EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము వాట్సాప్ ఫార్వర్డ్ (మరీ ముఖ్యంగా ఫార్వర్డెడ్ మెని టైమ్స్) లలో దాదాపు 70-80% కాలం చెల్లినవి లేదా నకిలీవని మరియు అవి నిజమైన సమాచారం కాదు, అది వ్రాసే వారి వ్యక్తిగత విచక్షణ/వ్యాఖ్యానం/అపోహలు/ అభిప్రాయాలు మాత్రమే అని కొందరు చెప్తే విన్నాను. అది నాకు సరైనదని అనిపించింది. అభిప్రాయాల సమాచారం ఎక్కువగా మెదడులోకి వెళ్లే కొద్దీ మనకున్న ప్రశాంతత చేజారుతోంది. వాట్సాప్ ఫార్వర్డ్ (మరీ ముఖ్యంగా ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్) లను వీలైనంత వరకు తక్కువగా చదవడం లేదా చూడడం మంచిదనిపిస్తోంది. తీరికగా ఉండి చదివినప్పుడు, ఆసక్తి కలిగించేలా కనిపించినప్పుడు మనకున్న విచక్షణతో అభిప్రాయాల సమాచారాన్ని వడబోసి అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఎదుటివారికి ఉపయోగబడేదాన్ని/నచ్చే దాన్ని బట్టి పంచుకోవడంకి సంబంధించి ఆలోచించవచ్చు. చాలా మంది, వారి ఫోన్ స్టోరేజ్ దృష్ట్యా, ప్రశాంతత దృష్ట్యా ఫార్వర్డ్ లలో వచ్చే ఫోటోలు ఇంకా ఎక్కువుగా వీడియోల వల్ల లాభం కంటే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు, కాబట్టి వారిపట్ల సహనుభూతితో ఉండడం ఉత్తమం అనిపించింది. ఒకవేళ వాట్సప్ ఫార్వర్డ్ పంచుకోవాలనుకు...