Hyper Aadi (Telugu 06.06.2026)

⚛️🪷🌳 

⚡హైపర్ ఆది 🌞 
😁 హాస్యపు ఆనందం 🙂

ఫేసుబుక్‌లో పవన్ కళ్యాణ్
అత్తారింటికిదారేది అనే
అనుకరణాత్మక
లఘుచిత్రంతో లీలగా 
అదిరే అభికు
దగ్గరై, దక్షతతో
నీడన నడిచి 
జనరంజకమైన జబర్దస్తులో 
ప్రవేశం పొంది,
రిక్షా లాగుతూ 
హాస్య ప్రహసన (కామెడీ స్కిట్)ల
వేదికపై వచ్చి 
కొద్దిసేపు కనపడి 
కనుమరుగై, క్రమంగా
బహుముఖ ప్రజ్ఞా బ్రహ్మానందం 
“అతడు” సినిమా స్ఫూర్తితో
కష్టంతో కృషిగా
ప్రస్తుత పరిస్థితుల
సహజమైన సామాజిక
అంశాలతో అనుకూలంగా 
రసజ్ఞతమైన రచనలు రాసి
చక చకా చమత్కారపు 
ప్రాసల పదాలు పలుకుతూ
హైపర్ ఆది 
బిరుదుతో భవ్యంగా
రైసింగ్ రాజుతో
బృందనాయకుడై బ్రహ్మాండంగా
సమూహాన్ని సృష్టించుకుని
సమతుల్యంతో సమన్వయంగా 
పేల్చే పలుకులు (పంచులు)
అదరహో అనిపిస్తుంది. 

తనుకు తాను తయారుచేసిన 
స్వంత సంపాదకీయం(స్క్రిప్ట్)లో 
మొదట మోసం చేయాలనుకుని 
మొదటికే మోసపోయేవిధంగా చూపిస్తూ
నిగూఢంగా నైతికను 
నేర్పించే నేర్పరి.

తారస్థాయికి వెళ్లిన 
తనతోటి వారికి  
ఉద్దీపనగా ఉండడం 
పెద్దవాళ్ల పక్కన
వినమ్రంగా వుండడం
అద్భుతంగా అభినందించే
ఆనందం ఆది

హేతుకం ఆధారంగా
హాస్యమే ఆయుధంగా 
హృదయమే ఆశయంగా
హృద్యమైన ఆలోచన 
హార్దికంగా అందుకున్న 
హైపర్ ఆదికు
హృదయపూర్వక హార్థిక 
పుట్టినరోజు పండుగ 
శోభమైన శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
📖06.06.2026✍️







Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)