సినిమా 🏟️ Play Phenomenon 📽️ (చ.క్రీ చదువు)
⚛️🪷🌳
31.01.2018
"నా ఇష్టం" నుంచి సంగ్రహించిన ఆలోచనలు
RGV
- విజయానికి విలువ ఇవ్వకపోతే ఓటమి భయం ఉండదు. ఓటమి భయం లేకపోతే అభద్రతా భావానికి ఆస్కారమే లేదు.
- ఏదో పోతుందేమో అన్న భయం లేనప్పుడు, ఎన్ని పనులైన చేయొచ్చు. ఏ సమస్యలు రావు
- జ్ఞానం శరీరానికి ప్రమాదకరం, అజ్ఞానం మనసుకి ప్రమాదకరం.
24.03.2029
ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అది హిట్ కావాలి అని ఆ సినిమా తీసిన వాళ్ళు ఎంతలా కోరుకుంటారో, ఆ సినిమా చూసే ముందు అది బాగుండాలి అని అంతకంటే ఎక్కువగా కోరుకుంటాడు ఓ సగటు సినిమా ప్రేమికుడు...🤷🏻♂ Manoj Ksk
15.06.2020
ఆశ అంతమైంది!!! అక్షయ్ కుమార్
ఇన్‌స్టిట్యూట్‌లో నేను నెలంతా కష్టపడితే మూడువేల రూపాయలు వస్తే... మోడలింగ్‌లో ఓ మూడుగంటలు పనిచేసినా పదివేల రూపాయలొచ్చేది!
హీరోగా మారిన కొత్తల్లో జీవితాంతం కష్టపడి ఓ పదికోట్లు సంపాదిస్తే చాలు అనుకున్నా ఐదేళ్లలోనే ఆ మైలురాయి అందుకున్నాను. ఆ తర్వాత నా లక్ష్యం వందకోట్ల రూపాయలకు మారింది. వందకోట్లకు చేరువయ్యాక ఇక నేను మళ్లీ డబ్బు గురించి ఆలోచించిన సందర్భాలే లేవు. -అక్షయ్ కుమార్-
ఓషో మరియు మాస్లో సిద్దాంతాలు
పుండరీకుడు, అన్నమయ్య ఇతర భక్తుల వృక్తంతాలు జ్ఞప్తికి వస్తోంది. భోగం పరిణామ క్రమంలో యోగం అవ్వడం కనిపిస్తోంది.
18.06.2020
ఎందుకు..సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎందుకు నీ జీవితాన్ని త్యజించావు. నిన్ను నీవు ప్రశ్నించుకోకుండా, అడగకుండా నీ అద్భుతమై ప్రతిభను, మేథాశక్తిని ఎందుకు పక్కన పెట్టావు.
గ్రూప్ డ్యాన్సర్‌లలో నాలుగో స్థానం డ్యాన్సర్‌గా జీవితం ప్రారంభించి కథానాయకుడిగా ఎదిగిన తీరు అద్భుతం. నీ జీవితం చూస్తుంటే అంతా ఒక నాటకం చూసినట్లే అనిపిస్తోంది.
--అమితాబ్ బచ్చన్--
04.11.2020
Ms. India చలన చిత్రంలోని సంభాషణలు
గొప్పతనం అనేది ఒక లక్షణం... అది ఒకరు గుర్తించడం వల్ల రాదు.. ఒకరు గుర్తించకపోవడం వల్ల పోదు.
నేను గొప్పదానిని కావడం కాదు... నువ్వెంత గొప్పోడివో అందరికీ తెలిసేలా చేస్తా
ఎంత కష్టపడ్డామన్నది ముఖ్యం కాదు... ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం.
రాజీ అనేది మనల్ని ప్రతి రోజు పలకరించే నేస్తం, అబద్దం అనేది మన పక్కనే ఉండే పొరుగింటివారు, సర్దుకుపోవడం అనేది మనల్ని వదలని ప్రేమికుడు.
Greatness is a trait... It doesn't come by someone recognizing it.. It doesn't go by someone not recognizing it.
I don't mean to be great... I will make everyone know, how great you are
It is not important how hard we have worked... It is important how happy we are.
Compromise is a close friend who greet us every day, lie is a neighbour who stays by our side, adjustment is a lover who never leaves us.
13.04.2021
భేదాభిప్రాయాలు ఉన్న వినమ్రతతో నా అభిప్రాయాన్ని గౌరవిస్తాడు, అలాంటి సంస్కృతి రావాలి. మా ఇద్దరి భావజాలం మాత్రం ఒక్కటే. జనం పట్ల, దేశం పట్ల, తెలుగువాళ్ల పట్ల మాకున్న ప్రేమ ఒక్కటే.
ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలతో ఓపికతో మెలగాలి. ప్రజలు మంచిని ఎంచుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మనం అనుకున్నదానికంటే పెద్దది రాజకీయం. రాజకీయ సేవ నాయకుడికి ఉండాల్సిన బలము ఓపిక తనలో ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ గురించి ప్రకాష్ రాజ్
(సేకరణ ఈనాడు, సవరణ: ఆనాభాశ్యా).
15.04.2021
నా స్నేహితులంతా నువ్వుంటే బాగుంటుందని అనేవాళ్లు. నేను ఉన్న ప్రపంచం బాగుంటుందేమో! అందుకే నా ప్రపంచాన్ని సినిమా రూపంలో చూపించాలని అనుకుంటున్నా’’ --శేఖర్ కమ్ముల--
All my friends say it would be nice if you were here. I thought the world I see is good! That's why I want to show my world in Cinema. Sekhar Kammula
#ఆలీతో_సరదగా
15.04.2021
My affection towards actors is limited to movies only
నటులు మీద నా అభిమానం సినిమాల వరికే పరిమితం.
సుబ్రహ్మణ్యం కడుగొంటి.
16.04.2021
మన సినిమా హీరోలు దైవాంశ సంభూతులు
సాగర సంగమం సినిమాను ఇప్పుడు మళ్ళీ తీయమంటే దర్శకుడు విశ్వనాధ్ కానీ నటీ నటులు జయప్రద , కమల హాసన్ కానీ అదే డెన్సిటీ తో , అదే ఇంటెన్సిటీ తో చేయలేరు . కొంత బెటర్మెంట్ ఉండవచ్చు . లేదా పరమ నాసిరకం గానూ ఉండవచ్చు . ఒక గివెన్ సిట్యుయేషన్ లో ఏ మనిషీ రెండు సార్లు ఒకేలా ప్రవర్తించడు . అది సహజం . అదొక ప్రాకృతిక ధర్మం . దీన్ని మనం సృజన విషయం లో విస్మరిస్తే కుదరదు
కథ జరిగే ప్రదేశమే కాదు, ఆ కథను చూసే ప్రదేశం కూడా ముఖ్యమే అనుకుంటాను
నిజానికి పింక్ కీ వకీల్ సాబ్ కి పోలిక లేదు. పింక్ లో ఆడపిల్లలు వాళ్ళ యుద్ధం వాళ్లే చేశారు . అమితాబ్ ఒక దారి దీపం మాత్రమే. అతడొక లాంప్ పోస్ట్ . వకీల్ సాబ్ లో ఆడపిల్లల తరఫున పవన్ కళ్యాణ్ యుద్ధం చేసాడు . పవన్ దారి దీపం కాదు . ఆడపిల్లలు చేరుకున్న గమ్యం - వంశీ కలుగోట్ల.
16.04.2021
"Understanding the truth is not easy as believing a lie"
"అబద్ధం నమ్మినంత సులువు కాదు నిజాన్ని అర్థం చేసుకోవడం"
నాయకుడు చిత్రంలో రాజశేఖర్.
18.04.2021
నాకు నమ్మకం వస్తే చాలా... ప్రపంచం నమ్మొద్దూ..!
నా సమస్య అదే అప్పట్లో.
మా వాళ్ళకి సినిమాలపైనున్న భయం... ఓ రకంగా మనందరిదీ కూడా.
కాలికింద ఉన్న ఆధారాన్ని కాదనుకుని ఆకాశానికి ఎగరాలన్న ప్రయత్నంగానే దాన్ని ఓ మధ్యతరగతి మనస్తత్వం భావిస్తుంది. ఆ భయం అర్థంలేనిదేమీ కాదు. --విజయ్ సేతుపతి--
11.05.2021
జీవితం మనల్ని చాలా చోట్లకి తీసుకెళుతుంది. కానీ ప్రేమ జీవితం ఉన్న చోటికి తీసుకెళుతుంది
డబ్బు సంపద లో భాగం మాత్రమే, నిజమైన సంపద ప్రేమానురాగాలే --మిస్టర్ చలన చిత్రం--
Life will take us many places. But love takes where life is..
15.05.2025
చెక్ చిత్రంలోని సంభాషణలు
చదరంగం కూడా జైలు గోడ లాగా నాలుగు అంచుల మధ్య ఉంటుంది.
🐘 ఏనుగు దారి రహదారి అడ్డు వస్తే తొక్కేస్తుంది. దీనికి ఎదురు వెళ్లాలంటే దమ్ము కావాలి
🐪 ఒంటె మీద ఎప్పుడు కన్నేసి ఉంచాలి. దీని ఓరా చూపుల నుంచి తప్పించుకోవాలి.
🐴 గుర్రానికి ఎప్పుడు కళ్లెం వెయ్యాలో తీయాలో తెలియాలి
🤴 మంత్రికి బుద్ధి, జ్ఞానం, ఓపిక, వ్యూహం మొదలైన వాటితో అడుగు వేస్తాడు. ఈ చదరంగంలో అందరికంటే బలవంతుడు.
♟️ సైనికుడే యుద్ధం మొదలు పెట్టేదే, త్యాగానికి మారుపేరే ఈ సిపాయి. అడుగు ముందుకి వేయడం తప్ప వెనక్కి వేయడం తెలియదు. చిన్నగా ఉన్నాడని చిన్నచూపు చూడకూడదు, ఆదమరిస్తే రూపమే మారిపోతుంది.
👑 రాజు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. గడప దాకా ఆపద వస్తే తప్ప అడుగు వేయడు.
ఎదురులేని ఏనుగు, ఓరచూపు ఒంటె, గంతులేసి గుర్రం, మనో బుద్ధి అహంకారం కలిగిన మంత్రి, ముందడుగు తప్ప వెనకడుగు తెలియని సైనికులు, రాజు అతని రాజ్యం, ఈ ఏకాంతం లో చీకటి గోడల మధ్య, నా ఊహలలో నాతో నేనే రణరంగం ఆడాను. చదరంగం తో ప్రేమలో పడ్డాను.
ఒంటరి తనానికి ఏకాంతానికి తేడా ఉంటుంది.
ఒంటరితనంలో ఆలోచనలు పిచ్చెక్కిస్తాయి. ఆలోచనలకు పదును పెడితే ఏకాంతం అవుతుంది. చరిత్రలో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఏకాంతం లోనే ప్రపంచాన్ని గెలిచారు.
ఇక్కడ ఏమి చేసినా కొన్ని కళ్ళు చూస్తూనే ఉంటాయి
కొన్ని చెవులు వింటూనే ఉంటాయి. ఆచితూచి అడుగు వేయాలి.
అ: చావే గమ్యం అని తెలిసి అడుగు ఎలా వేయాలి
ఆ: అడుగు వేస్తే గమ్యం మారుతుందేమో
నేను నటించి ఓడిపోతే, తను విజయాన్ని నటించాల్సి ఉంటుంది
అణువు నుంచి అనంతం వరకు ఏది కర్మను తప్పించుకోలేదు
మనిషికి మాయమయ్యే శక్తే ఉంటే అందరూ మాయం అవ్వాలని కోరుకుంటారు. జన్మించడం మరణించడం మాత్రమే మన చేతుల్లో ఉంటాయి, ఆ మధ్యలో అవసరానికో వేషం వేయాలి, ఇలా వేషాలు మార్చి మార్చి బతుకు భారం అవుతుంది. భారం నుంచి మాయం అవ్వాలని ప్రతి మనిషి అనుకుంటాడు!!
నా ప్రపంచాన్ని మాయ చేసి, నా చుట్టూ తన ప్రపంచాన్ని అల్లిసింది
చప్పట్లు కొట్టిన చేతులు
చావును కోరుకుంటున్నాయి
మనిషి ప్రేమలోని ద్వేషాన్ని
సుఖం లోని దుఃఖాన్ని
స్ఫూర్తి లోని అసూయని
తనలోని మృగాన్ని మోస్తూనే ఉన్నాడు
ఆవేశంలో ఆలోచనకి చోటు ఉండదు. అదే ఆవేశం ఆలోచనకి కారణమైతే తెలివికి చోటు ఉండదు
ఏమి దిగులు పడకు దినదినానికి పరిస్థితులు మారిపోతాయి
ఇంత తెలివిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎంత ఎత్తు ఎదుగుతావో తెలుసా ప్రపంచం ఆశ్చర్యపోయే అంతా!
వెలుగులోకి వెళ్లాలంటే చీకటితో ఏకం అవ్వాలి
అవధులు లేని ఆకాశం, గమ్యం లేని గాలి, సమిధలు లేని వెలుగు, ప్రవాహం ఆగని నీరు, కంచెలు లేని భూమి ఉన్న చోట ఉన్నాను.
నిశ్చయతు నియతిన్ భవాన్
అహం నియతి నిశ్చామి
ఈ రాతకు నీవే బాధ్యులు
శుద్ధొసి బుద్ధొసి నిరంజనొసి
మనిషి పుట్టినప్పుడు స్వేచ్ఛ స్వచ్ఛత స్పృహతో మచ్చ లేకుండా పుడతాడు. పోయే లోపల ఒక్కసారైనా అలా ఉండాలని అని అనుకుంటున్నాను.
17.05.2021
Leaders don't create followers, they create more Leaders
Be less curious about people and more curious about ideas
Do the right thing, even when no one is watching. It's called Integrity -Charmme Kaur
Happy Birthday
23.05.2021
మంచోళ్ళు చెడ్డోళ్ళు అంటూ ఏమీ ఉండరు - దొరక్కముందు, దొరికింతర్వాత. అంతే
చిత్రం: "ఓ పిట్టకథ"
23.05.2021
ఎదుటివాళ్ళ గురించి చెడుగా చెప్పి, తాను మంచివాడనిపించుకునేవాడు అసలు మనిషే కాడు
--- "అంతస్థులు" చిత్రంలో
27.05.2021
Ali - Vijayendra Prasad's son Rajamouli. Rajamouli's father Vijayendra Prasad. Which of these two do you like the best?
Vijayendra Prasad- If I had more name in the first one, I would have the desire that 'my son will always be greater than me'. In the second one, I feel sad, 'when will I rise to that level of my son' .
Ali- what's your favorite thing in the film industry?
Vijayendra Prasad - There will be a good place for those who lie. I like it so much. Those who want to enter the film industry should also learn to lie.
---------
ఆలీ :- విజయేంద్రప్రసాద్‌గారి అబ్బాయి రాజమౌళి. రాజమౌళి గారి తండ్రి విజయేంద్రప్రసాద్. ఈ రెండింట్లో మీకు ఏది బాగా అనిపించింది?
విజయేంద్రప్రసాద్:- మొదటి దాంట్లో నాకు ఎక్కువ పేరుంటే ‘నా కొడుకు నాకన్నా ఎప్పుడు గొప్పవాడవుతాడ’నే కోరిక ఉండేది. రెండోదాంట్లో ‘నా కొడుకు అంతటి స్థాయికి నేనెప్పుడు ఎదుగుతా’నని బాధ ఉంటుంది.
ఆలీ :- చిత్ర పరిశ్రమలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి?
విజయేంద్రప్రసాద్:- అబద్ధాలు అడేవారికి మంచి చోటు ఉంటుంది. అది బాగా నచ్చింది. చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునేవాళ్లు కూడా అబద్ధాలాడటం నేర్చుకోవాలి. (ఆలీతో_సరదగా)
07.06.2021
ఈ విపత్కర పరిస్థితుల్లో మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు.. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. నందమూరి బాలకృష్ణ.
25.06.2021
వకీల్ సాబ్ 🧑🎓 చిత్రంలోని 🎥 సంభాషణలు:
రాముడు అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న ఆనందంగానే ఉంటాడు. చూడ్డానికి భక్తుల మనసుకే కష్టంగా ఉంటుంది.
కాలు కింద escalator ఉంది కదా అని నొక్కితే rules మాత్రమే కాదు bones కూడ break అవుతాయి
"ఆరోజు ఆ అమ్మాయి అలా కొట్టి పారిపోకుండా ఉండి ఉంటే దిశ, నిర్భయలాగ అయి ఉండేది. అప్పుడు కడివెడు కన్నీళ్లు కార్చడానికి సమాజం సిద్ధంగా ఉంటుంది. మరో వారం రోజుల్లో అంతా మర్చిపోతారు. కానీ, ఆ పరిస్థితే రాకుండా అమ్మాయిలు ఎదురించి పోరాడితే ఇలా కోర్టుకు ఈడ్చి రచ్చ చేస్తారు"
రాత్రులు అబ్బాయిలు బయటకొస్తే సరదా అమ్మాయిలు వస్తే తేడానా!!
ఆడవారికైనా మగవారికైనా మధ్యం తాగడం హానికరం. మగవాళ్ళైతే పడిపోతారు ఆడవాళ్ళు అయితే పడుకుంటారు
సరే పెంచిన పెంపకం ఉన్న సంస్కారం అలాంటిది.
జనానికి సృజనాత్మకత చాలా పెరిగిపోయింది. దానికి పన్నులు GSTలు కట్టాల్సిన పని లేదు కాబట్టి, ఎవరి ఇష్టానికి వారు ఊహించేసుకుంటున్నారు.
జనం కోసం ఎన్నో కోల్పోయారు, కానీ మీరు దూరమై జనాలు జీవితాన్నే కోల్పోతున్నారు. మీలాంటి వాళ్ళ మౌనం శాపం కాకూడదు.
ఏ జనం కోసం అన్ని పోగొట్టుకున్నాడో, అదే జనం మాట మీద నిలబడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు. ఒకరు ఇస్తాను అంటే ఆశపడతారు. బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళవి. వాళ్ళు నాకోసం వున్నా లేకపోయినా, నేనెప్పుడూ వాళ్ళకి అండగానే వుంటాను.
నేను study చేయకుండా ఈ కేసు ఒప్పుకోను, So నేను ఏ కేసు ఓడిపోను. I always want to win
ఎన్నాళ్లైనా ఎన్ని ఏళ్ళు అయినా ఆవేశం తగ్గదు, ఆశయం మారదు.
నీది ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం, It's not your weakness its weapon. జాగ్రత్తగా ఉపయోగించు. ఆవేశం కన్నా ఆశయం గొప్పది.
ఆశతో ఉన్న వాడికి గెలుపు ఓటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నవాడికి ప్రయాణం మాత్రమే.
పారిపోకు దాక్కోకు, ఎదురుకో ప్రపంచాన్ని.
నిజం కోసం నిలబడ్డప్పుడు కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని నిజాలు భయపడతాయి, అన్నిటికీ సిద్ధపడి ముందుకు వెయ్యి.
నిజం ఒంటరిదే, కానీ దాని బలం ముందు అందరు తగ్గాల్సిందే.
అబద్దానికి నిజానికి మధ్య కానీ అనే దానికి ఆస్కారమే లేదు.
ఓటమి అనేది ఎదుటి వాళ్ళు నిర్ణయించేది కాదు. మనం నిర్ణయించేది. మనం ఒప్పుకోనంత వరకు ఓడిపోనట్లే. ఓటమి అంటే అవమానం కాదు, మనల్ని మనం గెలిచే అవకాశం.
25.06.2021
"రూపం లేని 'మాట' రూపం ఉన్న మనిషిని కదిలిస్తుంది. సినిమా పరిభాషలో దాని పేరు సంభాషణము.
ఆయన రచనల్లో ఇదే భూషణం
భాషను బాసటగా చేసుకుని త్రివిక్రమ్ (Trivikram Srinivas) చేసిన సినిమాల యొక్క సారం సంక్షిప్తంగా ఆయన రాసిన సంభాషణల్లో........
12.07.2021
09.09.2021
మొదటి సినిమానే బ్లాక్‌బస్టర్ వచ్చింది. ఆ తర్వాత అంతా ఇలానే ఉంటుందని అనుకున్నాను. కానీ ఓ మంచి సినిమా బయటకు రావడానికి దాని వెనకాల ఎంత కష్టముంటుందో తర్వాత తెలిసొచ్చింది.
నేను చేస్తున్న పనిపట్ల వాళ్లు సంతోషంగానే ఉన్నారని నాకు తెలుసు. నేను కూడా ఆనందంగా ఉన్నానని వాళ్లకూ తెలుసు.
నీలో దర్శకుడికుండే దూకుడు కనిపించట్లేదు అని ఆయన భయాన్ని స్పష్టంగానే వ్యక్తం చేశారు.
ఏమీ తెలియదని తెలుసు. ఏదైనా తెలుస్తుందని కూడా తెలుసు.
మధ్యలో కష్టాలొచ్చినా మొత్తానికి నాది సంతోషకర ప్రయాణమే. అన్నీ ఆనందపడాల్సిన క్షణాలే అని ఆలస్యంగా తెలిసింది.
Srinivas Avasarala
#ఆలీతో_సరదగా
10.10.2021
ఇంటి నుంచి స్కూల్‌దాకా నాకు పోరాటమే. ప్రతి మగవాడూ మమ్మల్నో ‘పబ్లిక్ ప్రాపర్టీ’లా చూడటమే! వీళ్లని నేను తిట్టుకోని రోజే ఉండదు. ఇక్కణ్ణుంచి పారిపోవాలనిపించని క్షణమే లేదు. ఇన్ని ఉన్నా సరే... నేను ఈ దేశం విడిచి పారిపోలేదే! - అంటుంది నా తొలి సినిమా ‘డాలర్ డ్రీమ్స్’లోని ఉష -శేఖర్ కమ్ముల
13.10.2021
సినిమా మనకు కాలక్షేపం. వాళ్లకు వృత్తి. ఇంతకుమించి సినిమా వృత్తి కలిగిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన అనవసరం. సుబ్రహ్మణ్యం కడుగంటి.
28.10.2021
బెంగాల్ టైగర్ 🐯 చలనచిత్రం లోని సంభాషణలు:
ఒక చిన్న రాయి ప్రశాంతంగా ఉన్న నీళ్లను కదిలించినట్లు. ఈ ఆరడుగుల నేను రాష్ట్రాన్ని కదిలించలేనా
మనకు ఏమన్నా కావాలంటే (దేవుళ్ళను అడగాలి)
మనం ఏమన్నా కావాలనుకుంటే వీళ్ళు (గాంధీ వివేకానంద మదర్ తెరిసా)
వ్యవసాయంలో సాయం ఉంది Agriculture లో Culture ఉంది.
ప్రపంచానికి సాయం చేసే Cultureను నేర్పింది రైతులు
దగ్గర అవ్వడం వేరు
దగ్గర ఉండడం వేరు
ఈ రెండిటికీ Affectionకి Protectionకి ఉన్నంత తేడా ఉంది
ప్రపంచంలో వాడే కొద్దీ పెరిగేది బుద్ధి ఒక్కటే
ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా రంగులోనూ రూపులోనూ కాదు బుద్ధిలో ఉంటుంది.
28.10.2021
సిరివెన్నెల సినిమా సంభాషణలు
ఆమె: నువ్వు ఇంకా పైకి రావాలని ఇంకా పేరు తెచ్చుకోవాలని మేము అందరం అనుకుంటున్నాం
అతడు: అది నా ఒక్కడి చేతుల్లో ఉందా?
ఆమె: నిజమే! అది ఇద్దరు చేతుల్లో ఉంది ఒకటి నువ్వు రెండునీ మనసు
అతడు: కానీ! నా మనసు నీ చేతుల్లో ఉంది
ఆమె: తెలుసు! అందుకే నేను చెప్పినట్టు వింటుంది అని నా నమ్మకం. ప్రతిదీ నీకే అంకితం చేస్తున్నావు ఎందుకు?
అతడు: నా మనసుని నీకు అంకితం చేస్తున్నాని అని చెప్పడానికి.
ఆమె: అది ప్రేమ చేత! కామం చేత! భక్తి చేత! గౌరవం చేత!
అతడు: వీటి అన్నిటికీ మించి ఆత్మీయత చేత.
ఆమె: ఆ ఆత్మీయతకు పరాకాష్ట పెళ్లేనా!
ఈ రెండు శరీరాలు కలవడమేనా!
అతడు: కాదు! ఈ రెండు మనసులు కలవడం
ఆమె: ఈ ఇప్పుడు కలిసి లేవా పెళ్లి చేసుకుంటేనే కలుస్తాయా!
అతడు: పెళ్లి చేసుకోనక్కర్లేదు
ఆమె: ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఆ మనసును వెనక్కి తీసుకుంటావా
అతడు: లేదు
ఆమె: దాన్ని (మనసును) హింసించి బాధపెట్టి నువ్వు బాధ పడతావా
అతడు: లేదు
ఆమె: ఈ పెళ్లి అనే ఆటలో ఓడిపోయానని మిగిలిన జీవితాన్ని మట్టిపాలు చేస్తావా?
అతడు: చెయ్యను
ఆమె: నేను నీకు దగ్గర లేదన్న నిరుత్సాహంతో.......
అతడు: ప్లీజ్ నేను ఏనాడు నీ శరీరాన్ని కోరలేదు, భర్తగా నిన్ను అనుభవించాలని ఆశపడలేదు, నేను కోరుకున్నది నీ మనసులో ఇంత చోటు.
అతడు: నువ్వు నాకు మనసుతో ప్రకృతిని చూపించావు.
13.11.2021
నా సొంత కథ ‘ఆనందం’ చెబితే రామోజీరావు గారు సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చెప్పారు. ‘ఇక మీరు సినిమా స్టార్ట్ చేసుకోవచ్చు’ అన్నారు. ‘మంచి రోజు చూసి మొదలుపెడతాం సర్’ అని రామోజీరావు గారితో అన్నాను. అలా అనగానే ‘మీరు చెడ్డ రోజు చూసి మొదలుపెట్టండి. ఎందుకు ఆడదో చూద్దాం’ అన్నారాయన. నిజంగా ఇదే మాట అన్నారు. ఆయన ఇలాంటి వాటిని నమ్మరు.
నా ప్యాషన్ సినిమా. సినిమాతోనే నా కనెక్షన్.. ప్యాషన్‌తో సినిమాల్లోకి వచ్చినా.. అల్టిమేట్‌గా డబ్బు సంపాదనే ముఖ్యం.
ఎవరు ఏం అనుకున్నా నేను పట్టించుకోను. ఒకప్పుడు స్పందించేవాడిని. కానీ, ఇప్పుడు అవి నన్ను ప్రభావితం చేయవు. ప్రస్తుతం అనుకున్న దానికన్నా చాలా సౌకర్యవంతంగానే ఉన్నా.
Sreenu Vaitla (ఆలీతో_సరదగా).
వెండితెరపై విలక్షణ హాస్యంతో ఆయన సృష్టించిన ట్రెండ్ నభూతో నభవిష్యతి. యాక్షన్‌కి కామెడీని జోడిస్తూ.. సరికొత్త పాత్రలను సృష్టిస్తూ క్రిస్పీ స్క్రీన్‌ప్లేతో ఆయన తీసిన సినిమాలు కామెడీకి కేరాఫ్ అడ్రస్‌లుగా మారాయి. చిన్న హీరో అయినా.. స్టార్ హీరో అయినా.. తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఎన్నో సంచలన హిట్స్‌ను అందుకున్న స్టార్ డైరెక్టర్.. శ్రీను వైట్ల.
17.11.2021
ఎవరికన్నా చెడు చేసుంటే మాత్రం గుర్తుపెట్టుకుంటా. ఎంత మందికి మంచి చేశానన్న విషయం కూడా గుర్తుపెట్టుకోను. ఎందుకంటే దాని మీద బతకకూడదు. తర్వాత నిరాశపడతాం. కాబట్టి మంచి జరిగిందేదైనా మర్చిపోతా.
గర్వం, స్వార్థం, అహంభావం వంటి అన్నీ ఉన్నాయి. వాటిని పాజిటివ్‌గా కూడా వాడొచ్చు. పరిస్థితులను బట్టి మనం ఒదిగి ఉండాలి.
ఒక ఉదాహరణ చెప్తా.. ఎల్వీ ప్రసాద్ గారు ఐ ఇన్‌స్టిట్యూట్‌కి ఐదు ఎకరాలు స్థలం ఇచ్చి.. ఆ రోజుల్లోనే రూ. 1.20కోట్లు ఇచ్చారు. ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆయన ఏం చెప్పారంటే.. ‘నేను ఏదో ఆస్పత్రికి విరాళం ఇచ్చి.. ప్రజలకు ఏదో చేస్తున్నాను అని అనుకోవద్దు. అది తప్పు. దాంట్లో నా స్వార్థం ఉంది. కంటిచూపు సరిలేని వాళ్లు ఈ ఆస్పత్రికి వచ్చి కంటిచూపు సరిచేసుకొని థియేటర్‌కెళ్లి సినిమా చూస్తే మాకే కదా లాభం’అన్నారు. అది మంచి స్వార్థమే. నాగినీడు (ఆలీతో సరదగా).
27.11.2021
బ్లాక్‌మార్కెట్ అనేది ఇప్పుడు కాదు.. ముప్ఫై సంవత్సరాల నుంచి కూడా ఉంది. అక్కడ కచ్చితంగా మేం చెప్పిన ధరకే టికెట్ కొనాల్సిందే అని ఎవరూ బలవంతం చేయరుగా! మొదటిరోజు.. మొదటి షోనే చూడాలి అనుకునేవాళ్లు బ్లాక్‌లో కొనుక్కుంటారు.
బ్లాక్ మార్కెట్ తప్పే. ఎవరో కొద్దిమంది చేస్తుంటారు. ఇది కూడా రెండు, మూడురోజులు మాత్రమే ఉంటుంది. దీన్ని పెద్దది చేసి చూడాల్సిన అవసరం లేదు. అయినా బ్లాక్‌మార్కెట్ లేనిదెక్కడ? వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు బ్లాక్ మార్కెట్‌లో కొనుక్కోలేదా? ట్రెయిన్ టికెట్‌లో చేస్తున్నారుగా. ఈ సమాజమే అలాంటిది.
కొద్ది సంఘటనలను సాకుగా చూసి మొత్తం అలాగే ఉంటుందని చెప్పలేం.
ఎవరు నమ్మినా, నమ్మకపోయినా సినిమా పరిశ్రమ పట్ల నేను బాధ్యతగానే ఉంటాను. అందరికన్నా ఎక్కువగానే కేర్ తీసుకుంటాను.
మాది 56 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ. ఎవరో ఏదో అన్నారని నేను హడావుడిగా ముందుకెళ్లను. మా లెక్కలు మాకుంటాయి. మేం ఇక్కడే పుట్టాం. భవిష్యత్తు ఇక్కడే ఉంది. డబ్బులొస్తాయనే ఆశతో నేను ఫిల్మ్ స్కూల్ నడపడం లేదు. మేం ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం ప్రతిభ ఉన్నవాళ్లే. ఆసక్తి, ప్రతిభ ఉన్నవాళ్లను వెలికితీయాలి. ఇక్కడ ప్రతిభ ఉంటే ఎవరైనా స్టార్ అయిపోవచ్చు. ప్రతి ఒక్కరికీ అవకాశాలుంటాయి.
చివరికి ఏంటంటే.. మేం కథలు చెప్పేవాళ్లం మాత్రమే. - సురేష్ బాబు (ఆనాభాశ్యా).
29.11.2021
శివ శంకర్ మాస్టరు...
ఇదంతా కల లా ఉంది😢
మీ పరిచయం మీ కుటుంబంలో ఒక్కడిని చేసింది
మీ పరిచయం నీతో నటించే అదృష్టం ఇచ్చింది
మీ పరిచయం ఆనందాన్ని, భోజనాన్ని, జీవిత అనుభవాలని మార్గదర్శకాలను
పంచుకునే సమయం ఇచ్చింది చివరికి
మీ పరిచయం ఒక కలగా
కన్నీటి గా మారింది
గాయపడిన మీ మనసుకి
ఆడి ఆడి అలసిపోయిన ఆ కాళ్ళకి ఇక సెలవు
మీ జ్ఞాపకాలతో🙏
-Rocking Rakesh
30.11.2021
మనుషులందరికీ ఒకే రకమైన ఎమోషన్స్ ఉంటాయి. కమెడియన్‌ను లాగిపెట్టి కొట్టినా నవ్వుతూ ఉండడు కదా! ‘ఏంట్రా కొడతావ్.. బ్రెయిన్ పనిచేయటం లేదా’ అంటాడు. ‘అదేంటి మీరు కమెడియన్ కదా! కోపమెలా వస్తుంది’ అనడానికి లేదు. లెక్చరర్‌గా ఉన్నప్పుడు అది కాలేజ్ వరకూ మాత్రమే. బయటకు వచ్చిన తర్వాత అతడి నిజమైన వ్యక్తిత్వం కనపడుతుంది. సాధారణంగా కొందరు తమ శరీరతత్వం బట్టి పక్కన ఉన్న వాళ్లను నవ్వించటం అలవాటు అవుతుంది. లెక్చరర్ నుంచి బయటకు వస్తే, అందరితో కలిసి నవ్వుకోవడమే!
సినిమాలో ఒకడు కొడతాడు.. దెబ్బలు తినాలి.. ఎందుకంటే ఎదుటి వ్యక్తి కొట్టేది బ్రహ్మానందాన్ని కాదు. లెక్చరర్‌ను కాదు. పేరు, ప్రఖ్యాతలు ఉన్న నటుడిని అంతకన్నా కాదు. ఒక పెద్ద హీరో కలెక్టర్ పాత్ర చేస్తుంటే, అందులో నేను జూనియర్ ఆర్టిస్ట్‌ను అయితే, సన్నివేశం డిమాండ్ చేస్తే కాళ్లకు దండం పెట్టాల్సి వస్తే పెట్టాలి. ‘వాడి కాళ్లకు నేను నమస్కారం చేయటం ఏంటి’ అని అనుకోకూడదు. నామీద అభిమానం చూపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మేము దెబ్బలు తింటేనే కదండీ మీరు నవ్వేది. అప్పుడే నేను కామెడీ బాగా చేశానని ప్రొడ్యూసర్స్ వేషాలిస్తారు.
ఇప్పుడు తెరపై మిమ్మల్ని నవ్వించడానికే మేము ఏడుస్తున్నాం. -- బ్రహ్మానందం (ఆలీతో సరదాగా)
30.11.2021
‘‘సీతారామశాస్త్రిగారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు. నాకున్న పదాలు సరిపోవు. ఎందుకంటే ‘సిరివెన్నెల’సినిమాలో రాసిన ‘ప్రాగ్దిశ వేణియపైన, దినకరమయూఖ తంత్రులపైన’ ఆ పాట విన్న వెంటనే తెలుగు డిక్షనరీ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలిసింది. దాన్ని ‘శబ్ద రత్నాకరం’ అంటారని తెలుసుకున్నా. అది కొనుక్కొని తెచ్చుకుని, ప్రాగ్దిశ అంటే ఏంటి? మయూఖం అంటే ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకున్నా. ఒక పాటను అర్థమయ్యేలానే రాయాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి అని కోరిక పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి సీతారామశాస్త్రి. ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.. పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచంమీద వేటాడటానికి బయలుదేరతాడు. ఎప్పుడూ ఒప్పుకోవద్దు. ఒక మనిషిని కదిలించే శక్తి సాహిత్యానికి ఉంటుంది’’ -- త్రివిక్రమ్ శ్రీనివాస్
-------------------------------
''నమ్మక తప్పని నిజమైనా
నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదో నా మది ఇపుడైనా.. ''
మీరు ఇక రారు అన్న సత్యాన్ని స్వీకరించడానికి, ఇప్పుడు నా మానసిక స్థితి చెప్పటానికి కూడా మీ పాటే ఊతం అవుతోంది. మాటల్లో చెప్పలేని ఎన్ని భావోద్వేగ భావలు చెప్పటానికి మీ పాటల్ని తలుచుకుంటాం మేము! - శేఖర్ కమ్ముల.
నేనెప్పుడూ పదాలతో, మాటలతో, ధ్వనులతో రచనలు చేయలేదు. ఆత్మ స్పందనతో చేశాను. రాసే ముందు ప్రతి పాటలోకి పరకాయప్రవేశం చేస్తాను, రాసేటప్పుడు నాకున్న పరిమితులకు లోబడి, నా స్థాయి ఏమిటో గుర్తుతెచ్చుకుంటాను. నా స్థాయి అంటే నా భార్య, పిల్లలు, చెల్లెలు, కూతుళ్లు, కొడుకులు..వీళ్లంతా ఆ పాట వినగలగాలి. ఆ పాటతో తమ అనుభవాలను గుర్తు తెచ్చుకోవాలి లేదా అవి జ్ఞాపకంగా ఉండిపోవాలి. ఇలాంటి కొన్ని నిబద్ధతలతో పాటలు రాశాను" అని చెప్పారాయన.
‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రం కోసం సిరివెన్నెల దశవతార రూపాకాన్ని రాశారు. తొమ్మిదిన్నర నిమిషాల పాటు సాగే ఈ పాట రాయడానికే తాను ఈ రంగంలో ఉన్నానని ఓ సందర్భంలో చెప్పారు. ‘ఈ రచన చేయడానికే 28 సంవత్సరాలుగా నేను సినీ రంగంలో ఉన్నానేమో అనిపించింది. ఇది దైవత్వానికీ, మనిషికీ ఉన్న నిర్వచనమేంటో ఈ పాట చెబుతోంది’. దీని తర్వాత ఏదైనా రచన చేయవచ్చా? చేయాల్సిన అవసరం ఉందా? అనిపించే స్థాయికి తీసుకెళ్లిపోయింది. -BBC News Telugu
08.12.2021
కాలం నాకోసం ఏది రాసిపెడితే దాన్ని ధైర్యంగా స్వీకరిస్తాను. నేను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని డిమాండ్ చేయను. కానీ, మీకు నా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఓ విధానం ఉంటుంది’.
--సమంత--
08.12.2021
ఇదివరకు సెట్స్‌లో నేను, నా హెయిర్ డ్రెస్సరే అమ్మాయిలు ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు సెట్లో ఎక్కడ చూసినా అన్ని విభాగాల్లోనూ అమ్మాయిలు కనిపిస్తున్నారు. అదొక విప్లవాత్మకమైన మార్పు. మహిళల కథల్ని చెప్పడంతోపాటు... మహిళల సమస్యల్ని చర్చిస్తున్నాం. ఆ విషయంలో చాలా ఆనందంగా ఉంది. కెమెరా వెనకాల అమ్మాయిలు ఎంత ఎక్కువగా ఉంటే, అంతగా అమ్మాయిల కథలు తెరపైకొస్తాయి’’
- శ్రియ శరన్
08.12.2021
నేను నువ్వు గొప్పవాళ్లమని కాదు.. మనకంటే గొప్పవాళ్లు కృష్ణానగర్, గణపతి కాంప్లెక్స్‌లో చాలా మంది ఉన్నారు. వాళ్లందరికి అవకాశాలు రాలేదు.. పనులు దొరకలేదు. పని దొరకలేదని చాలా మంది బాధపడుతున్నారు. పని దొరికినప్పుడు దాన్ని గౌరవంగా చేసుకోవాలి. ఒక వయసుకు వచ్చాక.. పిల్లల కోసం కష్టపడాలి గానీ.. మన కోసం మనం కష్టపడకూడదు.
"My Experiences with GOD" పేరుతో పుస్తకం రాస్తున్నా. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి.. అలా ప్రయాణిస్తూ.. దిల్లీ రాష్ట్రపతి భవన్ దాక వెళ్లి పద్మశ్రీ అవార్డు తీసుకోగలిగాలను అంటే.. చాలా కష్టపడ్డాను... ఇలాంటి స్థితిని కల్పించింది ఎవరు అని ఆలోచిస్తే.. ప్రతి సందర్భంలో నాకు కనిపించింది దేవుడే. దేవుడు అంటే.. రాముడా, కృష్ణుడా, అల్లానా.. జీససా అని కాదు. GOD అంటే..
G అంటే Generator (సృష్టికర్త)..
O అంటే Operator (నడిపించేవాడు)..
D అంటే Destroyer (నశింపజేసేవాడు).
సృష్టి.. స్థితి.. లయ కారకుడైన భగవంతుడే ఇవి మనకు కల్పించాడన్న ఆలోచన కలిగి పుస్తకం రాయడం మొదలుపెట్టా. నా జీవితంలో ఈ సంఘటనలు ఇలా జరిగాయని నేను అనుకోవడం కంటే పేపర్‌పై రాస్తే.. భవిష్యత్తులో దాన్ని ఎవరైనా చూసి ‘బ్రహ్మానందం అనేవాడు ఒకడుండేవాడు. వాడు ఇలా దేవుడిని నమ్ముకున్నాడు. మనం కూడా దేవుడిని నమ్ముకుందాం’ అనుకునేవాళ్లు ఒకరైనా పుట్టకపోతారా అని ఆ పుస్తకం రాస్తున్నా.
సమాజానికి మనం ఏమీ చేయట్లేదు. మన కోసం మనం చేస్తున్నాం. అయితే, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు.
నేను చేశాను అని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ.. చేయించుకున్నవాడికి ‘నేను వాడి చేత చేయించుకున్నాను’ అని చెప్పుకోవాల్సిన స్థితి కలగకూడదు. అందుకే నేను ఇది చేశాను.. అని చెప్పుకోవడం నాకు మొదటి నుంచి నచ్చదు. -- బ్రహ్మానందం (ఆలీతో సరదాగా)
21.12.2021
సావిత్రి గురించి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు
సావిత్రి లాంటి మహా నటి మళ్లీ పుట్టాలంటే ఓ శతాబ్దం పడుతుందని ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఓ సందర్భంలో అన్నారు. ఆమె తనను అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. సావిత్రి జీవితం అందరికీ ఓ గుణపాఠమని పేర్కొన్నారు.
‘సావిత్రి, సూర్యకాంతం నన్ను అన్నయ్య అనేవారు. సావిత్రి పడ్డ కష్టాల్ని నేను ప్రత్యక్షంగా చూశాను. వీటిలో ఓ చేదు అనుభవం ఆమె చివరి రోజుల్లో.. నాకు అనారోగ్యం చేసింది. అప్పుడు నన్ను చూడటానికి సావిత్రి వచ్చింది. నేను మత్తులో ఉన్నా. ‘ఎలా ఉన్నావ్ అన్నయ్య’ అంది. బావున్నా అని చెప్పా. నా తలగడ సర్ది, వెళ్లినట్లు అనిపించింది. దాని కింద చూస్తే రూ.2 వేలు ఉంది. తనే పెట్టి వెళ్లింది. నేను ఫోన్ చేశా.. ఏంటమ్మా డబ్బు పెట్టి వెళ్లావ్ అని అడిగా. ‘ఓసారి మీ దగ్గర తీసుకున్నా అన్నయ్య. మర్చిపోయారా.. నేను ఎవరికీ అప్పుపడి ఉండకూడదు. నిన్నే వడ్డీ వాళ్లు వచ్చి రూ.5 వేలు ఇచ్చారు. అందులో రూ.2 వేలు తీసుకుని వచ్చా’ అంది. నాకు కళ్లు చెమ్మగిల్లాయి.
సావిత్రి తారగా తెగిపోయిన తర్వాత 0సినిమాలు తగ్గిపోయాయి. ఏదో సినిమాలో తల్లి పాత్ర చేస్తున్నారు. అందరికీ మామూలుగా ఇంటి నుంచి భోజనం వస్తుంది. మాకు వచ్చాయి.. ఆమెకు ఇంటి నుంచి తీసుకొచ్చేవాళ్లు లేరు. సావిత్రి దూరంగా ఒక్కట్టే కూర్చొని ఉంది. నేను వెళ్లి రామ్మా.. భోజనం చేద్దాం అన్నా. ‘వద్దు అన్నయ్య అంది’. నువ్వు వస్తే కానీ నేను తినను అన్నాను. అప్పుడు కళ్లల్లో నీరు పెట్టుకుని వచ్చి, భోజనం చేసింది’.
‘‘సావిత్రి నా సినిమాలో ఉంటే చాలు’ అనుకున్న రోజులవి.అనంతరం ఆ స్థాయి నుంచి తగ్గగానే ప్రొడక్షన్ బాయ్స్ కూడా ఆమెను పట్టించుకోలేదు. ఆర్టిస్టుల జీవితాల్లో ఇది విషాదకరమైంది. సావిత్రికి ఉన్న ఆస్తులు ఇప్పుడు వందల కోట్లు విలువ చేస్తాయి. అలాంటిది ఆమె ఓ గ్యారేజీలో తన చివరి క్షణాల్ని గడిపారు. ఒకరకంగా సావిత్రి జీవితం అందరికీ గుణపాఠం. ఆమె జీవితం నుంచి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆమె వల్ల ఏ రోజూ, ఎవరూ ఇబ్బంది పడలేదు. చిన్నవారిని కూడా గౌరవించి మాట్లాడేది. అలాంటి అమ్మాయికి అలా జరిగింది. సావిత్రి లాంటి నటి పుట్టాలంటే ఓ శతాబ్దం పడుతుంది’ అని గుమ్మడి గుర్తుచేసుకున్నారు.
02.01.2022
‘‘నేనెప్పుడూ ప్రభుత్వ పాలసీలు, రాజకీయాలను పెద్దగా పట్టించుకోను. నాకు వాటిపై అవగాహన లేదు. ఇప్పుడు నేను మాట్లాడే సబ్జెక్ట్‌పైనా స్పష్టత ఉందో లేదో చెప్పలేను. చలన చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా, కామన్‌మ్యాన్‌గా నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. నేనెవరినీ తప్పు బట్టడంలేదు. ఓ మ్యాన్యుఫ్యాక్చరర్ తాను తయారు చేసిన వస్తువును పలు రకాల ఫ్యాక్టర్స్‌ను బట్టి వెల నిర్ణయిస్తాడు. ఆ ధర వినియోగదారుడికి నచ్చితే వస్తువును కొనుక్కుంటాడు. ఇష్టం లేకపోతే మానేస్తాడు. ఒకవేళ ఆ వస్తువు అమ్ముడుపోతే సంబంధిత ట్యాక్స్ ప్రభుత్వానికి చేరుతుంది. చిన్న హోటల్ అయినా, ఫైవ్‌స్టార్ హోటల్ అయినా తినే ఆహారం ఒకటే. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు ఎంపిక చేసుకుంటారు. అది వారి వ్యక్తిగతం. థియేటర్ల విషయంలోనూ అంతే’’.
అందులో అర్థంలేదు..
‘‘సినిమా టికెట్ రేట్ల విషయానికొస్తే.. ఉదాహరణకు తెలుగు సినిమా మార్కెట్ రూ.100 కోట్లు ఉందనకుంటున్న రోజుల్లో దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ రూ. 200 కోట్ల బడ్జెట్‌తో ఓ సినిమా తీశారు. తమ ప్రొడక్ట్‌పై ఉన్న నమ్మకం అది. సూపర్ క్వాలిటీతో సినిమా తీస్తే మార్కెట్‌ను అధిగమించవచ్చని అలా చేస్తుంటారు. ఒకానొక సమయంలో పరాజయం పొందే అవకాశాలూ ఉండొచ్చు. ఒకవేళ అలా జరిగితే రాజమౌళి, శోభుకే నష్టం. లాభం వస్తే మొత్తం ఇండస్ట్రీకే పేరొస్తుంది. టాలీవుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ‘బాహుబలి’. హాలీవుడ్‌ని తలదన్నే ప్రతిభ తెలుగువారికి ఉందని ఈ సినిమాతో రాజమౌళి నిరూపించారు. ‘బాహుబలి’కి మించి ‘ఆర్‌ఆర్‌ఆర్’.. దీనికి మించి మరొకటి రావొచ్చు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు, ఇతర సినిమాలకు ఒకే టికెట్ ధర చెప్పడంలో అర్థంలేదు’’.
ఆ వాదన అనవసరం..
‘‘సినిమాకు అయిన ఖర్చు రూ. 200 కోట్లు కాబట్టి రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందనే నమ్మకంతో రాజమౌళినే టికెట్ ధర నిర్ణయించాలి తప్ప మరొకరు ఎలా చెప్తారు. సినిమా బడ్జెట్.. సుమారు 70 శాతం (రెమ్యూనరేషన్) హీరోలకే వెళ్లిపోతుందని, 30 శాతమే మేకింగ్ కాస్ట్ అని పేర్నినాని గారు, అనిల్‌కుమార్ యాదవ్ చెప్పిన దాంట్లో నిజంలేదు. ఎందుకంటే రెమ్యూనరేషన్, మేకింగ్ కాస్ట్ అంటూ ఏం ఉండవు. అంతా ఒకటే. రెమ్యూనరేషన్ కూడా ప్రొడక్ట్ మేకింగ్‌లో భాగమే. ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చేది హీరోను చూసేందుకే! హీరోలు అంత మొత్తం తీసుకుని ప్రేక్షకులపై భారం మోపుతున్నారని వాదించటం కరెక్ట్ కాదు’’.
ఒకే ధర అంటే ఎలా?
‘‘బ్రాండెడ్ చొక్కా రూ. 50 వేలల్లో, సాధారణ చొక్కా రూ. 50కే లభించవచ్చు. అలాంటప్పుడు ‘షర్ట్’ అని బోర్డు పెట్టి రెండింటికీ ఒకే రేటు చెబితే ఎలా? సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక ఏదైనా లాజిక్ ఉందా? ఉంటే అది చిత్ర పరిశ్రమకూ వివరించాలి. ధరను బట్టి టికెట్ కొనాలా, వద్దా? అని ప్రేక్షకుడు నిర్ణయించుకుంటాడు. కొందరు హీరోలను కావాలని తొక్కేయడానికే ప్రభుత్వం ఇలా చేస్తుందనడాన్ని నేను ఒప్పుకోను’’.
RGV
‘‘రూ.300, రూ.350 టికెట్ల రేట్లతో చిన్న సినిమాలు నిలబడ్డం కష్టం. రూ.50, రూ.30లతో టికెట్ల రేట్లతో పెద్ద సినిమాలకు నష్టం. చిన్న సినిమాలు ఆడాలి.. పెద్ద సినిమాలు ఆడాలి.. దానికి సరైన ధరలుండాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి ‘అయ్యా.. మా సినీ రంగం పరిస్థితి ఇది.. చిన్న సినిమాల్ని పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మనకి న్యాయం చేయమని అడుగుదాం. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్ ఉన్నాయి.. మా అందరికీ దేవుళ్ళు నిర్మాతలు. కానీ, ఈ రోజున ఆ నిర్మాతలు ఏమయ్యారు? అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్ధం కావట్లేదు. మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుంది.. రండి అందరం కలిసి సినిమాని బతికిద్దాం’’- మోహన్ బాబు.
10.04.2022
నా గుండెల్లోన దాగిన గుట్టు గుర్తుపట్టేస్తావా..
ఆశ అల్లడే వేళా ఆలోచిస్తావా..
మొహమాటాన్నే వాటంగా వేసి దాటే దారుందా?...
ఈ ఆరాటంతో పోరాటం చేసే వీలుందా...
--మా అబ్బాయి చిత్రంలోని పాట
17.04.2022
సినిమా అనేది ఓ అందమైన అబద్ధం...
రీల్ లో జరుగుతున్నది రియల్ కాదని తెలిసినా, ఆ మూడు గంటల కథ కథనం రియల్ గానే ఫీల్ అయ్యేలా చేసేదే సినిమా...
#అనామిక
30.04.2022
"జర్నలిస్ట్ అంటే ప్రతి ఒక్కరిలో ఒక విభిన్నమైన భావన కలుగుతుంది. కానీ, నాకు మాత్రం జర్నలిస్టులతో ఎంతోకాలం నుంచి సత్సంబంధాలున్నాయి. నటుడిగా కెరీర్ ప్రారంభమైన సయమంలో నా గురించి, నా స్టీల్స్ ఎవరైనా పేపర్లో వేస్తే బాగుండు అని ఎంతగానో ఎదురుచూశాను. అలాంటి సమయంలో మొదటిసారి ఓ జర్నలిస్ట్ నా గురించి ఆర్టికల్ రాశారు. అది చూసి బాగా ఆనందపడ్డాను. వెంటనే ఆ జర్నలిస్ట్ ని కలిసి కృతజ్ఞతలు చెప్పి కొంత డబ్బు చేతికిచ్చే ప్రయత్నం చేశాను. ఆయన వెంటనే ఆ డబ్బుని తిరస్కరించి.. 'నాకు డబ్బు అవసరం లేదు. మీ లాంటి యువ నటీనటుల గురించి రాయడం మా బాధ్యత' అని చెప్పారు. ఆరోజు ఆయన్ని చూస్తే ఎంతో ముచ్చటేసింది. ఆయన మరెవరో కాదు పసుపులేటి రామారావు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. జీవితాంతం అయన్ని గుర్తు పెట్టుకుంటాను" అని చెప్పారు చిరంజీవి.
“గుడిపూడి శ్రీహరిరావు, ఆంజనేయ శాస్త్రి, నందగోపాల్.. ఇలా చెప్పుకొంటూ వెళితే ఎంతోమంది నా నటన, నా నట జీవితాన్ని సక్రమంగా సరిచేసిన జర్నలిస్టులు ఉన్నారు. 'సీతారలో రివ్యూలు రాస్తుండేవారు గుడిపూడి శ్రీహరిగారు. ఆయన పదజాలం కాస్త కఠినంగా ఉంటుంది. కానీ, బహుశా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి చెప్పినట్లు ఉంటుంది. నా గురించి ఆయన ఓసారి.. నేను బాగా నటిస్తానని డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేస్తానని ఆర్టికల్ రాశారు. కానీ, నా మాటలు వేగంగా ఉంటాయని, నేను చెప్పే డైలాగ్ అర్ధం చేసుకునేలోపు వెంటనే మరో డైలాగ్లోకి వెళ్లిపోతుంటానని, ఆ వేగాన్ని కాస్త నియంత్రణ చేసుకోవాలని రాశారు. అప్పటివరకూ నాక్కూడా ఆ విషయం తెలియదు. దాంతో ఓసారి ఆయన్ని కలిసి మాట్లాడాను. 'సర్.. మీరు నా గురించి ఎందుకు అలా రాశారు?" అని అడిగాను. దానికి ఆయన 'మీరు ఆలోచించి ఒక్కసారి చూడండి. మనం మాట్లాడే మాట ముందు మన చెవికి వినిపించాలి. ఆ తర్వాతే ఇతరులకు' అని చెప్పారు. ఆ మాట విన్నాక నాక్కూడా నిజమే అనిపించి నన్ను నేను స్థిమితపరుచుకున్నాను. డైలాగ్లు నిదానంగా చెప్పడానికి అది ఒక నాందిగా మారింది. అలాగే నందగోపాల్ నుంచి జర్నలిజం విలువలు గురించి తెలుసుకున్నాను.
తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ (టీఎఫ్ జేఏ)
అద్భుతమైన జర్నలిస్టులను గుర్తించి వారికి కూడా అవార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘం ఓ మంచి కార్యక్రమంతో ముందుకు వచ్చింది. దక్షిణాదిలో ఉన్న జర్నలిస్టులందరిని కో ఆర్డినేట్ చేసుకుని వాళ్లని సత్కరించాలనే ఉద్దేశంతో 'సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆసక్తి కనబర్చడం నిజంగానే ఓ శుభ పరిణామం. దీన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా నా వంతు సాయం అందిస్తానని, మీ వెంటే ఉంటానని తెలియజేస్తున్నా" --చిరంజీవి--
16.06.2022
కొందరు :నీకింకా నీ జూనియర్స్ కన్నా ఎందుకు సెలబ్రిటీ హోదా రాలేదు?
నేను : సెలబ్రిటీ అంటే లక్షల మందికి తెలియడమే కదా.... నా మిత్రులు అన్నీ రకాల tv shows చేస్తూ.. సినిమాలు చేస్తూ దేశ విదేశాలు తిరుగుతున్నారు.
నేను అవేమి చేయకుండానే అన్నీ దేశాలు తిరుగుతున్న.. ఇప్పుడు చెప్పు.. What to do what not to do..
కొందరు :🤫.
నేను :నమ్ముకున్న కళ పై మక్కువతో కళా ప్రయోగాలు చేస్తే అవకాశాలు మన సొంతం..... అంతేగా అంతేగా. -Raju Gangolu.
16.06.2022
అడవి... వేట అంటూ ప్రచార చిత్రంలో ఫిలాసఫీ చెప్పారు. ఇంతకీ సినిమా ఎలా ఉంటుంది?....
మనం బతుకుతున్న ఈ ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్ అంటున్నాం. అలా అనుకుంటే మనం అడవిలో ఉన్నట్టే కదా. మనకు తెలియకుండానే మనం అందులో భాగమయ్యాం.
విలన్ అంటే ఎక్కడి నుంచో పుట్టుకురాడు. మనలోనే ఉంటాడు. ప్రతి పాత్రలోనూ రెండుకోణాలు ఉంటాయి.
-------------
మీ సినిమాలు మొదట్నుంచీ పలు భాషల్లో విడుదలవుతుంటాయి. ఇప్పుడేమో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. దీనిపై మీ అభిప్రాయమేమిటి?...
పాత చరిత్ర చూస్తే ఏఎన్నార్ 'దేవదాస్' తెలుగు వెర్షన్ చెన్నైలో మూడేళ్లు ఆడింది. 'మరోచరిత్ర' తెలుగు చిత్రంగానే రెండున్నరేళ్లు ఆడింది. 'శంకరాభరణం' అంతే. 'సాగరసంగమం' డబ్ అయ్యి అక్కడ సిల్వర్ జూబ్లీ ఆడింది. 'స్వాతిముత్యం' అంతే. పాన్ ఇండియా ట్రెండ్ని బాలచందర్ ఎప్పుడో పరిచయం చేశారు. ఆయనకంటే ముందు ఏఎన్నార్ ఉన్నారు. భారతీయ సినిమా మేకింగ్ హబ్ మాత్రం హైదరాబాద్ నిలిచే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదట్లో చెన్నై ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ ఆ దిశగా ఎదుగుతోంది. నిర్మాత నాగిరెడ్డి తెలుగు సినిమాలొక్కటే చేయలేదు. 'మాయాబజార్' తెలుగు, తమిళం, 'రాముడు భీముడు', తెలుగు, తమిళం, హిందీ, ఇలా అన్ని సినిమాల్నీ ఒకే కంపెనీ చేసింది. ఏవీఎమ్ వాళ్లూ అంతే. 'చంద్రలేఖ' తొలి పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా అప్పట్లో ఓ 'బాహుబలి'. ముంబయి నిర్మాతలు వేరే భాషల్లో సినిమాలు. చేయలేదు. అదే దక్షిణాది నిర్మాతలు బెంగాలీలోనూ చేశారు. రామానాయుడు దాదాపుగా అన్ని భారతీయ భాషల్లో చేశారు. ఈ ట్రెండ్ అంతా కొత్తదేమీ కాదు.
------
ఓటీటీ పరంగా ఇంత విప్లవం వస్తుందని మీరు ముందే ఊహించారా?.......
వచ్చి తీరాలి, వచ్చింది కూడా! ఇదే రావాలని నేను చెబితే అంతా నన్ను తప్పు పట్టారు. కొత్తదంటే మనకు ఎప్పుడూ ఓ రకమైన భయం. మార్పు కోసం ఏం చేసినా థియేటర్ లో వచ్చే సినిమాని చూడటాన్ని మనందరం ఆస్వాదిస్తాం. ఇంట్లో వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ఉంటుంది, దానర్థం తిరుపతిలో రద్దీ తగ్గుతుందని కాదు. తిరుపతి వెళ్లి దర్శనం చేసుకోవడం ఓ అనుభవం. అలా సినిమా అనుభవం అనేది ఓ భాష, పక్కనున్నవాడు. జాతి, ఏ మతం అని అడగకుండా సినిమాని అస్వాదిస్తాం. క్రీడల విషయంలోనూ అంతే. అందుకే కళలు, క్రీడలపై గొప్ప గౌరవం నాకు.
---
యువ ప్రతిభావంతులతో కలిసి పనిచేశారు. ఆ అనుభవాల్ని పంచుకుంటారా?.....
ఇప్పుడు యువకులు కావొచ్చు, ఇంకో ఇరవయ్యేళ్ల తర్వాత వీళ్లే ఎంతో ఎత్తులో కనిపిస్తారు. లోకేశ్క ఇది నాలుగో చిత్రం. భారతీరాజా నాతో తన తొలి సినిమాని చేశారు. భారతీరాజా, బాలు మహేంద్ర, బాలచందర్లతో ప్రయాణం గురించి ఆలోచిస్తే... అప్పట్లో అందరం సరదాగా అనుకుని చేసేవాళ్లం. 'మరోచరిత్ర', 'వసంతకోకిల'... వీటి గురించి ఇప్పుడు ఆలోచిస్తే వాళ్లు అప్పట్లోనే ఎంత సాహసం చేశారన్నది అర్థమవుతోంది.
మాటలు Source: Kamal Haasan
ప్రచురణ Publisher: Eenadu.net
సవరణకర్త Editer: Bharghav Shyam
18.06.2022
భళ తందానా చిత్రం లోని సంభాషణలు
Journalists are watch dogs of Society. ప్రాతికేయుడు అంటే ఇంటి ముందు కట్టేసిన కుక్క లాంటి వాడు. ఇంటికి దొంగ వస్తే మెరగాలి, అది విని యజమాని లేస్తాడా లేదా అన్నది తరువాత విషయం. అన్యాయం జరిగితే అరవలసిన బాధ్యత మనపై ఉంది. వార్తలు అంటే నిజం, ఆ నిజాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడం ప్రాతికేయత్వం, కానీ ఇప్పుడు వార్తలు అంటే ప్రాతికేయుల రాసిందే నిజమని జనాలన్ని నిమ్మించడం ప్రాతికేయత్వం.
ఎవరు స్పందించకపోతే రాయడం ఎందుకు. బెదిరింపులు లేకపోతే మనం నిజం రాయడం లేదని అర్థం. Risk is not about profession, its about Percent.
డబ్బు విలువ బాగా నాకు తెలుసు సులభంగా వచ్చే వారికి అది తెలియకపోవచ్చు .
డబ్బుతో ఏమి చేస్తామో అనేది దానికి ఇచ్చే విలువ. దీనితో వైద్యం చేస్తే దాని విలువ ప్రాణం, జూదం ఆడాం అనుకో ఒక గంట సరదా దాని విలువ.
Cash is the easist crime in this country.
మాదకద్రవ్యాలతో దొరికితే 20 ఏళ్ళ జైలు శిక్ష, హత్య చేస్తే ఉరిశిక్ష పడచ్చు. అదే డబ్బులతో దొరికితే మాత్రం కొంత శాతం పన్ను కడితే సరిపోతుంది.
చేసేది మంచి అయినప్పుడు దానికి ప్రేరణ ఎంటి అని అడుగుతాం. అయిన చెడు చేసే వాళ్ళని ఎవరు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడగరు.
16.07.2022
పుష్ప పాటల సాహిత్యం
వెలుతురు తింటది ఆకు..
ఆకును తింటది మేక..
మేకను తింటది పులి..
ఇది కదరా ఆకలి..
పులినే తింటది చావు..
చావును తింటది కాలం..
కాలాన్ని తింటది కాళీ..
ఇది మహా ఆకలి..
వేటాడేది ఒకటి..
పరిగెత్తేది ఇంకొకటి..
దొరికిందా ఇది సస్తాది..
దొరక్కపోతే అది సస్తాది..
ఒక జీవికి ఆకలేసిందా..
ఇంకో జీవికి ఆయువు మూడిందే..
చాపకు పురుగు ఎరా..
పిట్టకు నూకలు ఎరా..
కుక్కకు మాంసం ముక్క ఎరా..
మనుషులందరికీ బతుకే ఎరా..
గంగమ్మ తల్లి జాతర..
కోళ్లు పొట్టేళ్ళు కోతరా..
కత్తికి నెత్తుటి పూతర..
దేవతకైనా తప్పదు ఎరా..
ఇది లోకం తలరాతరా..
ఏమరపాటుగా ఉన్నావా..
ఎరకే చిక్కేస్తావు..
ఎరనే మింగే ఆకలుంటేనే
ఇక్కడ బతికుంటావు..
కాలే కడుపు సూడదురో నీతి న్యాయం..
బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టారాజ్యం..
అడిగితే పుట్టదు అరువు..
బతిమాలితే బతుకే బరువు..
కొట్టర ఉండదు కరువు..
దేవుడికైనా దెబ్బే గురువు..
తన్నులు సేసే మేలు..
తమ్ముడు కూడా సెయ్యడు..
గుద్దుడు సెప్పే పాఠం..
బుద్ధుడు కూడా సెప్పడహే..
---------------------------------------------------------
ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే
తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే
నన్నైతే కొట్టేడోడు భూమ్మీదే పుట్టలేదు
పుట్టాడా అది మళ్ళా నేనే
నను మించి ఎదిగేటోడు
ఇంకోడు ఉన్నాడు సూడు
ఎవడంటే అది రేపటి నేనే
నే తిప్పానా మీసమట
సేతిలోనా గొడ్డలట
సేసిందే యుద్ధమట
సేయ్యందే సంధి అట...
ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
నిను ఏట్లో ఇసిరేస్తా
నే సేపతో తిరిగొస్తా
గడ కర్రకు గుచ్చేస్తా
నే జండాలా ఎగిరేస్తా
నిను మట్టిలో పాతేసి మాయం చేస్తా
నే ఖరీదైన ఖనిజంలా మళ్ళి దొరికేస్తా
ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
ఎవడ్రా ఎవడ్రా నువ్వు
ఇనుమును ఇనుమును నేను
నను కాల్చితే కత్తవుతాను
ఎవడ్రా ఎవడ్రా నువ్వు
మట్టిని మట్టిని నేను
నను తొక్కితే ఇటుకవుతాను
ఎవడ్రా ఎవడ్రా నువ్వు
రాయిని రాయిని నేను
గాయం కానీ చేసారంటే
ఖాయంగా దేవుడ్నివుతాను..
-----------------------------------------------------------------
కోకా కడితే కొరకొరమంటు చూస్తారు.
పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు
కోకా కాదు... గౌను కాదు కట్టులోన ఏముంది
మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి (ఊ)
తెల్లా తెల్లాగుంటె ఒకడు తల్లాకిందులౌతాడు.
నల్లా నల్లాగుంటె ఒకడు అల్లరల్లరి చేస్తాడు
తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పనియేముంది
సందు దొరికిందంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి (ఊ)
ఎత్తూ ఎత్తూగుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు
కురసా కురసాగుంటే ఒకడు మురిసి మురిసిపోతాడు.
ఎత్తూ కాదు కురసా కాదు మీకో సత్యం సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు మీ మగ బుద్ధే వంకర బుద్ధి (ఊ)
బొద్దూ బొద్దూ గుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు
సన్నా సన్నంగుంటే ఒకడు సరదాపడి పోతుంటాడు.
బొద్దూ కాదు సన్నం కాదు ఒంపు సొంపు కాదండి ఒంటిగ సిక్కామంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి
పెద్దా పెద్దా మనిషిలాగ ఒకడు ఫోజులు కొడతాడు. మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు సెబుతాడు
మంచీ కాదు సెడ్డా కాదు అంతా ఒకటే జాతండి దీపాలన్నీ ఆర్పేసాకా..!! అందరి బుద్ధి... వంకర బుద్ధే.
22.07.2022
⭐ Anantha Sriram on Thaman S 🤝
సెహభాష్ శబ్దమాంత్రికా..
పసివయసులోనే ఇంటిబాధ్యతని మోసిన త్యాగానికి
కర్రబిళ్ళ ఆడుకోవలసిన సమయంలో కర్రలుపట్టి రాత్రింబవళ్ళు లయవిన్యాసాలు చేసిన కష్టానికి
అటూ ఇటూ వినిపిస్తున్న అవమాన స్వరాలను దిగమింగిన సహనానికి
సహాయకుడైనా సహోద్యోగినైనా సొంతమనిషిలా చూసుకునే సహృదయానికి
అన్నిటికీ మించి తెలుగు సంగీత భవితవ్యానికి లభించిన జాతీయ పురస్కారమిది.. శుభాకాంక్షలు తమన్ గారు
23.07.2022
సినిమా హిట్ అయితే ఆకాశానికెత్తేస్తారు. ఫెయిలైతే కనుమరుగైపోతాం. మనకో ప్రత్యామ్నాయం ఉండాలి.
ఒక్కోసారి తేలిగ్గానే విజయం వరిస్తుంది. అప్పుడూ పాదాలు నేల మీదే ఉండాలి.
ఎంచుకున్న రంగంలో అప్ డేట్ అవుతుండాలి. హార్డ్వేర్కే కాదు.. స్మార్ట్వర్క్ తెలిసుండాలి.
చదువు, భాషా పరిజ్ఞానం, మంచి నడవడిక ఉంటే మనల్ని చూసే తీరు మారుతుంది.- భవాని మెటకోడూరు -
28.07.2022
F3 Movie Dialogues
మన ఆశలే మన విలువలు.
తండ్రిగా నేను వాడికి ఇచ్చిన ఆస్తి విద్య మాత్రమే.
కష్టం నిజాయతి అని నేను, Shortcuts, Smartness అని వాడు, డబ్బు విషయంలో ఎప్పుడు గొడవ పడేవాళ్ళం.
డబ్బు కోసం అడ్డమైన దారులు తొక్కి అడ్డంగా దొరికిపోయారు. నిజం లేని చోట సమాధానం ఉండదు, సంపాదించిన డబ్బు ఉండదు.
నాకు అనిపించింది చేయాసింది సాయం కాదు, ఇవ్వల్సింది జీవితం అని.
మీలో ఉన్న డబ్బు అనే బలహీనతను బలంగా మార్చము.
అస్తి మీద ఆశతో నిజాయితీ గా కష్టపడి ని నెం1 గా సంస్థను నిలబెట్టారు.
మనిషి మారడం అంటే మళ్ళి పుట్టడం. మిమ్మల్ని ఇబ్బంది పెడితేనో మీరు పడితొనే, మీరు మారుతారని ఇలా చేశాను.
తప్పు చేస్తే సరి దిద్దుకోవడానికి, ఒడిపోతే గెలవడానికి జీవితం ప్రతిసారీ అవకాశం ఇస్తుంది. ఆ అవకాశం తీసుకోవడానికి మనం ఉండాలి. జీవించి ఉండాలి.
ప్రపంచడం లో ఖాళీ జేజు ఉన్నవాడు ఉంటాడేమే గాని ఖాళీ బుర్ర ఉన్నవాడు ఉండడు.
Billionaire అంటే మనకు వినబడే Billgates మాత్రమే కాదు. ఈ చిన్న బుర్ర వాడి గెలిచిన పేరు వినబడని వారు మన మధ్య చాలా మంది ఉన్నారు. అలాంటి చిన్న ఆలోచన తోనే అప్పుడు నేను, ఇప్పుడు మీరు కొన్ని కోట్లు సంపాదించారు.
ఎన్ని కోట్లు ఉన్న మనం కొనలేనిది. ప్రశాంతమైన నిద్ర. ఆ నిద్ర నిజయతి ఉన్నవాడికి పడుతుంది
డబ్బు ప్రాణం పోస్తుంది, తీస్తుంది.గౌరవం తెస్తుంది, పరువు తీస్తుంది ఏడిపిస్తుంది, నవ్వంస్తుంది, మంచి చేస్తుంది చెడు చేస్తుంది.
ప్రపంచానికి తెలిసిన పంచ భూతాలు ఐదు. కానీ ఆరో భూతం ఒకటి ఉంది అదే మనిషి సృష్టించిన డబ్బు.
ఒక చిన్న రంగు కాగితం, మనిషిలొ ఉన్న అన్ని రంగులను బయటకు తెస్తుంది. డబ్బు ఉన్న వాడికి Fun, లేని వాడికి Frustration.
ప్రకృతితో ఎంత జాగ్రత్తగా ఉంటామో, డబ్బతోను అంతే జాగ్రత్తగా ఉండాలి.
Everybody should learn to Respect Money.
01.08.2022
మంచైనా, చెడైనా నా జీవితం గురించి అందరితో పంచుకోవాల్సిన విషయాలన్నింటినీ చెప్పాల్సినంత వరకూ చెబుతా. అంతకు మించి ఒక్క విషయాన్ని నేను ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకోవడం లేదు.
ఇక వార్తను వార్తలే భర్తీ చేస్తాయి. సామాజిక మాధ్యమాలలో నా గురించి జరుగుతోన్న ప్రచారాలు, ఉహాగానాలన్నీ తాత్కాలికమైనవి. దీనిపై నేనెంత స్పందిస్తే అన్ని వార్తలు పుట్టుకొస్తాయి. అది నాకిష్టం లేదు. అందుకే నేను వాటిని పట్టించుకోవడం లేదు. ఏం జరుగుతుందో జరగనివ్వండి. ఏదో ఒకరోజు ఈ ప్రచారాలన్నింటికీ ముగింపు ఉంటుందనే నమ్మకం నాకు ఉంది". అక్కినేని నాగ చైతన్య
Akkineni Naga Chaitanya.
సవరణ: ఆనాభాశ్యా (Me)
01.08.2022
Anantha Sriram
అనంత శ్రీరామ్ గారి విసిదీకరణ వ్యాఖ్యలు 🤩
ఖర్చు - నీ ఇష్టం
డబ్బు ఖర్చు పెట్టి ఆనందాన్ని సంపాదిస్తావా
ఆనందాన్ని ఖర్చుపెట్టి డబ్బు సంపాదిస్తావా
----------
లాభం -నష్టం
లాభం పెద్దదైనా సరే తక్కువరోజులు గుర్తుంటుంది
నష్టం చిన్నదైనా సరే ఎక్కువ సార్లు గుర్తొస్తుంది
అందుకే అందరం దురదృష్టవంతులం
----------
నిజం - అబద్దం:
నిజం: చెప్పేటప్పుడు దీనంత బరువైంది ఉండదు. చెప్పాకా దీనంత తేలికైంది ఉండదు
అబద్దం: చెప్పేటప్పుడు దీనంత తేలికైంది ఉండదు. చెప్పాకా దీనంత బరువైంది ఉండబోదు
----------
హాయి - బాధ
హాయి: గెలిచిన క్షణంలో మాత్రమే మనల్ని పలకరించి వెళ్ళిపోతుంది.
బాధ: గెలలకీ గెలుపుకీ మధ్య ప్రతీక్షణం మన వెంటే ఉంటుంది
----------
స్వార్ధం - పరమార్ధం
ఒక్కడినే బావుండాలనుకోవడం స్వార్ధం
ఇద్దరికే పరిమితమైన స్వార్ధం -> ప్రేమ
అందరికీ పంచగలిగే ప్రేమ -> స్నేహం
అన్ని జీవాలనూ కలిపే స్నేహం ->కారుణ్యం
అంతటా ఆవరించిన కారుణ్యం -> బ్రహ్మ పదార్ధం
ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడమే -> జీవిత పరమార్ధం
----------
ఆశిస్తావా-శాసిస్తావా
నీ ఎదుటి వాడిలా నువ్వు బతకడం లౌక్యం
అది ఏదైనా ఆశించేవాడి లక్షణం
నీ లోపలి వాడిలా నువ్వు బతకడం స్థైర్యం
ఇది దేన్నైనా శాసించేవాడి లక్షణం
----------
కుటుంబం-ప్రపంచం
ప్రపంచం ముందు తలవంచనివాడు
కుటుంబం ముందు తలవంచుతాడు.
కుటుంబం ముందు తలవంచనివాడు
ప్రపంచం ముందు తలవంచుతాడు
రెండింటికీ తలవంచనివాడు అలసిపోతాడు
రెంటింటికీ తలవంచేవాడు కుమిలిపోతాడు.
11.08.2022
ఈనాడు విలేకరి:
మీ నుంచి 'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా', 'బంగార్రాజు' వచ్చాయి. అలాగే 'వైల్డ్ డాగ్', 'ఆఫీసర్' లాంటి సినిమాలూ వచ్చాయి. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు అంగీకరిస్తారు అనే విషయంలో మీకొక ఆలోచన వచ్చి ఉంటుంది కదా?
నాగార్జున:
నిజంగా ఇప్పటికీ తెలియదు. నాకే కాదు ఇండస్ట్రీలో ఎవరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రేక్షకులు ఎప్పుడు ఎలాంటి కథను ఓకే చేస్తున్నారో, ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో? తెలియడం లేదు.
'వైల్డ్ డాగ్' సరిగ్గా ఆడలేదని మీరు అంటున్నారు. కానీ, ఆ సినిమా బాగా ఆడిందని నేనంటాను. డెల్టా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో మాకు వేరే గత్యంతరం లేక విడుదల చేశాం. నెట్ఫ్లిక్స్ లో ఆ సినిమా పది వారాలు పాటు నెం.1 స్థానంలోనే ఉంది.
వినోదం విషయంలో జనం నాడి ఎప్పుడు ఎలా ఉంటుందో పట్టుకోవడం తెలిస్తే చిత్రపరిశ్రమలో అందరూ నంబర్ 1 గానే ఉంటారు. వర్మ తీసిన 'శివ'ను మెచ్చుకున్నారు.. 'ఆఫీసర్'ను తిరస్కరించారు. కృష్ణవంశీ తీసిన 'నిన్నే పెళ్లాడతా' బాగా ఆడింది. ఆ తర్వాత మా కాంబినేషన్ లో వచ్చిన 'చంద్రలేఖ' ఫ్లాప్ అయింది. ఇలా ప్రేక్షకులు దేన్ని అంగీకరిస్తారు? దేన్ని అంగీకరించరు? అనే విషయంపై నాకొక ఆలోచన ఉంటే నా కెరీర్లో అన్నీ 'శివ', 'అన్నమయ్య'లే ఉండేవి. 'అన్నమయ్య' తీస్తున్నప్పుడు ఆడదని అన్నారు. కానీ, రాఘవేంద్రరావుగారు నమ్మకంతో తీశారు.
ఇటీవల రాజమౌళితో ఇదే విషయంపై మాట్లాడాను. "మన మనసుకు నచ్చిన చిత్రాన్నే చేయాలి. ఏది ఏమైనా ఆ సినిమాపై ముందు మనకి నమ్మకం ఉంటే ప్రేక్షకులకూ అది నచ్చుతుంది" అని ఆయన చెప్పారు.
20.09.2022
రాజరాజచోరా చిత్ర సంభాషణలు.
నీకు ఉపయోగపడుతుందా లేదో తేలిదు కానీ నాకు అర్ధం అయ్యిదైతే.... చిన్నదైనా, పెద్దదైన చెప్పడానికి నిజం ఒకటే ఉంటుంది. ఎన్ని కాపీలు తీసినా అసలు అసలే, నకిలీ నకిలీనే. నకిలి చుపించుకోవడానికి ఉపయోగపడుతుందెమో కాని చెల్లదు.
ఈ తప్పు చేయలేదు, కానీ అప్పుడు తప్పు చేశా, దానికి శిక్ష ఎవరు అనుభవించాలి. నేనే కదా! అందుకేనేమో ఇన్నాళ్లు పొలిస్ స్టేషన్ చుట్టు తిరగాల్సి వచ్చింది.
ఎప్పుడూ అయిన విషయం నలుగురి ముందరకు వచ్చిందంటే వాళ్ళ వాళ్ళకే మద్దతు ఇస్తారు.
ఏమి లేనివాడికి పెద్ద పోయేదేమి ఉండదు.
బటన్ నొక్కితే పని చేసే మిషన్ లోనే ఇంత విషయం ఉంటే దీన్ని వాడే మనలో ఎంత విషయం ఉండాలి.
అనుమానం లేకపోతే ఎపనైనా బలంగా చేస్తాం.
నువ్వు చెబితే నిజంలా ఉంటుంది. వేరే వాళ్ళు చెబితే మోసం లా ఉంటుంది.
----
ఏం సాధించావ్ అయ్యా?
దారి దోపిడీ సొమ్ముతో కుటుంబాన్ని పోషించావ్, తప్పు అని తెలిసి పశ్చాత్తాప్ప పడ్డావ్, ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నావ్, మరి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ? ” అని అడిగారు బోయవాడిని.
మాట పెగలలేదు బోయవాడికి …. వెంటనే ప్రాయశ్చిత్తంగా కఠోరమైన తపస్సు మీద మనసు లగ్నం చేసాడు, ఆ క్రమం లో వాల్మీకి మహర్షిగాహ అయ్యాడు
దోపిడీ అంటే కేవలం దొంగతనాలేనా?
నిన్ను ఒకళ్ళు మోసం చేయడం వాళ్ళ తప్పే ! కానీ నిన్ను నువ్వు చేస్కునే మోసం?
నువ్వు చేయగలిగే పని మానేసి డబ్బుకోసం ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రాకులాడడం దోపిడీ కాదా?
డబ్బు మీద వ్యామోహం తో నీ బాధ్యతలను విస్మయించడం దోపిడీ కాదా?
అక్రమ సంబంధాలు, నమ్మక ద్రోహాలు వీటికన్నా నీచమైన దోపిడులు ఉన్నాయా ?
సంసారాన్ని సవ్యంగా చూస్కోకుండా గుడుల చుట్టూ గోపురాల చుట్టూ తిరగడం, ఉద్యోగం పేరుతో ఊర్లు తిరగడం ఎవర్ని ఉద్దరించినట్టు, ఇది ఒక విధమైన దోపిడీ నే…
ఇవన్నీ చట్ట ప్రకారం దోపిడీ కాకపోవచ్చు అందుకే తప్పు అని గమనించడమే కష్టం, ఇంకా శిక్ష సంగతి దేవుడే ఎరుగు.... కానీ చేసిన తప్పుకి తమంతట తాము శిక్ష కోరుకునే వాళ్ళు మార్పుకి నాంది పలికినట్టే, మరో వాల్మీకి అయినట్టే.
05.10.2022
#CinimaContent
#కార్తీకేయ సినిమా సంభాషణలు
నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం.
ఇది నా చేతికెందుకొచ్చిందో నాకు తెలియదు, దీని వెనకున్న భాగవతమెంటో కూడా తెలియదు కానీ, నా ప్రమేయం లేకుండా అందులో నా పాత్ర ఉంది, అందుకే దాని ముగింపు కూడా నాతోనే రాసుంది.
నా కోరికే, నా అర్హత.
మనకి కనిపించడం లేదు అంటే, మన కన్ను చూడలేకపోతుందని అర్దం. లేదని కాదు.
విశ్వం ఒక పూసలదండ, ప్రతీదీ నీకు సంబందమే, ప్రతీదీ నీమీద ప్రభావమే సౌర కుటుంబం నుండి సముద్రగర్భం వరకు అంతా ఒక దారమే.
ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండి తీరుతుంది. ఒక వేళ సమాధానం లేని ప్రశ్న ఐతే, సమస్య ప్రశ్నది కాదు … ప్రయత్నానిది.
మన చరిత్ర ఎలా బ్రతకాలో మరిచిపోయిన మనకి, ఇలా బ్రతకాలి అని గుర్తు చేస్తుంది.
ఇది నువ్వు ఆపలేని యాగం, నేను సమిధని మాత్రమే, అధ్యం అక్కడ మళ్ళీ మొదలైంది. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే, దానిని పొందగలవు.
కృష్ణుడు ఒక చిన్న విషయం అనుకుంటున్నవా, అరేబియన్ సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు ముడిపడిన ఒక మహాచరిత్ర.
శ్రీ కృష్ణుడిని దేవుడు అని ముద్ర వేసి,మనిషికి నేలకి దూరం చేయద్దు. ఆయన అపర మేదావి
ఉన్నత విలువులతో జన్మ తీసుకుని
ఈ నేలమీద నడిచిన మనిషి
అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం.
-గీతతో కోట్ల మందికి దరి చూపించిన అతని కన్నా గురువెవరు.
-రక్షణ కోసం సముద్రం మద్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా గొప్ప Architect ఎవరు
-చూపుతోనే మనసులోని మాట చెప్పే అతని కన్నా గొప్ప Psychologist ఎవరు.
- వేణుగానంతో గోవుల్ని, గోపికల్ని కట్టి పడేసే
అతని మించిన Musician ఎవరు
-విద్యారోగ్యంతో వుండే సూచనలు చెప్పిన అతనికి మించిన గొప్ప డాక్టర్ ఎవరు
- ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు.
-కరువు, కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజు ఎవరు
-హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా పకృతిని అర్దం చేసుకున్న climatologist ఎవరు
-Uncontrollable RPM తో తిరిగే సుదర్శన చక్రాన్ని నియంత్రించే అతని మించిన Kinetic engineer ఎవరు
అతనొక Writer, Singer, warrior..
what not he is everything, his aura is eternal, he is more than God to me, I worship his exelence
దేవుని పూజించడం కన్నా అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం.
10.10.2022
గుండు.. ఎప్పటికీ గుండెల్లోనే...
అంజి అమృతం తాగకపోయినా,
అమృతం అందించిన అమరుడు
-Gangaraju Gunnam-
-----------------------------------
తెరపైకి వచ్చిన నాకు నచ్చిన నటులలో, గుండు హనుమంతరావు గారు కూడ ఒక గొప్ప నిబద్ధత కలిగిన వ్యక్తిగా త్యాగశీలిగా నేను భావిస్తాను. పోల్చకూడదు కానీ..... బ్రహ్మానందం తర్వాత బ్రహ్మానందం అంత స్థాయికి వెళ్లగలిగే సామర్థ్యం కలిగిన సమకాలికుడు అతను అని నేను బలంగా భావించాను.
తను అమృతంలో ఉండడం వల్ల 30-40 సినిమాలు వదిలేసుకున్నానని తానే స్వయంగా ఆలీతో సరదాగా చెప్పారు కానీ ఆ 30-40 సినిమాల్లో పాత్రలు చేసి వాటి ఆధారంతో ఎన్ని వందల సినిమాల్లో పాత్రలు వేసేవారో ఎన్ని విధాలుగా మనల్ని అలరించేవారో ఊహించుకుంటే అద్భుతంగా ఉంది.
బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణ ఆలీ సునీల్ లాగా తను కూడా హీరోలకు సహాయక పాత్రల్లో నటిస్తూ.. కమెడియన్ గా మెప్పిస్తూ ఒకరకంగా తన ఉన్నత దశలో ఉండే సమయంలో "అమృతం" ధారావాహికలోకి రావడం, దీని పట్ల తన బాధ్యతగా ఉండడం గురించి చెప్పాలంటే...... "తను అమృతం ధారావాహికలో ఉండడం మన అందరి అదృష్టం, తన దురదృష్టం"......... (త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి చెప్పినట్టుగా నేను గుండు హనుమంతరావు గారి గురించి చెప్తున్నాను).
ఈరోజు గుండు హనుమంతరావు గారి పుట్టినరోజు, నా చిన్నప్పటి అద్భుత జ్ఞాపకం అమృతం ధారవాహిక మధురానుభూతుల స్ఫూర్తితో ఇది....
💭⚖️🙂📝@🌳
28.10.2022
అ: నీ అభిప్రాయాన్ని మార్చుకున్నావా లేదా అప్పటి అభిప్రాయం తప్పని ఒప్పుకుంటున్నావా!!!
ఆ: ఏమి చేసినా సరే దుర్మార్గాన్ని బయటపెట్టడమే న్యాయం అనుకుంటున్నాను!!
అ: మేము కొట్టేది కక్షతో కాదని కర్తవ్యం కోసం అని ఇప్పుడైనా తెలుసుకో!!!!
ఆ: ఆరోజు విలేకరిగా మాట్లాడను!!! వివేకం లేకుండా మాట్లాడాలని ఇప్పుడు అర్థం చేసుకున్నాను.
30.10.2022
Puri Jagannath's Letter
SUCCESS AND FAILURE, ఈ రెండూ OPPOSITE అనుకుంటాం, కాదు. ఈ రెండూ FLOW లో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి.
గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి ? ఊపిరి వొదిలెయ్యటమే. పడతాం, లేస్తాం. ఏడుస్తాం, నవ్వుతాం.
ఎన్నో రోజులు ఏడ్చాక NEXT జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే .. ఇక్కడ ఏదీ PERMANENT కాదు .. లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక EXPERIENCE లా చూడాలి తప్ప, FAILURE SUCCESS చూడకూడదు.
నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, వడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, వూరి వేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో జీవితంలో జరుగుతుంటాయి. అవన్నీ సీన్లే.
అందుకే లైఫ్ ని సినిమా లా చూస్తే, SHOW అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్ కి తీసుకుంటే మెంటల్ వస్తాది. SUCCESS ఐతే డబ్బులొస్తాయి. ఫెయిల్ ఐతే బోలెడు జ్ఞానం వస్తాది. SO ఎప్పుడూ మనం MENTALLY, FINANCIALLY GAIN అవుతూనే ఉంటాం తప్ప, ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదిలేదు. అందుకే దేన్నీ FAILURE గా చూడొద్దు.
BAD జరిగితే మన చుట్టూ ఉన్న BAD PEOPLE మాయమైపోతారు .. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. మంచిదే కదా ? కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి .. అది రిస్క్ అవ్వాలి. LIFE లో RISK చెయ్యకపోతే అది లైఫే కాదు. ఏ RISK చెయ్యకపోతే అది ఇంకా RISK.
LIFE లో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరో ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, అందరూ CLAPS కొడతారు, అక్షింతలు వేస్తారు.
So ఇవన్నీ మీ LIFE లో జరగకపోతే, జరిగేలా చూడండి. లేకపోతే మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరో లా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నేను నిజాయతి పరుడుని అని చెప్పుకొనవసరంలేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. TRUTH ALWAYS DEFENDS ITSELF.
ఎవరినుంచి ఏదీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పొతే మనలన్ని పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న AUDIENCE ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. ACTULLY IM LIABLE TO MY AUDIENCE. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా . వాళ్ళని ENTERTAIN చేస్తా. ఇక డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన, ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేను దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేది అంతా డ్రామా.. మీ పూరి జగన్నాధ్.
09.12.2022
ఈ రోజు గొడవలై విడిపోతున్న జంటలు అందరు ఒకప్పుడు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నవాళ్ళే..
పెళ్ళి చేసుకోవాలసింది ఈరోజు వరకు ఎలా ఉన్నాం అనే సమాధానంతో కాదు ముందు ఎలా ఉంటాం అనే ప్రశ్నతో
చిత్రం: మళ్ళీరావ.
10.12.2022
LB Sriram గారి
#కవిసామ్రాట్ చలనచిత్ర సంభాషణలు
అమ్మ ధైర్యం కోసం విభూతి రాసింది
నాన్న నమ్మకంతో మాత్ర వేసాడు.
కానీ ఆ ధైర్యం నమ్మకం రావలసింది నీలో.
జ్వరం తగ్గిలని కొరుకొకు, తగ్గిపోవాలి అనే సంకల్పించుకో తగ్గి తీరుతుంది.
ఆశ జాతకన్ని నమ్మేలాచేస్తుంది
కోరిక దేవుడిని నమ్మేలాచేస్తుంది
బాద మనిషిని నమ్మేలాచేస్తుంది
కానీ ధైర్యం ఒకటే
నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది..
నిన్ను నేను అవమానిస్తే అక్షరాన్ని ఎందుకు తక్కువ చేస్తావు. అక్షరం అనేది నీకన్న, నాకన్న గొప్పది,
ప్రతి దానినీ అనుభవంగా తీసుకోవాలి.. మనసుకు తీసుకోకూడదు..
అనుభవమే అక్షరం అవుతుంది.. ఎంత గొప్ప అనుభవాలను పోగేసుకోగలేగితే అంత గొప్పగా అక్షరాలను పేర్చగలం.
అక్షరాల్ని పదంగా, పదాల్ని వ్యాక్యంగా రాయడం కాదు... ప్రతి వాక్యాన్ని కావ్యంగా రాయడం ప్రజ్ఞ.
ఒక్క రచయిత తను వాడిన పదాల్ని బట్టి తన స్థాయి తెలుస్తుంది.
విశ్వనాథం నడవడే గిరి శిఖరం
మూడు గ్రహాల విగ్రహం
అనుగ్రహం - నిగ్రహం - ఆగ్రహం
మనసులో ఉన్న మాట నోటి దగ్గర ఆపేయండి. నోరు దాటి బయటికి వస్తే నేను మీ నాన్నకి ఉన్న రుణం, నేను చేసిన సాయంగా మారిపోతుంది. దాన్ని రుణంలాగే ఉండనివ్వు.
సన్మానాలు సత్కారాలు ఎవరికి వాళ్ళు చేసుకునేవి కాదు. మనలోని కళను గుర్తించి కళాకారునికి చేసేది.
24.02.2023
కళ గొప్పతనం ఇదే. మనిషి లేకపోయినా.. వాళ్ల మనుగడ ఉంటుంది. వాళ్ల ఆలోచనలు మన చుట్టూ తిరుగుతుంటాయి. వాళ్ల ఊసులేవో ఇంకా చెబుతూనే ఉంటాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ లోకాన్ని వదిలి చాలాకాలమైంది. ఆయన స్మృతులు, శ్రుతులు ఇంకా మన మధ్యే ఉన్నాయి. ఆయన పాటలు వింటున్నప్పుడో, ఆయన మాటలు గుర్తొస్తున్నప్పుడో చటుక్కున మన మధ్య ప్రత్యక్షమైపోతున్నారాయన. ఆ పాత సిరివెన్నెల మళ్లీ కురుస్తోంది. అయితే ఇప్పుడు ఓ కొత్త పాటతో… సాక్షాత్తూ సిరివెన్నెల మళ్లీ పుట్టేశారు.
కృష్ణవంశీ – రంగమార్తాండలో `పువ్వై విరిసే ప్రాణం.. పండై మురిసే ప్రాయం` పాట శ్రోతల ముందుకు వచ్చింది. సీరారామశాస్త్రి రాసిన ఆఖరి పాటల్లో ఇదొకటి. స్వరజ్ఞాని ఇళయరాజా స్వర పరిచి, స్వయంగా ఆలపించిన పాట ఇది. ఇళయరాజా చాలా అరుదుగా పాడుతుంటారు. పాట తాలుకూ సాహిత్యం, సందర్భం తన గుండెల్లో ఇంకిపోతే తప్ప.. గొంతు విప్పరు. ఈ పాట ఆయనే పాడారంటే, ఎంత నచ్చి ఉంటుందో అర్థం చేసుకోవొచ్చు.
పువ్వై విరిసే ప్రాణం
పండై మురిసే ప్రాయం
రెండూ ఒకటే నాణానికి బొమ్మా బొరుసంతే
తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే..
అంటూ పిల్ల తుమ్మెరలా మొదలైన పాట ఇది.
నడకైనా రాని పసి పాదాలే అయినా
బతుకంతా నడిచి అలసిన అడుగులే అయినా చెబుతాయా చేరే మజిలీ ఏదో....
అన్న చోట అసలైన శాస్త్రి వాదం బయటకు వస్తుంది.
మనిషిగా ఎంత అనుభవం సంపాదించుకొన్నా…
చేరే చివరి చోటేదో… నీకెలా తెలుస్తుంది?
అదంతా విధాత రాత..
అని ఒక్క మాటలో చెప్పేశారాయాన. రంగమార్తాండ రంగస్థలం నేపథ్యంలో సాగే కథ. ఇందులో పాత్రలు, పాత్రధారులు.. అంతా వేషధారులే! కథలోని కోర్ పాయింట్‌ని పాటలోకి తీసుకురావడం సీతారామ శాస్త్రికి బాగా అలవాటు. ఎన్నో వేలసార్లు ఆయన చేసిన మ్యాజిక్.. ఈ పాటలోనూ రిపీట్ అయ్యింది.
ఒక పాత్ర ముగిసింది నేడు..
ఇంకెన్ని మిగిలాయో చూడు..
నడిపేది పైనున్న వాడూ..
నటుడేగా నరుడన్న వాడూ...
తాను కూడా ప్రేక్షకుడవుతాడూ...
ఈ చరణంలో… జీవిత సారం మొత్తం విప్పేశారు. రంగస్థలంపై నటుడే కాదు, జీవితమనే నాటకంలో మనిషి కూడా రోజుకో పాత్ర వేయాల్సిందే. ఒక పాత్ర ముగిస్తే.. మరో వేషం కట్టాల్సిందే. ఈ చరణం సారం కూడా అదే.
ఈ పాటకు చివరి మాట.. మకుటం లాంటిది. సీతారామశాస్త్రి ప్రతీ పాటలోనూ, మాటలోనూ లోతైన ఫిలాసఫీ ఉంటుంది.
మళ్లీ మళ్లీ వందేళ్లు రోజూ సరికొత్తే ఎప్పటికైనా తెలిసేనా బతకడముంటంటే..? –
అంటూ ముగించారు పాటని. ఎన్ని వేషాలేసినా, ఎన్ని రంగులు అద్దుకొన్నా.. బతకడం అంటే తెలిసినప్పుడే మనిషి పుట్టుకకు సార్థకత. మరో వందేళ్లు ఇచ్చినా… ఆ మర్మం మనిషికి అర్థం కాదు. ఈ పాట తాలుకూ, ఈ కథ తాలుకూ తత్వం ఇదే. దాన్ని సీతారామశాస్త్రి అక్షరబద్దం చేశారు.
ఈమధ్య చాలా పాటలొస్తున్నా.. ఇంకోసారి వినాలన్న కుతూహలం, ఆసక్తి ఏ పాటా ఇవ్వడం లేదు. చాలా కాలం తరవాత.. రిపీట్ మోడ్‌లో వినాలనిపిస్తున్న పాట ఇది. పాటకు ప్రాణం పోసింది సీతారామశాస్త్రి, ఇళయరాజా అయినా.. ఇంతటి అందమైన సందర్భం సృష్టించిన రంగమార్తాండ సూత్రధారి కృష్ణవంశీకే ఈ క్రెడిట్ దక్కుతుంది. ఆయన మార్క్ సినిమా చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఆశ పడుతున్నారు. బహుశా.. ఆ నిరీక్షణకు రంగమార్తండ తెర దించుతుందేమో చూడాలి. -Anwar Telugu 360-
Content Credits: https://www.telugu360.com/te/soul-song-from-rangamarthaanda/
Song:
https://youtu.be/LjkffNehXjg
13.03.2023
oscaRRR🏆
RRRajamouli🎩
chandRRRabose✍️
keeRRRavani🎵
RRRahul🎤
KalaBhaiRRRva🎤
premRRRakshit🕺
&
Elephant Wishpers
Congratulations
21.03.2023
ప్రశ్న: సినిమా జయాపజయాలను మీరెలా తీసుకొంటారు?
జవాబు: నా సినిమా వస్తున్నందుకు నేనుప్పుడూ పొంగిపోలేదు. అలాగే సినిమా పోయినప్పుడు బాధపడలేదు.
నటన అనేది నా ఉద్యోగం. డాక్టర్, పోలీస్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ తదితర ఉద్యోగాల్లానే! అందరిలానే మనం కూడా చేస్తున్నాం. ఉదయం లేస్తున్నాం... పని చేస్తున్నాం. అయితే అప్రిసియేషన్ అనేది వేరే ఏ రంగంలోని వారికన్నా మాకు ఎక్కువ లభిస్తుంది. సో.... అప్రిసియేషన్ ఎక్కడుందో డిప్రిసియేషన్ కూడా అక్కడే ఉంటుంది.
వేటినీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకొని వెళ్లిపోతాను. ఏ సినిమా నాది కాదు. అలాగని పరాయిదీ కాదు. పొరపాట్లు అనేవి జరుగుతుంటాయి. వాటినే పట్టుకొని కూర్చుంటే జీవితం చాలా కష్టం అవుతుంది. సినీ పరిశ్రమ మనకు అన్నీ నేర్పిస్తుంది... మనం నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా!
ప్రశ్న: హిపోక్రసీ అనేది పరిశ్రమలో ఒక భాగం అంటారు. మరి మీరెలా నెట్టుకొస్తున్నారు?
జవాబు: ఎప్పటికప్పుడు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొంటాం. కొన్నిసార్లు మంచిగా చెబుతాం. కానీ అది చెడుగా ప్రసారం అవుతుంది. కొన్నిసార్లు చెడుగా చెప్పినా మంచిగా ప్రసారం అవుతుంది. అంటే మీ చుట్టూ ఎలాంటి వ్యక్తులున్నారన్నదే ముఖ్యం. మీ గురించి మంచిగా చెప్పాలనుకొనేవాడు ఎప్పుడైనా మంచిగానే చెబుతాడు. చెడుగా చెప్పాలనుకొనేవాడు మీరు ఎంత మంచి చేసినా చెడుగానే చెబుతాడు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు... అందరూ ఒకే అపార్టమెంట్ ఉన్నట్టు అనుకోండి. ఎవరు ఏం చేసినా అందరికీ తెలుస్తూ ఉంటుంది. కనుకు మనం మాట్లాడేటప్పుడు... అలాగే మన దగ్గరకు వచ్చి ఎవరైనా మాట్లాడినా మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే నా తరం నటులందరిలో ఎంతో పరిణతి కనిపిస్తోంది. వాళ్లకు ఏంకావాలో అంతవరకే మాట్లాడతారు.
Naga Shaurya
AbnAndhrajyothy
20.08.2023
మూలం: Anasuya Bharadwaj
సేకరణ: Eenadu.net
సూక్ష్మ సంస్కరణ: ఆనాభాశ్యా
👁️🗨️👌🔖♻️@🌳
"విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ, ఒకరికొకరు సంతోషాన్ని.. సమాచారాన్ని.. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన విషయాలను.. జీవనశైలిను పంచుకోవడం కోసమే ఈ సామాజిక మాధ్యమాలు అనేవి వచ్చాయని అనుకుంటున్నా.
కాకపోతే, ప్రస్తుతం ఉన్న రోజుల్లో సామాజిక మాధ్యమాలు వేదిక మీద మంచి కంటే చెడు ఎక్కువ ఉందనిపిస్తోంది. అన్ని ఇక్కడ నా జీవితంలో భాగమే. నా జీవితానికి సంబంధించిన అన్నింటినీ మీతో పంచుకున్నా. సమస్యలు ఎదురైనప్పుడు నేను కూడా బలహీనతకు గురి అవుతా. మనిషిగా అది సహజం"
"ఒక ప్రముఖవ్యక్తిగా తటస్థ భావాలు, దౌత్యభావాలు అనుసరించేందుకు నా పై ఒత్తిడి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది నా నిజమైన బలం కాదు. నా బలహీనతను పంచుకోనే శక్తి, వ్యతిరేకతను అంగీకరించే ధైర్యమే నా బలం. సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఆ బాధనంతా పోగొట్టుకొని, ఒకట్రెండు రోజుల తర్వాత చిరునవ్వుతో మళ్లీ సవాళ్లను ఎదుర్కోండి, విశ్రాంతి తీసుకుని.. మనల్ని మనం ఛార్జ్ చేసుకుని తిరిగి రావాలి. అంతేకానీ అక్కడి నుంచి పారిపోకూడదు" #ltsOkaytoBeNotOkay
"ఎదుటి వ్యక్తిపై మీరు చేసే వ్యాఖ్యలు వాళ్లను తీవ్ర ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి దయచేసి ఎదుటివారి పట్ల దయతో ఉండండి. ఈ విషయాన్ని నేను కష్టపడి నేర్చుకున్నా. గమనిక: ఇప్పుడు నేను బాగానే ఉన్నా. దాదాపు ఐదు రోజుల క్రితం నేను ఈ బాధను అనుభవించా. ఆ బాధను గుర్తుపెట్టుకోవడం కోసమే దీన్ని రికార్డ్ చేశా".
--------
'మీరు త్వరగా ఓ నిర్ణయానికి రాకుండా ఉండాల్సింది. ఊహాగానాలను ముఖ్యాంశాలుగా పెట్టకుండా ఉండాల్సింది. నేను పంచుకున్న సమాచారం అర్థంకాకపోతే రెండుసార్లు చదువుకోవాల్సింది. అందరి దృష్టిని ఆకర్షించడం కోసం నేను ఈ పోస్ట్ పెట్టానని అంటున్నారు. మనం ఈ వేదికలో ఉన్నదే ఇతరుల దృష్టిలో పడేందుకు కోసమే. మీరు ఎవరిని నిందిస్తున్నారు. కనీసం నేను ఈ విషయాన్ని పారదర్శకంగా అంగీకరిస్తున్నా. అవును నాకు సంబంధించిన ప్రతి అంశంలోనూ నాకు మీ శ్రద్ధ కావాలి" .
"సామాజిక మధ్యమ ట్రోలింగ్ వల్ల నేను బాధపడలేదు. నా భావన ఏడుపుతో ఉండదు కోపంతో ఉంటుంది. నా జీవితానికి సంబంధించిన ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకున్నా. దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదనుకున్నా
..
సంతోషకరమైన ఆలోచనలు మాత్రమే వ్యక్తం చేసే క్రమంలో మేము ఎంతో ఒత్తిడికి గురవుతాం. ట్రోలింగ్ వల్ల బాధపడే అంత బలహీన వ్యక్తి నేను కాదు"
------
ద్వేషాన్ని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగుతా మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది. ఎదుటి వ్యక్తులను తక్కువ చేసి.. వాళ్లు బాధపడుతుంటే సానుభూతి చూపించి.. మీకు మీరు మంచి వ్యక్తులనే భావన పొందుతారు. ఆ బాధపడిన వ్యక్తే బలంగా నిలబడితే మాత్రం తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తారు. ఇదే కదా కపటధోరణి అంటే.
ఈరోజు నేను మాటిస్తున్నా. ఎంతోమందికి ఉదాహరణగా ఉండేలా నేను జీవితంలో ముందుకెళ్తా. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో సమస్యలు ఎదురైనప్పుడు పారిపోకుండా ఎలా ముందుకు సాగాలో చూపిస్తా. ఎందుకంటే, నువ్వు ఒక స్థాయికి వెళ్లేవరకూ వాళ్లు నిన్ను కిందకు లాగాలనే చూస్తుంటారు. నువ్వు చనిపోయాక సానుభూతి చూపించి అటెన్షన్ పొందాలనుకుంటారు. బతికినంత కాలం చావాలనిపించేలా వ్యవహించి.. చచ్చాక ఉద్ధరించాలనుకుంటారు.
ఏది ఏమైనా ఇంతకముందు నేను విపరీతమైన ద్వేషాన్ని ఎదుర్కొని నిలబడ్డా. ఇక ముందూ నిలబడతా. ద్వేషులను ఎప్పుడూ నిరాశపరుస్తూనే ఉంటా. నన్ను అభిమానించే వాళ్లందరినీ ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటా. 'మీరు నా బలం, శక్తి"
01.02.2024
ప్రేమించడం ఆనందం
ప్రేమించబడటం అదృష్టం
నాకు ఆ అద్రుష్టం లేకపోయిన
ఆనందంగా బ్రతికేస్తాను......
భద్ర సినిమా సంభాషణలు
👁️🗨️👌🔖♻️@🌲
02.04.2024
అతను (చీకటి)- అలవాటు పడిన ఎద చీకటి ఇంట సరికొత్త వేకువై రావా
ఆమె (వెలుగు)- కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా
--------
He (Darkness) - Come as a light to remove the darkness I am used to.
She(Light)- Light can only pass when you remove the thick blanket of Loneliness.
చిత్రం: మన్మధుడు
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
20.01.2025
సామాజిక మాధ్యమాల్లో సినిమాలపై జరిగే ట్రోలింగును ఉద్దేశించి తమన్ "ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక నిర్మాత విజయాన్ని అందుకోవడం, దాని గురించి బహిరంగంగా చెప్పుకోవడం కష్టంగా మారింది. నెగిటివ్ ట్రోల్స్, ట్యాగ్స్ సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిర్మాత ఎంతో కుమిలి పోతున్నాడు. తప్పు చేసిన మంచి చేసిన రావాల్సింది ఇంటికే, మన సినిమాని మనమే చంపేస్తున్నాం” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమన్.
'నీ మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం ఒకింత ఆశ్చర్యంగా అనిపించింది. కానీ, మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియాని వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందో ఆలోచించాలి. మాటలు ఉచితమే కానీ, కొన్ని మాటలు ఒకరిలో స్ఫూర్తిని నింపగలవు, ఇంకొన్ని మాటలు ఒకరిని నాశనం చేయగలవు. ఏ మాటల్ని ఎంచుకుంటావనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. మనం సానుకూల దృక్పథంతో ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాల్ని కూడా ఆ దిశగానే ముందుకు నడిపిస్తుంది” ----చిరంజీవి
చిరంజీవి చేసిన వ్యాఖ్యపై తమన్ కూడా స్పందించారు. నన్ను అర్థం చేసుకుని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని కళ్లు తెరిచేలోపే చిదిమేస్తుంటే వచ్చిన బాధ ఇదంటూ ఎక్స్ ద్వారా బదులిచ్చారు తమన్.
08.02.2025
సామాజిక మాధ్యమం కూడా అరుదుగా వాడుతుంటా. సినిమా కోసం పని చేశామా.. ఇంటికి వెళ్లామా.. మన జీవితం మనం చూసుకున్నామా అన్నట్లు ఉంటా. అంతేకానీ నాకు ఈ రాజకీయాలు తెలియవు. నువ్వు ఉన్న రంగంలో రాణించడం కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న రోజుల్లో తమ సినిమాని ప్రచారం చేసుకోవడానికి ప్రతిఒక్కరూ పీఆర్ ను నియమించుకుంటున్నారు. పేఆర్ గేమ్ లోకి నేను చాలా ఆలస్యంగా వచ్చాను. సామాజిక మాధ్యమ వేదికగా మనం చేసే ప్రచారాల వల్లనే సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్తుంది.
గత రెండేళ్లలో పీఆర్ అనేది ఎక్కువైంది. ప్రతినెలా సుమారు 3 లక్షలు ఖర్చు పెట్టకపోతే నువ్వు సరైన దారిలో ఉన్నట్లు కాదు. ఏదైనా సినిమా విడుదల అవుతుందంటే తప్పకుండా పీఆర్ కోసం ఖర్చు పెట్టాలి.
సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయాలి. అందులో తప్పు లేదు. కానీ కొంతమంది కావాలని అనవసర ప్రచారాలు చేస్తారు. పక్కనోడిని తొక్కేయడానికి చూస్తారు. అది నాకు ఏమాత్రం అర్ధం కాదు. అలా చేయడం కూడా తప్పు. పక్కనోళ్లను ఇబ్బందిపెట్టే బదులు.. ఆ సమయాన్ని మన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవడం.. ఆ డబ్బుతో ప్రశాంతంగా ఇష్టమైన విహారయాత్రలకు వెళ్లడం చేయొచ్చు కదా
విడాకులు అనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాతే మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. మా విడాకులు ఇతరులకు వినోదంలా అయిపోయింది. ఎన్నో గాలి వార్తలు వచ్చాయి. నా మీద ప్రతికూల వ్యాఖ్యలు చేసేవారు ఇకనైనా ఆపేయండి.. మీ భవిష్యత్ గురించి మంచిగా ఆలోచించండి" - నాగ చతన్య Akkineni Naga Chaitanya.
02.07.2025
పంది బురదలో పొర్లుతూ ఉంటే, ఛీఛీ అనుకుంటూ పక్క నుంచి వెళ్ళిపోతాం, అదే ఒక చిత్రకారుడు పంది బురదలో పొర్లుతున్నట్లు చిత్రలేఖనం గీస్తే ఫ్రేమ్ చేస్తే నిలబడి చూస్తాం, అది కళకి నిజానికి తేడా.
బ్రహ్మానందం మాటలు
👁️🗨️👌🔖♻️@🌳
If a pig is dripping in mud, we think it's awkward and walk away, but if an artist draws a picture of a pig dripping in mud and frames it, we stand and watch, that's the real difference between art and reality.
Brahmanandam's words
👁️🗨️👌🔖♻️@🌳
02.07.2025
100% సినిమాలు చూడండి, మంచి సినిమాలను ప్రోత్సహించండి, కానీ మీ తల్లిదండ్రులని జీవితాన్ని పక్కనపెట్టిసి, మాకు కాపు కాసేంత, ఉద్ధరించేంత పనులు మేము చేయట్లేదని నా భావన. కాబట్టి మీ జీవితం మీద దృష్టి పెట్టండి.
"100% Watch movies, Support Good Movies. But I feel that we haven’t done anything so noble as to justify sidelining your parents and life. So focus on your life."
Actor Nani Words
👁️🗨️👌🔖♻️@🌳
13.07.2025
సమన్యాయంతో సినిమాలలో
వైవిద్యమైన విలక్షణ
పాత్రలలో పరకాయ ప్రవేశమై
పాత్రలకు ప్రాణం పోసి
పాత్రకు పాత్రకు పోలిక
లేకుండా, లక్షణమైన
తపించే తండ్రిగా,
నేపథ్య నటుడిగా,
ప్రతినాయకుడి పాత్రలలో
నమ్మసక్యం కానీ నటనతో
నటనకు నిఘంటువుగా
ఉన్న ఉన్నతమైన
కోటా శ్రీనివాసరావు గారు
కన్నుమూసిన కారణంగా
అంజలి అర్పిస్తున్నాను
మృత్యోర్మ అమృతం గమయ
ఓం శాంతిః శాంతిః శాంతిః
💭⚖️🫡📝@🌳
📖13.07.2025✍️
17.07.2025
అయ్యోలు హమ్మోలు ..ఇంతేనా వెతుకు హు హు హు ..
ఆహాలు ఓహోలు ఉంటాయి వెతుకు హహహ.
మన చేతుల్లోనే లేదా remote control. ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు program లు..
వార్తల్లో head lines ఆహ్ ?మనకొచ్చే చిలిపి కష్టాలు ? lodine తో అయిపోయే గాయాలే మనకు గండాలు.
ఎటో వెళ్ళిపోతూ నిను చూసింది అనుకోవ trouble. Hello how do you do అని అంటోంది అంతే నీ level.
ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా? తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా ? గాలైనా రాదయ్యా.. నీదాసాలే ఇరుకు అర్థిల్లు కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు "
ఒరేయ్ ఆంజనేలు తెగ ఆయాసపడిపోకు చాలు మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు .. current rent etc మన కష్టాలు curry లో కారం ఎక్కవ ఐతే కన్నీళ్లు.
night అంత దోమలతో fighting గే మనకు global war భారీగా ఫీల్ అయ్యే tension లేం పడకు గోలీమార్ "
18.07.2025
“ప్రతి ఒక్కరికీ సమస్యలుంటాయి. ఒక్కొక్కరిది ఒక్కో ప్రయాణం. ప్రస్తుతం నేను కావాల్సిన వస్తువులు కొనుకుంటున్నా. ఎక్కడికి కావాలంటే అక్కడకు వెళ్లగలుతున్నా. పెద్ద కారు, ఇల్లు ఇవన్నీ సమిష్టి కృషి వలనే దక్కాయి. మీరు (అభిమానులు) కూడా నా నా సమిష్టిలో భాగమే.
అనసూయ భరద్వాజ
👁️🗨️👌🔖♻️@🌳
“Everyone has problems. Everyone has their own journey. Right now, I am buying the things I need. I can go wherever I want. The big car and the house are all a result of Team effort. You (the fans) are also a part of my Team.
Anasuya Bharadwaj
👁️🗨️👌🔖♻️@🌳
Comments
Post a Comment