ఉండేటప్పుడు తప్పులను వెటకారంగా విమర్శించినప్పుడు కోపం ఆవేశం వస్తుంది. అందులో తప్పులేదు కచ్చితంగా ఆ ఆవేశం ఉండాలి అవసరం కూడా.. కానీ స్నేహంలో ఇంత దీర్ఘంగా దాన్ని ఉంచుకోవడం సమంజసం కాదు....
భాస్కర్ గారు మీ విషయంలో ఇబ్బంది పడుతున్నది కూడా ఇందుకే.....

ఈ సందర్భంలో ఒక విధంగా ఇద్దరు సరైన దారిలోనే ఉన్నారు...... 👏👌

ఇట్లు ఇక్కడ 
స్వచ్ఛందంగా 
న్యాయ నిర్ణీత 
పదవిని పొంది 
తీర్పు తీర్మానాన్ని 
చేస్తున్న
భార్గవ శ్యామ 😁🙏

ఇదంతా బంగారు తెలంగాణ అనే పదం ఓ సూక్ష్మ మాటల యుద్ధం మొదలైంది.. 
*బంగారు తెలంగాణ* అనే నినాదంతో ఈ చర్చలు ముగిస్తున్నాం. జై తెలంగాణ జై తెలుగు
భారత్ మాతాకీ జై; జైహింద్ 🇮🇳

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao