క్రీడలు 🏟️ Play Phenomenon 📽️ (చ.క్రీ చదువు)
⚛️🪷🌳
14.05.2020
ఆటగాళ్లు ఇన్నింగ్స్ అడతారు, వెళ్తారు. కానీ మైదానంలో మంచి వ్యక్తిత్వంతో మెలిగే వాళ్ళు మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. అలాంటి వారి జాబితాలో నాకు సచిన్ ముందునిలుస్తాడు.
సచిన్ తెందుల్కర్ వ్యక్తిత్వం ప్రత్యేకమైంది. నేను వెనక నుంచి ఏదైనా చేసిన చెప్పినా చిరునవ్వే అతడి సమాధానంగా ఉండేది.
నేను టీవీలో కంటే నేను స్టంప్స్ వెనక నిలబడి కీపింగ్ చేసేప్పుడు ఎక్కువగా బ్యాటింగ్‌ను ఇష్టపడి ఆస్వాదించేవాడిని.
నేను వికెట్ కీపర్‌గా ఉన్నప్పుడు ఎంతో మంది ఆటగాళ్లు బ్యాటింగ్ చేసేవారు. సచిన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మాత్రం అతడు ఔట్ అవ్వాలని నా మనసు ఎప్పుడూ కోరుకోలేదు. సచిన్ స్థానంలో బ్రయన్ లారా, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్ ఉంటే నా కీపింగ్‌లో వారిని ఔట్ చేయాలనే కోరుకునే వాడిని.
చాలా మ్యాచుల్లో మా పాక్ ఓటమికి కారకుడైనప్పటికీ అతడే నా ప్రియమైన ప్రత్యర్థి
-పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్-
(సేకరణ: Eenadu.net ; సవరణ: ఆనాభాశ్యా)
30.05.2020
Whether we win or lose, we have this equilibrium on how to take a win or loss.
The smile hides a huge amount of sadness and disappointment.
While thinking about 20 million people back in Sri Lanka who had been waiting for this for so long, since 1996. -Kumar Sangakkara with Ashwin Ravi
On 2011 WorldCup Final
21.09.2020
Devdutt Padikkal looking like a serious and elegant player on his debut.
23.09.2020
ధోనీ, క్రిస్‌గేల్ తరహానే కేరళ కుర్రాడు సంజు శాంసన్ కూడా భావోద్వేగాల్ని ప్రదర్శించకుండా.. చాలా ప్రశాంతంగా కనిపిస్తూ.. క్రీజులో పెద్దగా కదలకుండా, హడావుడి పడకుండానే.. బ్యాటుతో విధ్వంసం సృష్టించడం ఆటలో చాలా మంచి పరిణామం.
ఇలాంటివి మానసిక ఆరోగ్యానికి ఉల్లాసానికి దోహదం చేస్తాయి. వీటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అనిపిస్తుంది.
17.09.2020
ఆటలొ ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలు ఉంటాయి.
కానీ ఇప్పుడెవరూ వ్యక్తిగతంగా తీసుకోవడం లేదు- విరాట్ కోహ్లీ
27.09.2020
Rahul Tewatia has redefined the meaning of "Astonishing Action in Cricket"
He carved the condition, and became an one of the top performer in IPL in just 10 minutes space.
28.09.2020
2020.. కూడా రాహుల్ తెవాతియా అయిపోతే ఎంత బాగుండు! -రాజస్థాన్ రాజులు-
(Hoping 2020 does a Rahul Tewatia
- Rajasthan Royals -)
ఈనాడు లోని ఆ మాటకి విశ్లేషణ పూరిత వివరణ. దానికి నేను కూడా చేసిన కొన్ని సవరణలు
తొలి 19 బంతుల్లో ఎనిమిది పరుగులే చేసి అభిమానుల సహనానికి పరీక్ష పెట్టి. ఆ తర్వాత 12 బంతుల్లో 45 పరుగులు చేసి సంతోష పెట్టాడు ఆ ఆటగాడు.
అలాగే ఈ 2020 సంవత్సరం కూడా కరొన వల్ల దేశ నిర్బంధం, ఆర్థిక నష్టాలు.. నిరుద్యోగం, ఇంకా ఊహించని రీతిలో ప్రపంచవ్యాప్తంగా వరదలు.. తుపాన్లు.. కార్చిచ్చులు.. విస్ఫోటనాలు, ప్రముఖుల అకాల మరణాలు చోటు చేసుకున్నాయి.
ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలోని పరిస్థితులు కూడా ఆ రాహుల్ తెవాతియా లా మారిపోతే ఎంత బాగుంటుంది.
19.01.2021
ఈరోజు శుభ్‌మన్ గిల్ వేసిన బలమైన పునాదిపై పుజారాతో కలిసి రిషభ్ పంత్ దుర్భేద్యమైన కోటగోడలు నిర్మించాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి టీ20 క్రికెట్ ఆడి గబ్బ లొ అబ్బ అనిపించే సమిస్టి విజయం.
పూర్తిగా ఈ ఆట మొత్తం ఆద్యంతం ఆదర్శంగా ఉంది.
19.01.2022
ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మార్క్ నికోలస్ నిర్వహించిన ‘నాట్ జస్ట్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌లో కోహ్లీ తన జీవితంలో కఠిన దశగురించి వివరించాడు.
ఇంగ్లాండ్‌లో 2014లో పర్యటించినప్పుడు ఆ సిరీసులో ఐదు టెస్టుల్లో కోహ్లీ వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులు మాత్రమే చేశాడు. పది ఇన్నింగ్సుల్లో 13.50 సగటు మాత్రమే సాధించాడు. ఆ పర్యటన తర్వాత ఆసీస్‌కు వెళ్లిన విరాట్ అక్కడ 692 పరుగులు చేసి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
కుంగుబాటుకు గురయ్యారా అన్న ప్రశ్నకు విరాట్ ‘అవును. అయ్యాను "ప్రపంచంలో నేన్కొడినే ఒంటరి" అనే భావనలో కూడ ఉన్నాను’’ అని జవాబిచ్చాడు.
‘పరుగులు చేయలేకపోతున్నామని తెలిసిన అనుభూతి గొప్పదేం కాదు. ప్రతి క్రికెటర్ ఏదో ఒకదశలో తన నియంత్రణలో ఏదీ ఉండదని అనుకుంటాడు. అప్పుడు నా జీవితంలో అండగా నిలిచేవాళ్లున్నా ప్రపంచంలో నేను ఒంటరినని అనిపించేది. మాట్లాడేందుకు మనుషులు లేరని కాదు. నా మనసులో ఏముందో పూర్తిగా అర్థం చేసుకొనే నిపుణుడు లేరనిపించింది. నిజానికి ఇది పెద్ద విషయం. ఈ పరిస్థితిలో మార్పు చూడాలనుకున్నా’ అని కోహ్లీ అన్నాడు.
కెరీర్‌ను నాశనం చేయగల మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూదని విరాట్ తెలిపాడు. ‘నాకిలా అనిపిస్తోంది. నిద్రపోవడమూ కష్టంగా ఉంది. పొద్దున్నే లేవాలనిపించడం లేదు. నాపై నాకు నమ్మకం ఉండటం లేదు. వీటిని పోగొట్టుకోవడానికి నేనేం చేయాలి? అని చెప్పుకొనేందుకు ఒకరు ఉండాలి. కొందరు ఇలాంటి అనుభవాలతోనే సుదీర్ఘ కాలం గడుపుతారు. ఒక్కోసారి క్రికెట్ సీజన్ అంతా ఇలాగే బాధపడతారు. దాన్నుంచి తప్పించుకోలేరు. ఇలాంటప్పుడు నిపుణుల సహాయం అవసరమని నిజాయతీగా చెప్పగలను’ అని అతడు పేర్కొన్నాడు.
1990ల్లో టీమ్‌ఇండియాను చూసి క్రికెట్లోకి రావాలని బలంగా నిర్ణయించుకున్నానని విరాట్ తెలిపాడు. ‘90ల్లోని భారత జట్టు నా ఊహాత్మక శక్తిని ప్రేరేపించింది. నమ్మకం, నిర్ణయం ఉంటే అద్భుతాలు జరుగుతాయని నన్ను నేను విశ్వసించాను. దేశం తరఫున ఆడాలన్న జ్వాల రగిలింది’ అని అతడు వెల్లడించాడు. ‘18 ఏళ్ల వయసులో మా నాన్న మరణించారు. ఆ సంఘటన నాపై విపరీతంగా ప్రభావం చూపించింది. నా అంతరంగంలోకి నేను చూసుకొన్నాను. బాల్యంలో క్రికెట్ ఆడేటప్పుడు మా నాన్న చాలా కష్టపడ్డారు. ఏదేమైనా నా కల నెరవేరుతుందని, దేశం తరఫున అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడటం నిజమవుతుందని అప్పుడే గట్టిగా విశ్వసించాను’ అని విరాట్ పేర్కొన్నాడు.
నిజ జీవితంలోనూ మైదానంలో ఉన్నట్టే ఉంటానని కోహ్లీ తెలిపాడు. ఇతరుల కోణంలో తన అభిప్రాయాలు చూసుకోనని, సొంతంగా పనిచేసుకుంటూ వెళ్తానని వెల్లడించాడు. ‘వ్యక్తిగతంగా నేనేం చేస్తానన్నదే నాకు ముఖ్యం. అలాగే మైదానంలోనూ కృషి చేస్తాను. కొంతమంది ముందు బాగా కనిపించాలని భావించను. నేనలాంటి వ్యక్తిని కాను. అంచనాల విషయానికి వస్తే వాటి గురించి ఆలోచిస్తే భారంగా అనిపిస్తుంది’ అని విరాట్ తెలిపాడు.
సేకరణ: ఈనాడు Eenadu.net
సవరణ: ఆనాభాశ్యా
16.02.2021
ప్రత్యర్థి గెలుపు అసాధ్యం అనిపించిన తరుణంలో అతని నుంచి వచ్చిన విధ్వంసం నా వినోదానికి కారణమయ్యింది. Momeen Ali, Thanks for Garnish in Game
22.02.2021
మష్రఫై మొర్తజా (బంగ్లదేశ్ క్రికెట్ కెప్టెన్)
క్రికెట్ తో ముడిపడ్డ దేశభక్తి ఏంటో నాకర్థం కాలేదు. ఇలా మాట్లాడేవాళ్ళందరూ ముందు రోడ్డు మీద అరటి తొక్కలు వేయడం, వీధుల్లో ఉమ్మడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం మానాలి. అప్పుడు దేశం మారుతుంది.
క్రికెటర్లుగా మేమేం చేస్తాం?! నిజాయితీగా చెప్పాలంటే డబ్బులు తీసుకుంటాం. ఆట ఆడతాం. ఒక గాయకుడు. ఒక నటుడు చేసేదే మేమూ చేస్తాం. అంతకుమించి ఏం లేదు.
"నేనొక క్రికెటర్ని, కానీ నేను ఓ ప్రాణాన్ని కాపాడగలనా? కానీ ఓ వైద్యుడు కాపాడగలడు, కానీ దేశంలోని అత్యుత్తమ వైద్యుడిని ఎవరూ అభినందించరు. వాళ్లు నిజమైన తారలు. అలాగే శ్రామికులు కూడా వాళ్లు దేశాన్ని నిర్మిస్తారు. మేం క్రికెట్ ద్వారా ఏం నిర్మిస్తాం! కనీసం ఒక ఇటుక తయారు చేయగలమా? క్రికెట్ మైదానంలో వరి పండుతుందా? ఇటుకలతో ఫ్యాక్టరీలు నిర్మించే శ్రామికులు.. పొలాల్లో పంటలు పడించేవాళ్లు నిజమైన తారలు. క్రికెట్లో మా దేశ నిజమైన హీరోలంటే రకిబుల్ హసన్ లాంటి వాళ్లు 1971 స్వాతంత్ర్య పోరాట సమయంలో అతను బ్యాట్ మీద బంగ్లాకు స్వేచ్ఛనివ్వండనే సందేశంతో మైదానంలోకి వెళ్లాడు అక్కడ తను ఒక హీరో.
క్రికెట్ కోసం చాలా సమయం, శక్తి సామర్ధ్యాలు వృథా చేస్తున్నారు.
నిజాయితీగా పని చేయడానికి వాటిని ఉపయోగించండి, అది నిజమైన దేశభక్తి" అని మొర్తజా అన్నాడు.
చాలామంది క్రికెటర్లు తమను తాము మహిమాన్వితుల్లా భావిస్తున్న ఈ రోజుల్లో మొర్తజా వ్యాఖ్యలు ఆసక్తికరమే
--------
Mashrafai Mortaza (Bangladesh cricket captain) Interesting comments
I could not understand the patriotism tied to cricket. Those who talk like this should first stop putting banana skins on the road, spitting on the streets, violating traffic rules. Then the country will change.
What do we do as cricketers?! Honestly we take money. Let's play the game. One of the singer. We also do what an actor does. There is nothing more than that.
′′ I'm a cricketer, but can I save a life? But a doctor can save, but no one will appreciate the best doctor in the country. They are the real stars. And the laborers will build their country. What we build through cricket! Can we at least make a brick? Is paddy ripening in the cricket ground? The workers who build factories with bricks.. The real stars are the ones who plant crops in the fields. The real heroes of our country in cricket are people like Rakibal Hasan during 1971 independence fight he went to the field with the message of freedom to Bangla on bat and there he is a hero.
that's true patriotism Mortaza said.
22.02.2021
నేను శారీరకంగా దృఢం అయ్యే క్రమంలో నేను బాగా ఆలోచించడం ప్రారంభించానని గ్రహించాను మరియు మరింత స్పష్టత, ఏకాగ్రత మరియు సంకల్పం కలగడం గమనించాను.
నా భౌతిక పాలనను మార్చిన వెంటనే నాలో నేను ఉన్నట్లు భావిస్తున్నాను. దృఢత్వం పొందడం మీ మీద మీకు నమ్మకం కలిగిస్తుంది. ఇది మీ గురించి మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మంచిగా (దృఢంగా) ఉన్నప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి. -విరాట్ కోహ్లీ
I realised that when I started getting fitter, I started thinking better. Had more clarity fucus and determination.
I started feeling that inside me as soon as I changed my physical regime. Getting fitter makes you confident overall. It makes you feel good about yourself. You need to feel good to have good thoughts- Virat Kohli.
06.03.2021
The 100 will come when it's the right time for me.
I am happy to contribute to the team. -Washington Sundar
Blessed 😇 Optimism
16.03.2021
సెహ్వాగ్ సూచించినది, నాకు అన్వయించుకొని రాసుకున్నాను
‘ఈ రోజు నువ్వు బాగా ఆడుతున్నావని (పని చేస్తున్నావని) తెలిస్తే.. వీలైనంతసేపు క్రీజులో (ఆ పనిలో) పాతుకుపో. చివరి వరకు పరుగులు (పనులు) చేస్తూ నాటౌట్‌గా మిగిలిపో. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. పరుగులు (ఆ పనులు) చేస్తావో లేదో చెప్పలేం. కానీ, నువ్వు బాగా ఆడే (ఉండే) రోజు పరిస్థితి ఎలా ఉందనే విషయం అర్థమవుతుంది. దాంతో ఆరోజు ఔటవ్వకుండా (అలసిపోకుండా) ఉండి పరుగులు (పనులు) సాధించాలి’ అని సచిన్ నాతో చెప్పాడు.
అదే విషయం కోహ్లీ వ్యవహార శైలిలో తెలుస్తోంది. అది రిషబ్ పంత్, కిషన్ కిషన్ నేర్చుకోవాలి అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు.
05.04.2021
Fakhar Zaman Salute to your performance and Transparancy character in the game
09.04.2021
మనమంతా ఒక నమ్మకంతో ఉంటే కచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాం. అందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలి - విరాట్ కోహ్లీ-
If we all have a faith, certainly we create wonders. Everyone should be ready for that - Virat Kohli -
22.04.2021
అక్కడ సాధించా.. ఇక్కడ కొనసాగిస్తా
-వాషింగ్టన్ సుందర్-
22.04.2021
"Game, it puts you down but you need to find a way and come out better." We need to be honest with ourselves. Need time to look into what went wrong and understand. I am sure we will comeback well. - Sanju Samson -
28.04.2021
Sportive spirit is increasing in game, I'm happy to see the healthy environment in Cricket. "Whether we win or lose, it should give some relief to the people who watched our game."
క్రికెట్‌లో క్రీడా స్ఫూర్తి పెరుగుతోంది, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చూడటం నాకు సంతోషంగా ఉంది. ‘మేం గెలిచినా, ఓడినా మా ఆటను చూసిన ప్రజలకు అది కాస్తయిన ఉపశమనం ఇస్తే చాలు.
30.05.2021
అభిమాని: మీరు విమర్శలను ఇష్టపడతారా లేక పొగడ్తలను ఇష్టపడతారా?
కోహ్లీ: నిర్మాణాత్మకమైన విమర్శలతో పాటు నిజమైన పొగడ్తలను ఇష్టపడతా. అబద్ధాలను అస్సలు పట్టించుకోను.
------------
అభిమాని: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎవరైనా ఆందోళన చెందకుండా, ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
కోహ్లీ: ముఖ్యమైన వాటి గురించే ఆలోచించండి. అలాగే అంతా మంచే జరుగుతుందనే అనుకోండి. ఎప్పుడైనా అది జరగొచ్చనే అభిప్రాయంతో ఉండండి.
01.06.2021
రోహిత్ తన మొదటి అంతర్జాతీయ అర్ధశతకాన్ని నా బ్యాటుతోనే అందుకున్నాడు. అందుకు నేనెంతో గర్విస్తున్నా. అవును, నేను దాంతోనే బ్యాటింగ్ కి వెళ్లి డకౌట్ గా వెనుతిరిగాను. ఈ బ్యాటు నన్ను తిప్పలు పెడుతోందంటూ రోహిత్‌కు చెప్పాను. ఏంటి? ఈ బ్యాటు బాగా లేదంటావా? నాకివ్వు అంటూ హిట్ మ్యాన్ బదులిచ్చాడు. దాంతో నేనతడికి బ్యాటు ఇచ్చాను. అతడు నేరుగా అదే బ్యాటుతో మైదానంలోకి వెళ్లి ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత ఇన్నింగ్స్ ఆడి తొలి అంతర్జాతీయ అర్ధ శతకాన్ని అందుకున్నాడు.
ఆ ఘనత నా బ్యాటుది కాదు. ఆడిన బ్యాట్స్‌మన్‌దే. అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు ఎంతో బాగుంటుంది. ఆ విషయాలు నాకెంతో విలువైనవి’ Dinesh Karthik
06.06.2021
పుజారాకు అంకితభావం ఎక్కువ. పట్టుదలగా, క్రమశిక్షణతో ఆడుతాడు (అతడి జీవనశైలీ ఇలాగే ఉంటుంది). ఇక పంత్ తన శైలిలో నిర్భయంగా ఆడేందుకు ఇష్టపడతాడు. సరదాగా ఉంటాడు. పంత్, పుజారా గెలుపు కూర్పులో ఉండాల్సిందే.
ఏ జట్టులోనూ 11 మంది పుజారాలు, 11 మంది పంత్‌లు ఉండరు కదా. కూర్పులు ఉన్నవారిని శైలిలోనే ఉండనివ్వడం ముఖ్యం.
సారథి విరాట్ కోహ్లీ అత్యంత పరిణతి కలిగిన ఆటగాడు 2016లో ఐపీఎల్‌లో నాలుగు సెంచరీలు, భారీ సిక్సర్లు బాదిన అతడే వెస్టిండీస్‌లో గాల్లోకి కొట్టకుండానే ద్విశతకం చేశాడు. టెస్టుల్లోనూ రాణిస్తున రోహిత్‌శర్మ తన ఆలోచనలు, బ్యాటింగ్‌పై నియంత్రణ సాధించాడు. అజింక్య రహానె గొప్ప ఆటగాడని జట్టు విజయం కోసమే కృషి చేస్తాడని వెల్లడించారు. Vikram Rathour (Indian Cricket Team Batting Coach)
25.06.2021
We will also wait well to get Win with our Endeavours. It matters for Enjoyment
విజయం కోసం మన ప్రయత్నాల్లో మనం ఓపికతో ప్రశాంతంగా ఉండడం కీలకం.
All the Best Team India & Indian Cricket Team
PC Sportskeeda Cricket
Note: This thought is For myself also
10.07.2021
Indian Cricket Team and Female Cricket you can feel proud with the moment of
Harleen Deol's Fabulous Fielding 👏
Cracking Catch 👍
16.08.2021
From waking up to "Hope India survive the day" to "Hope India win this one". What a day of Test cricket!
Team work makes the dream work ✨
----
We went from a very strong position where we looked like we would win the game to losing.
Joe Root
Wasim Jaffer
If 15th August has taught anything to the British, it is to never mess with Indians after 15th August.
Perfect independence day return gift to England.
KTRTRS
What a win & what an amazing test match!!
Brilliant show Team
Kudos to the killer pace attack; our own Hyderabad lad Siraj Shami & Bumrah with both ball & bat, consistency of Ishant
Really love the drama that test cricket is & cherish beating England at lords.
27.08.2021
కొండంత ఆధిక్యమిచ్చిన ఉత్సాహంతో ప్రత్యర్థిని చుట్టేద్దామనుకున్న ఇంగ్లాండ్‌కు ఊహించని ప్రతిఘటన. తొలి ఇన్నింగ్స్ ఘోరవైఫల్యం నుంచి బయటపడుతూ... కోహ్లీసేన దృఢ సంకల్పంతో ఎదురొడ్డి నిలిచింది. ఎప్పటివరకో.. ఎంతవరకో తెలియదు! అద్భుతంగా పోరాటమైతే చేస్తున్నారు మన ఆటగాళ్లు. అసలేమాత్రం ఆశలు లేని స్థితి నుంచి, ఓటమి లాంఛనమే అనుకున్న దశనుంచి జట్టును ఓ మెట్టు ఎక్కించారు. ఇప్పటికీ ఓటమి ముప్పు స్పష్టంగా ఉన్నా.. ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉన్నా... గట్టెక్కడం తేలికేమీ కాకపోయినా.. మిణుమిణుకుమంటూ టీమ్‌ఇండియాలో ఏ మూలో చిన్న ఆశ! ముప్పు తొలగకున్నా.. మూడో రోజు భారత్‌దే.
Ind: 78 and 215/2
Eng: 432 (India lost the match)
30.08.2021
🇮🇳 Javelin Throwers have been killing it in Tokyo 2020 🤩
Sumit Antil scripts history, bags a 🥇in the Javelin Throw F64 event 🔥
P.S. He broke the World Record 3⃣ times in 6⃣ tries, with a best throw of 68.55m 🤯
#Praise4Para #Cheer4India #PlayPhenomenon
Source: Delhi Capitals
04.08.2021
Pramod Bhagat 👉🏻 Gold Medal (Badminton)
Manoj Sarkar 👉🏻 Bronze Medal (Badminton)
Manish Narwal 👉🏻 Gold Medal (50m Pistol)
Singhraj Adhana 👉🏻 Silver Medal (50m Pistol)
Medals continue to flow for 🇮🇳 at the #Paralympics. Congratulations to all you superheroes! 🙌🏻
#Cheer4India #Tokyo2020.
15.08.2021
‘ఆటలను ప్రేమిస్తే సరిపోదు.. ఆడాలి’
భారత్ అత్యంత యువ దేశాల్లో ఒకటి, కానీ అత్యంత యుక్తమైన (ఫిట్టయిన) దేశం కాదు. దేశంలో క్రీడా సంస్కృతి లేకపోవడాన్ని కూడా ఇది సూచిస్తోంది.
భారత్‌కు క్రీడాభిమానులు మద్దతుతో ఉత్సాహంగా స్పందించడం సంతోషాన్నిచ్చింది, కానీ ఆటగాళ్ల నుంచి ప్రేరణ పొంది జనం ఆటలు ఆడడం మొదలు పెడితే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
దురదృష్టవశాత్తు.. ఏదైనా కోల్పోయినప్పుడే దాని విలువను గుర్తించడం మానవ లక్షణం. మనందరం మన ఆరోగ్యాన్ని తేలిగ్గా తీసుకున్నాం. ‘విద్యా హక్కు’ లాగే.. ‘ఆడే స్వేచ్ఛ’ కూడా చాలా ముఖ్యం. క్రీడలు కేవలం ఒక భౌతిక కార్యకలాపమే కాదు, అది వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. నాయకత్వ లక్షణాలు అబ్బేలా చేస్తుంది. వ్యక్తుల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉండేందుకు ఆట దోహదపడుతుంది.
ఇప్పటికే నష్టపోయిన తరగతి విద్య కోసం పిల్లల క్రీడ తరగతులను విస్మరిస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మనం ఇకనైనా ఆటలను ముఖ్యంగా తీసుకోవడం మొదలుపెట్టాలి. మన పిల్లలు ఆటలను ఎంచుకుంటే వాళ్లందరూ క్రీడాకారులు కాకపోవచ్చు. కానీ తప్పకుండా ఆరోగ్యవంతులైన వారి వృత్తిలో ఎదుగుతారు.
ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. భారత్‌ను ఆటలను ప్రేమించే దేశం నుంచి ఆటలను ఆడే దేశంగా మారుస్తామని మనమంతా ప్రతినబూనుదాం. మన దేశ ఆరోగ్యం పట్ల మనందరికీ బాధ్యత ఉంది.
మూలం: Sachin Tendulkar, సవరణ: ఆనాభాశ్యా
06.09.2021
ఇటీవల ఒక ఆంగ్ల మీడియా సంస్థ నీరజ్ చోప్రాను ఆన్‌లైన్ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఆయన వ్యక్తిగత, క్రీడా జీవితానికి సంబంధించిన పలు విషయాలు అడిగారు. ఈ క్రమంలో ఆర్ట్ హిస్టారియన్ రాజీవ్ సేథీ లైన్‌లోకి వచ్చారు. ‘‘అందమైన కుర్రాడివి.. నీ సెక్స్‌జీవితాన్ని.. అథ్లెటిక్స్ ట్రైనింగ్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకొంటున్నావు..?’’ అని ప్రశ్నించారు. పైగా అదొక ఇబ్బందికరమైన ప్రశ్నే అయినా.. అథ్లెటిక్స్‌కు అది సీరియస్ ప్రశ్నే అని సమర్థించుకొనే ప్రయత్నం చేశారు.
దీనికి నీరజ్ చోప్రా చాలా హుందాగా స్పందిస్తూ.. ‘సారీ సర్’ అని సమాధానం ఇచ్చారు. అయినాకానీ, రాజీవ్ సేథీ ఒక పట్టాన ఆగలేదు. మరోసారి అదే ప్రశ్నకు సమాధానం కోసం ఒత్తిడి చేశారు. ఈ సారి కూడా నీరజ్ ఏమాత్రం సహనం కోల్పోకుండా ‘ప్లీజ్ సర్, మీ ప్రశ్నతో నా మనసు నిండిపోయింది’ అంటూ కట్ చేశారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.
వాస్తవానికి నీరజ్ మొదటి నుంచి వివాదాస్పద ప్రశ్నల జోలికి వెళ్లడు. ఇంటర్వ్యూల్లో పూర్తి పరిపక్వతతో మాట్లాడతాడు. అతని వయస్సును బట్టి ఏవో ప్రశ్నలు అడిగి కొంటె సమాధానాలు కోరే వారు అతని హుందాతనం చూసి అవాక్కవుతారు. రెండేళ్ల క్రితం ఓ ఆంగ్ల వార్త సంస్థ ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తూ ‘నీ ఇష్టమైన హీరోయిన్ ఎవరూ’ అని అడిగారు. అతనికి నీరజ్ రెండు చేతులు జోడించి సోదరా.. ఇలాంటి ప్రశ్నలు అడగవద్దని నవ్వుతూ సూచించారు.
08.09.2021
2017: I wrote this quote down a million times in my diary before putting this up on the wall! Quotes that we read and admire have more power when we internalise them and apply in life.
Happiness and gratitude are the only 2 words that define me now. T20worldcup2021
"Every tunnel has Light at the end of it. but only those in the tunnel who believe in the Light will Live to see it". -Ashwin
09.09.2021
శార్థూల్ ఠాకూర్ అంతర్జాతీయ కెరీర్‌ను చాలా గొప్పగా ప్రారంభించాడు. భారీ అంచనాలతో.. అతడిని ఒత్తిడికి గురి చేయొద్దు, జట్టులో కుదురుకుని నిలకడైన ప్రదర్శన చేసేందుకు అతడికి కొంత సమయం ఇవ్వాలి. - మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్-
09.09.2021
ఎన్నో పరువు బరువు బాధ్యతలను భుజానికెత్తుకుని.. భారతజట్టును నడిపించడమనేది సులభమేమి కాదు.
నేను ఆడినప్పటి సారథులు సహా చాలా మంది సారథులు.. తమ నిర్ణయాలకు కట్టుబడి ఉండేవారు. ప్రస్తుతం కోహ్లీ కూడా అదే చేస్తున్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నంత కాలం.. ఎవరేమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోనవసరం లేదు. అందుకే అతడు గొప్ప సారథి ఎదిగాడు.
ఆట పట్ల అతడి దృక్పథం, శారీరక భాష (బాడీ లాంగ్వేజ్) కూడా గొప్పగా ఉంటాయి. సుదీర్ఘ కాలం దాన్ని కొనసాగించడం అసాధ్యం. కానీ, కోహ్లీ కొన్ని సంవత్సరాలుగా అదే తీవ్రతతో జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు’ అని లక్ష్మణ్ ప్రశంసించాడు. -వివిఎస్ లక్ష్మణ్.
24.09.2021
క్రికెట్ లో కొత్త సంచలనం -వెంకటేశ్ అయ్యర్.
24.10.2021
After an intense game, subjects are blissful to see 💚 💙
It's not our day in game, but it's our day in maintaining balance
Pleasant to see captain Kohli and co. Congratulating Pakistan players with smile
Sportive Spirit is increasing. Congratulations Pakistan Cricket Team for winning
Best wishes to Indian Cricket Team for further endeavours in tournament.
05.11.2021
వృత్తిలో విజయం కంటే వైఫల్యాలు అధికంగా ఉండాలని Shane Warne (షేన్‌వార్న్) చెప్పిన సిద్ధాంతం సరైందే. ‘‘జీవితం ఓ చక్రంలాంటిదని నేను నమ్ముతుంటా. కొందరికి చిన్నది కావచ్చు. మరికొందరికి పెద్దది కావచ్చు. చీకటి దశను దాటే వరకు ఓపికగా నిరీక్షించాలి. గత రెండేళ్లుగా జీవిత గమనం ఎలా ఉంటుందో గమనిస్తూ వచ్చాను. నేను మంచి ఫామ్‌లో ఉన్నా లేకపోయినా నాకంటూ కొన్ని బంధనాలను ఏర్పరుచుకున్నా. సుదీర్ఘకాలం నిశ్చలంగా గడపేందుకు ప్రయత్నించా. వైఫల్యాలు ఎందుకు వచ్చాయనే దాని గురించి ఎక్కువగా యోచించడంలేదు. విజయవంతమైన సమయాల్లో వినయంగా ఉండాలని చాలా మంది చెప్తుంటారు. అయితే దానిని నేను గట్టిగా స్వీకరించి ఆచరించాను’’ - Ashwin Ravi (రవిచంద్రన్ అశ్విన్).
06.11.2021
Play hard on the field, but off it, there's always room for friendships and enlightening conversations- Indian Cricket Team
12.11.2021
ఈ ఓటమికి అతనొక్కడినే కారణంగా చూపలేము. ఆడిన ప్రతి మ్యాచ్‌లో రాణించడం గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. కొన్ని సార్లు ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం మేమంతా అతడికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అతడు జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోం. Babar Azam on Hasan Ali. (సవరణ: ఆనాభాశ్యా)
Sport is Always a mix of jubilation and heartbreak ❤️💔.
30.11.2021
మన ఆరాటం.. వాళ్ల పోరాటం
ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తూ, ఓవర్లపై ఓవర్లు కరగదీస్తూ..
అంతా ఉత్కంఠ అయిదో రోజు ఆఖరి అరగంట ఆట రసవత్తరంగా సాగింది.
విజయం ఊరించి ఉస్సూరుమనిపించింది!
చేరువైంది.. చివరికి తటస్థంగా (డ్రా) నిలిచిపోయింది.
---------
The two boys of Indian heritage, being brought up in New Zealand, playing against one of the biggest cricketing nations, trying to fight for a draw and that I suppose, [is] quite an amazing story in itself. It was special for us to be out there, and I thought that was quite fitting. -AJAZ PATEL
22.01.2022
Two types of Football Fans
1. People who watch and understand this beautiful game.
2. People who fight in the name of Messi and Ronaldo and ruin the game.
07.03.2022
Sports has boundaries on the field, but it breaks them all off the field. Sport unites! -Sachin Tendulkar
17.04.2022
'పరుగులు చేయకపోతే ఎవరినీ ఉపేక్షించేది లేదు. అందుకు కోహ్లి మినహాయింపేమీ కాదు. అతడు సరిగ్గా ఆడకపోతే పక్కకు పెట్టొచ్చు. ప్రస్తుతం అతడి బుర్రలో ఎన్నో ఆలోచనలు తిరుగుతుండొచ్చు. అతడో మంచి వ్యక్తి, మంచి ఆటగాడే కాకుండా అతిగొప్ప క్రికెటర్. అయితే, అతడిని నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా. తన మదిలో ఏం అనుకుంటున్నాడో అవన్నీ కాకుండా కేవలం ఒకే విషయం మీద ధ్యాస పెట్టాలని సూచిస్తున్నా. ఎవరు ఏమనుకుంటున్నారనేది వదిలేసి తనని తాను ఒక సాధారణ ఆటగాడిగా భావించాలి. బ్యాట్ తీసుకొని దంచికొట్టడమే పనిగా పెట్టుకోవాలి' -షోయబ్ అక్తర్-
18.04.2022
Every ball is an event KKR and RR have their heartbeats on a fastish treadmill, in the 17th and 18th over. And finally the pendulum has rested in favour of RR. One of the best game of the season. -Me and cricbuzz.
11.05.2022
The cricket fraternity is a family of ours. It doesn't matter if someone comes from India, Pakistan, South Africa or West Indies... The fight stays restricted to what happens on the field. Mohammad Rizwan
-------------------
After the second First-Ball duck, I realised what it feels like to be absolutely helpless. It hasn't happened to me ever in my career. I think I have seen everything now. It has been so long I have seen everything in this game Virat Kohli.
20.05.2022
Length of an IPL season is just astonishing. A player can be in fantastic form and also in a terrible form in the same season. That's why players like Virat, Raina, Shikhar and Warner got to be celebrated more. They have been doing it for so long and so consistently that it's barely believable. -Neeraj Sahu
25.05.2022
"ROHIT SHARMA AS A CAPTAIN IS OUTSTANDING - 5 IPL TITLES, ASIA CUP, HE HAS WON WHATEVER HE HAS CAPTAINED AND MISTAKES OR FAILURES HAPPEN BECAUSE ALL ARE HUMANS" -SOURAV GANGULY
28.05.2022
In Sports, Subjects we love to see is Mutualness. Rivalry is just restricted to the field ❤️ 💓
-Anonymous-
16.06.2022
ఇప్పటి క్రికెటర్లు అప్పటి మేటి క్రికెటర్లతో పోలిస్తే చాలా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. ఆటగాడి ప్రదర్శనతో డబ్బుకు ముడిపెట్టలేము వాళ్లందరికీ బాగా ఆడాలనే ఆకలి ఉంటుంది.
ఆటగాళ్లు డబ్బు కోసం మాత్రమే ఆడరు, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం, భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని గర్వంగా చెప్పుకోవడం కోసం కూడా ఆడతారు. సౌరవ్ గంగూలీ.
02.08.2022
People know MS Dhoni, hope people know us too. We lost the medal by one point four years ago but this time we have made up for that by making history. I hope this effort gives us some recognition.
Rupa Rani Tirkey
Lawn Bowl Game
Gold Medalist (CWG 22).
25.08.2022
"నా ఆట ప్రమాణాలు ఏమిటో తెలుసు. పరిస్థితులకు, విభిన్న వాతావరణానికి, వైవిధ్యమైన బౌలింగ్ కు ఎదురు నిలిచే సామర్థ్యం లేకపోతే అంతర్జాతీయ క్రికెట్లో ఇంత దూరం వచ్చే అవకాశమే లేదు. గతంలో ఇంగ్లాండ్ లో అంతా ఓ క్రమ పద్ధతి ప్రకారమే జరిగింది. ఓ విషయంపై కష్టపడి ఆ ఇబ్బందిని అధిగమించా. కానీ ఇప్పుడు ఇది సమస్య అని చెప్పే సూచనలే లేవు. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి అలవోకగా బయటపడగలను. మెరుగ్గానే బ్యాటింగ్ చేస్తున్నానని నాకు తెలుసు. కొన్ని సార్లు తిరిగి లయ అందుకున్నాననే భావన రాగానే ఉత్తమంగానే ఆడుతున్నానని అనుకుంటా. కాబట్టి ఫామ్ లేమి అనేది పెద్ద సమస్య కాదు. 2014 ఇంగ్లాండ్ పర్యటన పూర్తిగా విభిన్నం. బాగా ఆడడం లేదని అప్పుడు తెలిసింది. తిరిగి పుంజుకునేందుకు శ్రమించా. కానీ ఇప్పుడు అలా కాదు. అంతా బాగానే ఉంది. కెరీర్లో ఎత్తుపల్లాలు ఉంటాయని తెలుసు. ఈ దశ నుంచి బయట పడ్డాక ఎంత నిలకడగా రాణిస్తానో కూడా తెలుసు. నా అనుభవాలు విలువైనవి. ఈ దశ నుంచి ఏం నేర్చుకుంటున్నానన్నది ముఖ్యం ఓ ఆటగాడిగా, మనిషిగా నాకున్న విలువలను అర్థం చేసుకోవాలనుకుంటున్నా"- విరాట్ కోహ్లీ.
27.08.2022
“మానసికంగా కుంగిపోయాను అని చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపడను. ఇది చాలా సాధారణ విషయమే అయినప్పటికీ.. దీని గురించి మాట్లాడేందుకు మనం సంకోచిస్తుంటాం. మనల్ని మనం మానసికంగా బలహీనులుగా చూసుకోలేం. కానీ, నిజమేంటంటే. మనం బలహీనంగా ఉన్నామని అంగీకరించడం కంటే.. మానసికంగా దృఢంగా ఉన్నామని నమ్మించడం చాలా దారుణం"
“గత పదేళ్లలో నెల రోజుల పాటు నేను బ్యాట్ ను పట్టుకోకుండా ఉండటం ఇదే తొలిసారి. ఇటీవల కొన్ని రోజుల పాటు నా సామర్థ్యాన్ని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నానని గ్రహించాను. నువ్వు చేయగలవు.. పోరాడగలవు.. నీకు ఆ సామర్థ్యం ఉంది.. అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. కానీ, శరీరం మాత్రం ఆగిపొమ్మని చెప్పింది. వెనక్కి తగ్గాలని.. విశ్రాంతి తీసుకోవాలని మనసు సూచించింది. నేను మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తిగా కన్పించొచ్చు. కానీ ప్రతి ఒక్కరికీ కొన్ని పరిమితులుంటాయి. వాటిని మనం గుర్తించాలి. లేదంటే పరిణామాలు హానికరంగా మారొచ్చు"
“సరే.. ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దాం అనుకునే వ్యక్తిని నేను. ఏ పనిలోనైనా పూర్తిగా వివేకం, ఆనందంతో భాగస్వామినవుతా. ఎప్పుడూ అలాగే ఉండటానికి ఇష్టపడుతా. మైదానంలో ఇలా ఎలా ఉండగలుగుతారు? ఆ సామర్థ్యాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. వారికి నేను చెప్పాలనుకునేది ఒకటే.. నాకు ఆట మీదున్న ప్రేమ. ప్రతి బంతితో జట్టుకు సహకరించాల్సింది ఇంకా ఎంతో ఉందని భావిస్తా. మైదానంలోనూ నా పూర్తి శక్తిని ప్రదర్శిస్తా. ఇదేం అసాధారణం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నా బృందం గెలవాలనేదే నా లక్ష్యం" - విరాట్ కోహ్లీ.
12.09.2022
Just because we won the initial games doesn't mean we are perfect.
Just because we lost a couple games doesn't mean we are poor. --Rahul Dravid
20.09.2022
There's alot of talks going on social media that Sanju Samson should replace KL Rahul or Rishabh Pant.
My thinking is very clear, both KL and Pant are competent and playing for my own team, if I compete with my own teammates then I'm letting my country down". -Sanju Samson 👌👍
23.10.2022
అతను చూడని పరుగులా.. అతను కొట్టని శతకాలా.. అతను బద్దలు కొట్టని రికార్డులా.. అతను అందించని విజయాలా.. అతను లిఖించని చరిత్రలా! కానీ విధ్వంసాలు సృష్టించాక.. అద్భుతాలను ఆవిష్కరించాక.. సగర్వంగా సింహనాదాలు చేయడమే చూశాం! కానీ విరాట్ ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం ఎప్పుడైనా కనిపించిందా? ఆదివారం ఆ అరుదైన దృశ్యమే ఆవిష్కృతమైంది.
విరాట్ అందరినీ ఏడిపించేశాడు..! ఆదివారం సాయంత్రం భారతీయులందరినీ ఊపేసిన ఆ ఉద్వేగమే చెప్పేస్తుంది విరాట్ ఇన్నింగ్స్ విలువెంతని! ఎన్ని వైఫల్యాలు.. ఎన్ని నిట్టూర్పులు.. ఎన్ని ప్రశ్నలు.. ఎన్ని సందేహాలు..! అన్నింటికీ కోహ్లి చెప్పిన సమాధానం.. ఈ ఒక్క ఇన్నింగ్స్!
10.12.2022
Double Ishan's 👌(ISHAN (K)ISHAN)
Double Hundred✌️ 💯💯
20.12.2022
It is being known that there are so many Football fans in India too towards Messi, Mbappe and Ronaldo. Now Turn To Support Our Champion Sunil Chhetri.
29.03.2023
మనకు తెలిసిన మనిషి వెనుక ఉన్న తెలియని ప్రయాణం
The unknown journey behind the man we know
💭⚖️🙂📝@🌳
------------------------
రోహిత్ శర్మ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు.. క్రికెట్ కిట్ కొనడానికి అతని వద్ద డబ్బు లేనందున అతను ఒకసారి భావోద్వేగానికి గురైనట్లు నాకు గుర్తుంది. నిజానికి, అతను పాల ప్యాకెట్లను కూడా డెలివరీ చేశాడు - ప్రజ్ఞాన్ ఓజా.
14.03.2023
మూలం: Rohit Sharma
సంస్కరణ: Bharghav Shyam
ఇంకా నేను ఆ ప్రపంచ కప్పు ఓటమి నుంచి బయటపడలేదు. ఫైనల్ ముగిసిన తర్వాత కొద్ది రోజులు ఏం చేయాలనేది తెలియలేదు.
మేము జట్టుపరంగా మంచి ప్రదర్శన చేశామని ఎప్పటికీ గర్వంగా చెప్పగలను. ప్రతి మ్యాచ్ లోనూ అభిమానులను సంతోషపరచడానికి తీవ్రంగా ప్రయత్నించాం. ప్రపంచ కప్పు ఫైనల్ కు చేరుకోగలిగాం. కప్పును సాధించి ఉంటే అంతకుమించిన బహుమతి మరొకటి ఉండదు. ప్రపంచ కప్పు కోసం కష్టపడ్డాం వరుసగా పది మ్యాచులు గెలిచి... ఫైనల్లో ఏమైనా పొరపాట్లు చేశారా? అని ఎవరైనా అడిగితే మాత్రం.. అవును మేం కొన్ని తప్పులు చేశాము అని చెప్తాను. ఔను నిజంగా ప్రతి మ్యాచ్ లోనూ కొన్ని పొరపాట్లు జరిగాయి. ప్రతిసారీ ఉత్తమ ఆట ఆడలేదు. కానీ, 'ఉత్తమ' స్థాయికి దగ్గరగా వెళ్లి పది ఆటల్లో విజయం సాధించాం. కానీ, ఫైనల్లో మాకు కలిసిరాలేదు.
ఓటమి చవిచూసిన తర్వాత తిరిగి పుంజుకోవడం కష్టమే కానీ.. మళ్లీ జీవితాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కానీ, ఈ పరాజయం బాధ నుంచి బయటపడేందుకు ఎక్కడికైనా వెళ్లాలని నిర్ణయించుకుని బయటకు వచ్చా. అయితే, కొంతమంది అభిమానులు నా దగ్గరకు వచ్చి మేము పెట్టిన శ్రమను, అద్భుతమైన ఆటతీరును అభినందిస్తుంటే కాస్త ఉపశమనంగా ఉంది.
ప్రతి ఒక్క ఆటగాడికి, ఆటలో ఇలాంటి దశ ఉంటుందని అభిమానులు అర్థం చేసుకున్నారు. కోపం, నిరుత్సాహం అవరించినప్పటికీ.. మా పట్ల స్వచ్ఛమైన ప్రేమను కనబరిచారు. ఇలాంటి సమయంలో వారి నుంచి మేం కోరుకునేదదే. అభిమానుల కోసం ఆలోచిస్తే.. వారంతా మాతోనే ఉన్నారు. వారి కోసం తప్పకుండా పుంజుకుని వచ్చేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మరొక అద్భుతమైన బహుమతి కోసం తీవ్రంగా కృషి చేస్తాం"
10.01.2024
PEOPLE CALL ME THE UNLIKELIEST CRICKETER, BUT WHERE I'VE REACHED CURRENTLY, IT'S MUCH MORE THAN WHAT I THOUGHT I COULD. "- Sanju Samson
11.04.2024
Very hard to speak at the moment. Hardest job in the tournament is when a captain loses the game and has to tell where the game was lost. When the emotions come down I'll be able to tell clearly. Have to give credit to the Gujarat Titans. That's the beauty of this tournament. Will have to learn and move on.
Sanju Samson
28.04.2024
“నేను ఎలాంటి వ్యక్తిని.. విరాట్ వ్యక్తిత్వం ఏమిటనేది మీడియాకు కనీస అవగాహన కూడా లేదు. మీడియా అనవసరంగా హైప్ సృష్టించింది. వాస్తవానికి పాజిటివ్ కూడా హైప్ సృష్టించవచ్చు. జనాలకు మసాలా దొరక్కపోతే ఇలా చేస్తారని విరాట్ చెప్పిన మాటతో ఏకీభవిస్తాను. పరిపక్వత ఉన్న ఇద్దరి మధ్య బయటివారు ఎలాంటి ఇబ్బందులు సృష్టించలేరు. ఎందుకంటే అంతిమంగా బంధం వారి మధ్యే ఉంటుంది"
“ప్రతి ఆటగాడికి భిన్నమైన శైలి ఉంటుంది. కోహ్లి చేసేది
మ్యాక్సవెల్ కు సాధ్యం కాకపోవచ్చు, విరాట్ ఆడినట్లు.. మ్యాక్సవెల్ ఆడలేకపోవచ్చు. మీ జట్టులో విభిన్నమైన బ్యాటర్లు ఉండాల్సిందే. 1 నుంచి 8వ నంబర్ వరకు మీ వద్ద హిట్టర్లే ఉంటే.. 300 కొట్టొచ్చు లేదా 30కే ఆలౌట్ కావచ్చు. 100 స్ట్రైక్ రేటుతో ఆడినా మీరు గెలిచే పరిస్థితి ఉంటే మంచిదే. 180 స్ట్రైక్తేట్తో ఆడి ఓడిపోతే ఏమిటి ప్రయోజనం
విరాట్ కోహ్లీ గురించి గౌతమ్ గంభీర్.
19.05 2024
తన బౌలింగ్ లో రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత యశ్ దయాళ్ చాలా అపఖ్యాతి పాలయ్యాడు కానీ ఈరోజు ధోని అంతటి మేటి ఫినిషర్ ఉన్న ఆఖరి ఓవర్లో మొదటి బంతి భారీ 6 వెళ్లిన తర్వాత, కోలుకొని బౌలింగ్ వేసిన విధానం అప్పటి అపత్యాతిని ఇప్పుడు తన ఆటతో అంతులేని ఆనందానికి అవకాశం ఇప్పుడు ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అప్పటి అపఖ్యాతి నుండి ప్రస్తుతం పొందిన పరమానందంతో అతను ఆటలో ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేసినట్టు అనిపించింది. క్రీడలు ఇలాంటి క్షణాలతో మనకు చాలా నేర్పిస్తాయి.
💭⚖️🙂📝@🌳
19.05.2024
RCB Royal Challengers Bengaluru Rise from Regression will be Regarded as Rich Resiliency
💭⚖️🙂📝@🌳
23.05.2024
ఐపీఎల్ లో బెంగళూరు ఓటమితో ఒక విధమైన వైరాగ్యంతో వచ్చిన సారాంశ విశ్లేషణ ఇది. "ఐపీఎల్ లో ఇక ఏ జట్టు గెలిచిన నాకు ఆనందంగానే ఉంటుంది అనిపించింది".
ఐపీఎల్ అనేది తీవ్రమైన విషయం కాకపోయినా, తేలికపాటి వినోదాన్ని కొంచెం విశ్లేషణలను అందిస్తుంది అనిపించింది.
💭⚖️🙂📝@🌳
29.06.2024
క్రికెట్ క్రీడలో కీలకమైన కిరీటం
సామర్థ్యంతో సాధించిన సమిష్టి సమూహం,
సామూహిక సంతోషాన్ని సిద్ధింపజేసిన
భవ భారత జాతీయ జట్టుకు
శ్రావాణ శుభాకాంక్షలు.
దీర్ఘకాలంగా దురదృష్టం దరిచేరుతూ
ధ్వజకేతనం దూరమవుతున్న,
ధైర్యమైన దక్షిణాఫ్రికాకు
ద్వితీయస్థాన ధారణనికి
దక్షిణాఫ్రికాకు ధన్యవాదాలు.
విజయానందాన్ని వీడ్కోలు విచారాన్ని
ఒకేసారి ఒలకింపజేసి పాక్షికంగా పక్షానికి
దూరమవుతున్న ద్వయ
దిగ్గజాలకు ధన్యవాదాలు..
💭⚖️🙂📝@🌳
07.08.2024
Her medal got confirmed, but It's Hard Luck for Vinesh Phogat, If Decision Review happens, All Indians will be Happy.
Sometimes Sports are So Savage with Small Separations (Boundaries).
💭⚖️🙂📝@🌳
19.09.2024
నిరాశ నుండి నియంత్రణలోకి
అడుగుపడిన ఆట
అద్భుతంగా అనిపించింది
అశ్విన్ కు అభినందనలు.
జూలు విదిలిస్తున్న జడేజాకు వందనాలు
💭⚖️🙂📝@🌳
19.02.2025
Cricketers
Insisted Struggles
Still Made it
Hardik Pandey Financial Crisis- Still Made It
Virat Kohli Father D!ed- Still Made It
MS Dhoni- Sacrificed His Job- Still Made It
Extreme Poverty- Still Made It
Sachin's Disabilities- Still Made It
Rinku Singh - Uneducated- Still Made It
Rohit Sharma: Lack Of Support- Still Made It
Shreyas Iyer: Rejected- Still Made It
Anonymous
17.03.2025
A different version of you exists in the minds of everyone who knows you. The person you think of as "yourself" exists only for you, and even you don't really know who that is.
Every person you meet, have a relationship with or make eye contact on the street with, creates a version of "you" in their heads.
You're not the same person to your mom, your dad, your siblings, than you are to your co-workers, your neighbors or your friends.
There are a thousand different versions of yourself out there, in people's minds. A "you" exists in each version, and yet your "you", "yourself", isn't really a "someone" at all.
“నువ్వు తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో నీ గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి"
నువ్వు ఎవరినైతే నీలా చూస్తావో వారే నీకోసం ఉంటారు. ఆ వ్యక్తి ఎవరో నీకు నిజంగా తెలియదు.
నువ్వు కలిసేవారు, నీతో పరిచయం ఉన్నవారు.. చివరకు వీధిలో నిన్ను చూసిన వారు కూడా.. నీ గురించి వారి మనసులో సొంత అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు.
మీ అమ్మకు, నాన్నకు, తోబుట్టువులకు, సహోద్యోగులకు లేదా స్నేహితులకు నువ్వు ఒకేలా కన్పించవు. ప్రజలకు నువ్వు వెయ్యి రకాలుగా కనిపించవచ్చు.
ఒక్కొక్కరిలో ఒక్కో రూపంగా కనిపిస్తున్నా, అందరిలోనూ ఉన్నది నువ్వే. అయితే, ఆ నువ్వు మాత్రం ఎప్పటికీ ఇంకొకరివి కాలేవు"
Anushka Sharma on Virat Kohli
Through Eenadu.net
11.04.2025
'సాధారణంగా ఓటమిని ఎవరూ ఇష్టపడరు. నిజం చెప్పాలంటే ట్రోలింగ్ వల్ల నేను బాధపడటం లేదు. ఎవరైనా మన గురించి మాట్లాడుతూ మన లోపాలను ఎత్తిచూపుతూ ఉంటే అంతకుముందు ఉన్నత స్థానంలో ఉన్నామని అర్థం.
మేము దానిని నిర్మాణాత్మకమైన విమర్శగా స్వీకరించవచ్చు. కానీ, కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తారు. నిర్మాణాత్మక విమర్శకు, ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శను నేను సులభంగా గుర్తించగలను. నేను దాని గురించి ఎక్కువ చింతించను.
ఈరోజు కంటే రేపు మరింత మెరుగ్గా ఆడటంపై దృష్టిపెడతా. ఇదే నా జీవిత మంత్రం. నేను బాగా ఆడకపోతే ఇప్పటికీ మా నాన్న మందలిస్తాడు. ప్రేమ ఉన్న చోట నుంచి విమర్శలు వస్తే మంచిదే.
ఏ ఆటగాడు కావాలని తప్పులు చేయడు. కానీ, మీ విమర్శలు, నిర్మాణాత్మకంగా ఉండవచ్చు. అదే సమయంలో తమ అభిమాన ఆటగాళ్లు బాగా ఆడని సందర్భాల్లో మద్దతుగా నిలిచే అభిమానులు కూడా ఉన్నారు. వారు నిజమైన అభిమానులు అని నేను నమ్ముతున్నాను. ©️: Ashwin Ravi
25.04.2025
దూకుడుగా ఆడేందుకు రోహిత్ శర్మకు ఉన్న అవకాశం విరాట్ కోహ్లీకు లేదు జట్టు పరిస్థితుల్ని బట్టి చూస్తే రోహిత్ శర్మలా విరాట్ కోహ్లీ అవకాశం తీసుకోలేడు ఎందుకంటే ముంబైలో రోహిత్ తర్వాత వచ్చే ఆటగాళ్లపై రోహిత్ పరుగులు ప్రభావం చూపించవు. అందుకే రోహిత్ స్వేచ్ఛగా ఆడతారు. కానీ బెంగుళూరు జట్టు విరాట్ చుట్టూనే తిరుగుతుంది. ఆయన పరుగులు చేస్తేనే జట్టుకు మంచి పునాది లభిస్తుంది - ఫించ్.
12.05.2025
The curtains fall on Virat Kohli’s magnificent Test career—an era of dominance, passion, and relentless pursuit of excellence. The first of the fabulous four to step away from the format, his departure leaves a void that few can fill. As a Sri Lankan fan, there’s an undeniable sigh of relief, bidding farewell to a man who turned our bowlers into mere spectators and etched his name into our nightmares. But beyond rivalries, beyond statistics, stands the heart of a true cricketing gladiator, one who electrified the longest format with an intensity few could match.
Farewell, maestro. The whites may be set aside, but your legacy will forever echo through the corridors of Test cricket. Bravo on an extraordinary journey, Virat.
Lankan Lions
👁️🗨️👌🔖♻️@🌳
ఆధిపత్యం, అభిరుచి, నిరంతర శ్రేష్ఠత కోసం నిరంతర ప్రయత్నంతో కూడిన విరాట్ కోహ్లీ అద్భుతమైన టెస్ట్ కెరీర్‌కు తెరలు పడ్డాయి.
ఫార్మాట్ నుండి వైదొలిగిన అద్భుతమైన(FAB) నలుగురిలో మొదటి వ్యక్తి, అతని నిష్క్రమణను అతి కొద్ది మంది మాత్రమే పుడ్చగలరు. ఒక శ్రీలంక అభిమానిగా, మా బౌలర్లను కేవలం ప్రేక్షకులుగా మార్చి, తన పేరును మాకు పీడకలలుగా మార్చుకున్న వ్యక్తికి వీడ్కోలు పలుకుతూ ఒక నిట్టూర్పు. కానీ పోటీలకు అతీతంగా, గణాంకాలకు అతీతంగా, నిజమైన క్రికెట్ గ్లాడియేటర్ హృదయంగా అతని ఆట నిలుస్తుంది, అతి తక్కువ మందితో సరిపోలగల తీవ్రతతో పొడవైన ఫార్మాట్‌ను విద్యుదీకరించిన వ్యక్తి.
వీడ్కోలు, మాస్ట్రో. కానీ మీ వారసత్వం ఎప్పటికీ టెస్ట్ క్రికెట్ కారిడార్లలో ప్రతిధ్వనిస్తుంది. అసాధారణ ప్రయాణంలో బ్రావో, విరాట్.
లంకన్ లయన్స్
08.07.2025
This is the amount of hard work and then you arrive to the ground and then whatever has to take place will take place. The preparation is in my hands, the results are not in my hands. I just have to stay true to my instinct. If I have to hit the ball, I have to hit the ball. That is my only responsibility.
In my position, everyone wants me to do well. There are so many people that want that guy to do well as well. There is no preference here. There is no guarantee that my position is greater than his. He also has a family, he also has friends, he also has people who would love for him to do well. He's also sharing the stage with me.
We get so caught up in, "No, this guy has to do well because when he plays well, we feel good." That we tend to forget you're playing with so many other people who have the same emotion, same desire, same drive.
So when I don't succeed now and someone else succeeds, thankfully, I'm able to look at it that way as well. You don't deserve to perform every time. It is not yours for the taking every time.
There's so many dynamics that play out and you just have to put your head down and just be honest with your work.
It doesn't matter whether I've played 130 test matches or whatever 300 ODIs. If you've played two and your mindset is better than me on the day, you will perform better than me on the day. There is no guarantee, there is no guarantee of me playing 300 ODIs and walking in and saying, it's all gonna unfold. Easily. It doesn't happen like that.
Virat Kohli
👁️🗨️👌🔖♻️@🌳
📽️©️: Royal Challengers Bengaluru
---------------------
ఇంత కష్టపడి మైదానానికి చేరుకుంటాం, ఆ తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది. సాధన నా చేతుల్లో ఉంది, ఫలితాలు నా చేతుల్లో లేవు. నేను నా స్వభావానికి కట్టుబడి ఉండాలి. నేను బంతిని కొట్టాల్సి వస్తే, నేను బంతిని కొట్టాలి. అది నా బాధ్యత.
నా స్థానంలో, నేను బాగా రాణించాలని అందరూ కోరుకుంటున్నారు. ఆతను కూడా బాగా రాణించాలని కోరుకునే వారు చాలా మందే ఉన్నారు. ఇక్కడ ప్ర్రాధాన్యత లేదు. నా స్థానం అతని కంటే గొప్పదని ఎటువంటి హామీ లేదు. అతనికి కుటుంబం ఉంది, అతనికి స్నేహితులు కూడా ఉన్నారు, అతను బాగా రాణించాలని ఇష్టపడే వ్యక్తులు కూడా ఉన్నారు. అతను నాతో వేదికను కూడా పంచుకుంటున్నాడు.
"లేదు, ఈ వ్యక్తి బాగా ఆడాలి ఎందుకంటే అతను బాగా ఆడినప్పుడు, మనకు మంచిగా అనిపిస్తుంది" అనే దానిలో మనం చిక్కుకుపోతాము. అదే భావోద్వేగం, అదే కోరిక, అదే ఉత్సాహం ఉన్న చాలా మంది వ్యక్తులతో మనం ఆడుతున్నారని మనం మర్చిపోతాము.
కాబట్టి, నేను ఇప్పుడు విజయం సాధించనప్పుడు, మరొకరు విజయం సాధించినప్పుడు, కృతజ్ఞతగా, నేను కూడా దానిని అలాగే చూడగలుగుతున్నాను. మీరు ప్రతిసారీ ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి అర్హులు కాదు. ప్రతిసారీ అది మీది కాదు. ఇక్కడ చాలా క్రియాశీలతలు ఆడతాయి మరియు మీరు వినమ్రంగా ఉండి మీ పని పట్ల నిజాయితీగా ఉండాలి.
నేను 130 టెస్ట్ మ్యాచ్‌లు ఆడినా లేదా 300 ODIలు ఆడినా అది పట్టింపు కాదు. మీరు రెండు మ్యాచ్‌లు ఆడినా మరియు మీ మనస్తత్వం ఆ రోజు నా కంటే మెరుగ్గా ఉంటే, ఆ రోజు మీరు నా కంటే మెరుగ్గా రాణిస్తారు. నేను 300 ODIలు ఆడి లోపలికి వెళ్లి, ఇదంతా జరుగుతుందని చెప్పడానికి ఎటువంటి హామీ లేదు. సులభంగా అలా జరగదు.
విరాట్ కోహ్లీ
👁️🗨️👌🔖♻️@🌳
📽️©️: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
11.07.2025
విరాట్ కోహ్లీ విషయాలలోని వాస్తవికత, విజ్ఞానం, వినయం క్రికెట్టుకు మించి విశేషంగా ఉంది. దానిలోని సారాన్ని అర్థం చేసుకుని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నాను.
గెలుపు ఓటములు సహజం. ఒకరు గెలిస్తే, మరొకరు ఓడిపోతారు. కానీ, మనం చేసే పనిని నమ్మకంగా, నిజాయితీగా చేస్తే, ఫలితం ఎలా ఉన్నా సంతృప్తి ఉంటుంది.
బాగా కష్టపడతాం, తర్వాత జరగవలసినవి జరుగుతాయి, కష్టపడి ప్రయత్నించడమే మన చేతుల్లో ఉంటుంది, ఫలితం మన చేతుల్లో లేదు. మనం ప్రతి సారి ఉత్తమ ప్రదర్శన చెయ్యడం సాధ్యం కాదు, దానికి అర్హులం కూడా కాదు, ఎందుకంటే ఎదుటివారికి బాగా రాణించాలనే ఆకాంక్ష ఉంటుంది, వారు చాలా కష్టపడతారు, వారికి కుటుంబం ఉంటుంది, వారికి స్నేహితులు ఉంటారు, వారు బాగా రాణించాలని ఇష్టపడే వ్యక్తులు ఉంటారు. వారు మనతో ఈ వేదికను పంచుకున్నారు, మనకు గెలవాలన్న ఆకాంక్ష ఎంత ఉంటుందో, వారికి కూడా అంతే ఆకాంక్ష ఉంటుంది.
ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం సాధ్యం కాదు, ఒడుదుడుకులు ఉంటాయి, వారి స్థానం కంటే మన స్థానం గొప్పదనే విషయానికి ఎటువంటి హామీ లేదు. నిజానికి దానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు, ఎందుకంటే ఎంత అనుభవం ఉన్న ఆ రోజు మన మనస్తత్వం కంటే వారి మనస్తత్వం మెరుగ్గా ఉంటే, వారు మెరుగ్గా రాణిస్తారు, అనుభవం కన్నా నాణ్యత ముఖ్యం, విజయం ఎవ్వరి సొంతం కాదు, ఈ వాస్తవాన్ని అంగీకరిస్తే నిరాశ, ఒత్తిడి తగ్గుతుంది. అందుకే అహం లేకుండా వారు రాణించినప్పుడు వారి విజయాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి.
మనకి మాత్రమే అన్ని ఉండాలి అనే భావనలో చిక్కుకపోకూడదు, అదే భావోద్వేగం, అదే కోరిక, అదే ఉత్సాహం ఉన్న చాలా మంది వ్యక్తులతో మనం కలిసి ఉన్నామని గుర్తుంచుకోవాలి. దానివల్ల మనం విజయం సాధించినప్పుడు ఆనందంగా ఉంటాము, మరొకరు విజయం సాధించినప్పుడు, కృతజ్ఞతగా దానిని అలాగే చూడగలుగుతాం.
💭⚖️🙂📝@🌳
📖11.07.2025✍️
Comments
Post a Comment