Posts

Showing posts from August, 2025

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Image
⚛️🪷🌳 తల్లిభాషగా తేలికగా తనువులో తాదాత్మ్యంగా తేలి, తెలియకుండానే తళుక్కు తళుక్కుమంటు తీరుతో తీక్షణంగా తలపులు తెరిచి తొలిగా తేలికతనాన్ని తరువాత తాత్వికతను తీరుగా తెలియజేస్తూన్న తెలుగుకు తలవంచి తృప్తిగా తలుస్తున్నాను. తరతరాల తాత్విక తపస్సుతో తేజోమయమై తాత్వికంతో తడిసి  తారకమైన తీయని తల్లి తెలుగు 💭⚖️🙂📝@🌳 📖29.08.2025✍️ 2022 తెలుగు దినోత్సవం (గిడుగు రామ్మూర్తి, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలగు వారి పాత్ర) గురించి రాసిన వ్యాసం https://bharghavashyam.blogspot.com/2022/08/blog-post_29.html

2) Raghavendra PeddaNanna Birthday (Telugu 27.08.2025)

Image
⚛️🪷🌳 వినాయక చవితి నాడు  విఘ్నేశ్వరుని చల్లని నీడలో  తిథితో తాదాత్మ్యంగా పుట్టినరోజు పర్వదినం  జరుపుకుంటున్న జ్యేష్ఠపితా  పలుకూరి పెద్దవారు  పాతపాటి పెద్ద అల్లుడు ఉత్తమ ఊత ఉన్నత ఉద్యోగి  "క్రమశిక్షణ కాంతి కిరణం" "సనాతన సంప్రదాయ సహవాసి" రాఘవేంద్ర పెద్దనాన్నకు రచనతో హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖27.08.2025✍️

Jubliee Journalist Colony Nature (Telugu 24.08.2025)

Image
⚛️🪷🌳 ఉదయాన్నే ఉద్యానవనాన చిరు కొండపై చేరి   వర్షం వలన  శుభ్రమైన శుద్ధ ప్రకృతి పరిచిన  పచ్చని పరిసరాలను  ఆనందంగా ఆస్వాదించి  తీసిన తాదాత్మ్య  చక్కని చిత్రాలు 💭⚖️🙂📝@🌳 📖24.08.2025✍️

Chiranjeevi Birthday (Telugu 22.08.2025)

Image
⚛️🪷🌳 మొగల్తూరు నుంచి మద్రాసుకు సానుకూలతతో సాగి ప్రతికూలతలను పారద్రోలి క్రమశిక్షణ క్రమపద్ధతిలతో శ్రీకరంగా శిక్షణ  తీసుకుని తెలుగు తెర  చలన చిత్రాలలో నాట్యం నటన  నైపుణ్యాలతో నిండుగా  అక్షౌహిణులంత అభిమానులను  సుసంపన్నంగా సంపాదించుకుని చిరస్థాయిగా చిరంజీవివై నిలిచిన నటకిషోర  సుప్రీంహీరో "మెగాస్టార్" పేరు ప్రఖ్యాతలను, పద్మభూషణ పద్మవిభూషణ  పౌర పురస్కారాలను  ఘనంగా గ్రహించిన  చిరంజీవిగారికి చక్కగా హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖22.08.2025✍️

3) Srilekha Akka Birthday (Telugu 23.08.2025)

⚛️🪷🌳 నెల్లూరు నివాసంగా ప్రాథమిక పాఠశాల విద్యను వంటపట్టించుకుని ఉన్నత విద్యకై  ఊరిని వదిలి చెన్నైలో చదువుకొని  ఎగిరి ఎదిగి  ఉన్నత ఉద్యోగం  చక్కగా చేస్తూ  బెంగళూరులో బసచేస్తూ  ఆమంచర్ల ఆడపడుచు దూపగుంటకు దగ్గరై  ప్రసాద్(బావ)ని పెళ్లి  చేసుకుని చక్కగా  అద్వైత స్మరణతో ఆనందంగా సాగుతున్న  శ్రీలేఖక్కకు   పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖21.08.2025✍️

Raghu Gari Birthday (Telugu 10.08.2025)

Image
⚛️🪷🌳 ఆనందంగా ఉండే అదృష్టవంతులు పరవశించే ప్రయత్నాలలో  లీనమై లంకించేవారు, విమర్శలను విస్మరించే వ్యక్తిత్వంతో, మిమ్మల్ని మీరు ఉన్నంతగా భావిస్తూ  సదా సంతోషంగా సాగుతున్నారు. ఉన్నతాలను ఉపదేశించడంలో మీకు ఉదాత్తమైన శక్తి ఉంది. కరుణామయుని కటాక్షంతో  సదా సుఖంగా సాగుతున్నారు  మీరు మరింత తృప్తితో తాదాత్మ్యంగా తిరగాలని తలుస్తూ హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  రఘుగారు 💭⚖️🙂📝@🌳 📖10.08.2025✍️

Puneri Amruttulya (Mutuals) (Telugu 06.08.2025)

Image
⚛️🪷🌳 హామీగా హిమవంత్, నిఖిల్, నరసింహ  చిన్నవాడైన చింటూ అశ్విన్ అందరూ  బలమైన భాగస్వామ్యంతో  ఏకమై ఏర్పరచుకున్న  బంధంతో బృందస్పూర్తిగా సహాకారంతో సాకారంగా  సంపదను సమిష్టిగా  సృష్టించుకొని సాదరంగా పునేరి ఫ్రాంచైజ్ పొందిన పరస్పరులు కలకాలం కలిసుంటూ వ్యాపారాన్ని విలువలతో నిబద్ధతగా నడుపుతారని  పరస్పర పదానికి చిరకాలం చిహ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. నిత్యం నాణ్యమైన  తేనీరు తాగుతూ  ప్రజలు ప్రశాంతత  పుష్కలంగా పొందుతారని విశ్వసిస్తున్నాను.  💭⚖️🙂📝@🌳 📖06.08.2025✍️

Shiva Anna Birthday (Telugu 02.08.2025)

Image
⚛️🪷🌳 కొంకటి ఇంటి నామంతో  కొత్తగూడెం ఇల్లు నుండి  మహానగరం ముందుకు  వచ్చి వివిధ  వృత్తిలలో వుండి సాక్షి సంస్థలో  సానుకూలంగా సామర్ధ్యాన్ని  నిర్మించుకొని నిర్మలంగా ఆంధ్రజ్యోతిలో అడుగుపెట్టి వేలితో వేగంగా  పదాలను పరిగెత్తికిచ్చి సాంకేతిక పరికరాలను  సినిమా పేజీలకై ఉపయోగిస్తూ ఉన్నవారు  ప్రకటనలను ప్రశాంతతతో రూపొందిస్తూ రాణిస్తూ…. శోభాయమాన శక్తి శాంతి  శైలి శీలం గల శివ గారు  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖02.08.2025✍️