అంతర్జాతీయ పులుల దినోత్సవం (Telugu 29.07.2022)
⚛️🪷🌳
అంతర్జాతీయ పులుల దినోత్సవం (29 Jul 2022)
ప్రకృతి పులి అడవి మనుషులు మధ్య అవినాభావ సంబంధం ఉంది. అడవులు ఉంటేనే స్వచ్ఛమైన గాలి, విస్తారమైన వర్షాలు పొందుతాం. అడవులు క్షీణిస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. మానవ మనుగడ అడవులతోనే ముడిపడి ఉంది.
ఒక పులి ఉన్న పరిధిలో ఇంకొక పులి ఉండదు. ఒక్కొక్క పెద్దపులి అడవిలో నిత్యం సూమారు 40 నుంచి 70 కి.మీ. దూరం తిరుగుతుంది. పులులు ఎక్కువగా ఉన్నాయి అంటే అడవులు సమృద్ధిగా ఉన్నాయని అర్థం.
అడవుల్లోని అరుదైన మొక్కలను చెట్లను కాపాడడానికి పులి శాకాహార జంతువులపై దాడి చేస్తూ వాటి సంఖ్యను నియంత్రిస్తుంది. పులులు శాకాహార జంతువులను నియంత్రించకపోతే అరుదైన మొక్కలు, వృక్షజాతులు అంతరించి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. (పులి ఒక జంతువును వేటాడితే ఒకేసారి దాన్ని మొత్తం తినదు. ఒక స్థావరంలో భద్రపరుచుకుంటుంది. కొద్దికొద్దిగా వారం దాకా తింటుంది).
💭⚖️🙂📝@🌳
📖29.07.2022✍️
Comments
Post a Comment