Posts

Showing posts from November, 2024

2S) Dhruva Birthday (Telugu 27.11.2024)

Image
⚛️🪷🌳 అప్పటి చిన్నపిల్లలలో చిన్నవాడు  ఇప్పటి చిన్నపిల్లలలో పెద్దవాడు  అయిన ధృవుడికి ఆనందంగా  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభప్రద శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖27.11.2024✍️

2) Adi Sheshaiya Tataiya Birthday (Telugu 27.11.2024)

Image
⚛️🪷🌳 దైవభక్తి దీర్ఘదృష్టి  దయాగుణం  ధారణాగావించిన ధీరులు దైవం దీవించబడిన దీర్ఘాయుష్మంతులు  పుత్రులు ప్రౌత్రులు  పుత్రికలు పౌత్రికలను ప్రేమ పెద్దరికంతో  పరివార పరిధిని  ప్రేమించి పాలించిన  ప్రియమైన పెద్దవారు కుటుంబంలో కురువృద్ధుడిగా  కాలంతో కొనసాగిన కాంతి కోవిదుని జననంతో కనకాభిషిక్తుడైన అన్నపూర్ణమ్మ పుత్రుడు,  ఆదిశేషయ్య పితామహుడిని జన్మదిననా స్మరిస్తూ 🙏 💭⚖️🙂📝@🌳 📖27.11.2024✍️

3) Siddu Birthday (Telugu 25.11.2024)

Image
⚛️🪷🌳 ఆ'రోజు' (2021/23) రచించిన ఆ నీ నిర్మల నైపుణ్యలకు నా భావోద్వేగ భావసార లక్షణాలను లక్షణంగా ఇప్పటికీ ఇలాగే నిలుపుకుంటూ నిలిచిన  సుమధుర సోదర సిద్ధు హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభప్రద శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳  📖25.11.2024✍️ 2021/23 రచన అజాతశత్రువై అందరికి  అసరా అందిస్తూ ఆజానుబాహుడిగా అందం  అభినయంతో అలరించే  అనుజా (తమ్ముడా) ప్రశాంతత ప్రసరించే ప్రియమైన భరత్, బాధ్యతలలో  ప్రేమతత్వానికి పెంచుతూ స్థిత ప్రజ్ఞత, సంఘర్షణలో స్థిరత్వం,  సహానుభూతి, సహన శౌర్యం,  సుందర రూపం, స్నేహ భావం,  సంగమించిన సచ్చీల సోదరా సిద్దు,  సుమధుర సంగీతకారుడా,  సదా సంతోష స్వరూపుడై  సుఖంగా సాగుతావని  సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను. హృదయపూర్వక హార్దిక పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు సిద్ధూ... 😇🎂🤝   💭⚖️🙂📝@🌳  📖25.11.2021)23✍️

2) Pramod Bharadwaj (Telugu 13.11.2024)

Image
⚛️🪷🌳 కృష్ణమూర్తి కుమారుని కుమార హైమావతి మనవడా హిమనివాససుత శ్రీబిందునందన అందమైన ఆకృతితో బక్కని బలిష్ట, బుద్ధిశాలి స్నేహితుల సంబంధంలో  సమపాల్లుగా సమకాలిన వినోదం విజ్ఞానం ప్రశాంతంగా పొందే ప్ర - ప్రణవ సోదర మో - మోతీనగర వాస్తవ్యు ద - దస్ముడు (బ్రహ్మచారి) అయిన నా అనుజ ప్రమోద్, పుట్టినరోజు  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  📖13.11.2024✍️

Amma Nanna Wedding Anniversary (Telugu 11.11.2024)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము అంతర్లీనులైన అమ్మానాన్నలకు తనయుడి తాదాత్మ్యమైన *అభ్యాసాలను అనుసరించి  *2018లో రామకృష్ణ మఠ సన్యాసి సర్వప్రియానంద స్వామి మాట్లాడిన మాటల మూలంతో  కలిగిన కమ్మని అద్వైత అనుభూతితో...... 2019లో రాసిన మేధోమథన సంకల్ప సారమైన సారాంశాన్ని  మళ్లీ, మరింత ఉద్వేగంలో ఉంచుకుంటూ ధన్యుడినై ధన్యవాదాలతో సార్వత్రిక సత్య లక్షణ లేఖను విలక్షణంగా వ్రాస్తున్నాను. "పిల్లలు ఆభరణాలు, తల్లిదండ్రులు స్వర్ణం లాంటివారు. ఆభరణం స్వర్ణం నుండి/ద్వారా తయారవుతుంది.  ఆభరణం నుండి స్వర్ణాన్ని తొలగిస్తే, ఆభరణమే ఉండదు.  అందువలన స్వర్ణమే ఆభరణం యొక్క అస్తిత్వం"  అంతర్లీన అస్తిత్వం,  వివాహంతో వారధిగా  మారి మురిపెంగా   ఆనంద అనుసంధాన  సంశ్లేషణ సమతుల్య సంకల్ప  ప్రయాణంతో ప్రాణమై  నాకు ప్రేరణగా నిలిచింది.  "పారమార్థికమైన పరంధాముని పరమానందపు  ప్రేమలో పాత్రులై పావనం అయ్యారు/ఇంకా  ఆవుతారని‌ ఆకాంక్షిస్తూ అమ్మానాన్నలకు  వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳

2) Vyshnavi Birthday (Telugu 08.11.2024)

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము   విద్యలో విషయ  విశిష్టత వున్న విశేష వనితా  వై'భవ' వివాహంతో  ఆర్యవర్తం నుంచి అమెరికాకు పాతపాటి నుండి పైడిపాటికి  పరివర్తనతో పయనించి విహన్ష్ కు విశ్వమైన వాణి వైష్ణవికు హార్థిక హృదయ పూర్వక పుట్టినరోజు  శోభప్రద శుభాకాంక్షలు   💭⚖️🙂📝@🌳 📖08.11.2024✍️   విద్యలో విషయ విశిష్టత వున్న విశేష వనితా వాణి వైష్ణవికి......  హార్థిక హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  📖08.11.2022✍️   https://bharghavashyam.blogspot.com/2022/11/vyshnavi-birthday-1.html

Vamsi Annaiya & Vadina (Telugu 06.11.2024)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము 21 సంవత్సరాలు:  252 నెలలు 1095 వారాలు 7671 రోజుల క్రితం కళ్యాణంతో కలిసి ఆధునిక అద్దులు అద్దుకుని ఆధ్యాత్మిక అంతరంగంతో వంశీఅన్నయ్య వదిన  దివ్యమైన దేవి దీవెనలతో ధీయుక్తిని ప్రసాదంగా పొంది, ప్రామాణిక పెళ్లితో ఒకరికొకరుగా ఒక్కటై కర్తవ్యాలను క్రమబద్ధీకరించి ఆనందంగా అభివ్యక్తీకరిస్తూ... తండ్రి తల్లి తలపుతో తేటతెల్లంగా తీరుస్తూన్న వారి అనందలు ఆశయాలు విశేషమైనవి. అన్షు ఆర్యాలకు వాస్తవిక విధానంలో వారికి  ప్రపంచాన్ని పరిచయంచేసి  భవితకు బాటలు వేసి జీవితాన్ని జ్ఞాపకంగా జరుపుతూ.... పయనిస్తూ ప్రకాశిస్తూన్న వంశీఅన్నయ్య వదినకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖06.11.2024 ✍️

3) Aparna Pinni (Telugu 04.11.2024)

⚛️ 🪷🌳 కృష్ణమూర్తి తాతయ్య సరస్వతి నాన్నమ్మ  కుమార్తెగా, త్రీవ్ర సంకల్పంతో నిల్చుని  తల్లిదండ్రుల తాదాత్మ్య  సహకారంతో సంకల్పంగా ఉండి ఉన్నత  లక్ష్యాన్ని లక్షణమైన  సాధనతో సాధించి  తులసిబాబాయ్ తో తాళి  కట్టించుకుని కలను సాకారం సేసుకొని సుశ్రుత సుహ్రుత్  సంతానంతో సమన్వయంగా వైద్య వ్రుత్తిలో వికసించి సానుకూలతకు స్ఫూర్తి ఉన్న అపర్ణపిన్నికి ఆలస్యంగా హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳  📖04.11.2024✍️

Moment (Telugu 02.11.2024)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము భాగ్యనగర "బాహ్య  వలయ దారి"లో వెళుతూ దగ్గరున్న తెలంగాణ చిహ్నమైన *కాకతీయుల తోరణం"  నమూనా చూసి చిద్విలాసంగా నిల్చుని తీసుకున్న చిత్రానికి "కవితాత్మక తాత్పర్యం" ---------------------------- సంచార సమయంలో  వృక్షం వద్ద  సేద తీరుతూ శాఖ సహాయంతో తీసుకున్న"స్వీయ  చిత్రం" చక్కగా ఉంచుకోవాలని ఉంది  💭⚖️🙂📝@🌳  📖02.11.2024✍️