EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము ఆంధ్ర జ్యోతి జ్వలింప జేసిన జ్ఞాపకాల అస్తిత్వం 09.01.2023: ప్రవేశ పరీక్ష (ముఖాముఖి) 23.01.2023: స్థానం సంపాదించడం (ఉద్యోగంలో చేరడం) --------------------- "ఆంధ్రజ్యోతిలో ఆరంభ అనుబంధం" ఆంధ్రజ్యోతి అవకాశంతో అనువాదకుడిగా అనుభవాలు అభివ్యక్తికరిస్తూ ఆంగ్లం అభివృద్ధి అవుతూ తెలియని తెలుగును తెలియజేస్తూ నైపుణ్యాలను నింపుతూ మరిచిపోలేని మంచి మనుషుల సహవాసంతో సంస్థలో సాగుతున్న జీవితానికి జ్ఞానం జీతం జారీచేస్తూన్న ఆంధ్రజ్యోతికి అభినందనలు (ధన్యవాదాలు). (ముఖాముఖి మరియు ప్రవేశ పరీక్ష రాసి సంవత్సరమైన సందర్భంగా సంబంధిత భార్గవ భాష్యం) 09.01.2024. -------------------------- "ఆంధ్రజ్యోతి అనుబంధికులపై అభిప్రాయాలు" సమతుల్య స్థితప్రజ్ఞతతో, ఉద్యోగస్తులకు ఉతంగా ఉంటూ తగిన సమయం ఇస్తూ విత్తనంలో వృక్షాన్ని చూస్తూ సహనంగా సామర్థ్యా వృద్ధికై సమయాన్ని వెచ్చిస్తూ నిండైన నిర్వహణ శక్తితో, సందర్భాను సారంగా చాలా చక్కని చిద్విలాసంతో విలువుల విధిని విలక్షణంగా నిర్వహిస్తూ, నిర్వహణకు ...