Posts

Showing posts from December, 2024

2) Abigyna-Amukta (Telugu 30.12.2024)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము మోహన కిరణాల క్రాంతి మీమాంసతో  సుమధుర సాహితీ సాంస్కృతిక స్ఫూర్తితో అభిజ్ఞానశాస్కుంతలం ఆముక్తమాల్యదల నేపథ్యంతో నామకరణం  జరిగి జాబిల్లిలా  చిగురించిన చిన్నారుల్లారా,  చక్కగా చదువుతూ చల్లని చిద్విలాసంతో  అంతర్శక్తి అభివ్యక్తీకరణతో  ఆసక్తులను ఆస్వాదిస్తూ,  అనంతమైన ఆనంద  అనుభవాలతో అనుసంధానం  అవ్వాలని ఆకాంక్షిస్తూ,  పసి పిల్లలు కవల కోడల్లకు హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభప్రద శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖30.12.2024(23)✍️   https://bharghavashyam.blogspot.com/2023/12/abigyna-amukta-telugu-1.html

Ego- Eco Centric (Telugu 29.12.2024)

Image
EnTREE        ⚛️🪷🌳       కల్పవృక్షము నేడు నా నేత్రానికి  కనిపించగానే, కవితాత్మక  చింతన చేసి చక్కగా  రాసిన రమణీయ రాత  "స్వీయ కేంద్రీకృతం - సమస్తం కేంద్రీకృతం"  అనే అంశాన్ని, అందమైన ఆకృతితో  మానవుడే మహనీయుడు అనే దృక్పథం దృష్టి నుంచి  ప్రకృతి ప్రధానం అనే దృఢ దృష్ట్యాంతాన్ని, దానిలో  మానవులు మహాపాత్రధారులే  తెలియజేసే తాత్విక తాదాత్మ్య సత్య సిద్ధాంతం" 💭⚖️🙂📝@🌳 📖29.12.2024✍️ భార్గవ భావం, శ్యామ సాహిత్యం

Manmohan Singh (Telugu 27.12.2024)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము మర మనిషి (రోబో) మన్మోహన్ సింగ్  తన నడక నడవిడి, నైపుణ్యం తీసిపోనివి, తన శక్తి సామర్థ్యాలు తలమానికమైనవి,  కానీ బలానికి బానిసత్వానికి కరిగినవాడు  అనిపించిన, కానీ  అసామాన్యమైన  కాంగ్రెస్సులో  కీలకమైన కిరణ కాంతి అధ్యాపకునిగా,  ఆర్థికవేత్తగా, ఆర్థికమంత్రిగా ప్రధాన సలహాదారుగా,  ప్రణాళికసంఘ సభ్యుడుగా, ప్రధాన మంత్రిగా, ప్రామాణికమైన  బరువైన బాధ్యతలతో భారతదేశంలో  ప్రభుత్వ ప్రజాస్వామ్య  వ్యవస్థలోని విశేష వ్యక్తి. 💭⚖️🙂📝@🌳 📖27.12.2025✍️

On Completing Pen (24.12.2024)

Image
⚛️🪷🌳  ఐదో తరగతి నుంచి కలం వాడడం మొదలుపెట్టాను. కొన్ని వందల పెన్నులు కనుక్కుని ఉంటాను, కానీ ఎప్పుడూ ఒక్క పెన్నుని శ్రద్ధగా పూర్తిగా ఉపయోగించలేదు. అవన్నీ మధ్యలో పోయేవి, లేదా వేరే వారికి ఇస్తూనే ఉండే వాడిని.  కానీ రామకృష్ణ అనే సహచర ఉద్యోగిని చూసి ప్రేరణ పొంది, మొదటిసారి ఒక కలంను మొదటినుంచి చివరివరకు పూర్తిగా ఉపయోగించాను. ఆ కలం పూర్తయిన తర్వాత, ఆనందంగా, ఆ కలంతో జ్ఞాపకంగా తీసుకున్న చిత్రం ఇది.  చిన్న సంఘటన అయినా, ఇది మర్చిపోలేని జ్ఞాపకం.  💭⚖️🙂📝@🌳 📖24.12.2024✍️ Since my 5th grade, I started using pens and must have bought hundreds of pens. However, I had never seriously used a single pen in my entire life. It would either get lost or be given away to others. But inspired by my colleague Ramakrishna, for the first time, I used a pen from beginning to end completely. After it was finished, I joyfully took a picture with that pen as a memorable keepsake. Though it's a small event, it is an unforgettable memory. 💭⚖️🙂📝@🌳 📖24.12.2024✍️

Time With Tripti (14.12.2024)

Image
⚛️🪷🌳 In Hyderabad Had Time to meet Tripti; Delightfully Discussed About APU & Sambalpur Stories (Where I previously worked) We reminisced & Refreshed Weekend. 💭⚖️🙂📝@🌳  📖 14.12.2024 ✍️    

Gukesh (Telugu 12.12.2024)

Image
⚛️🪷🌳 పిన్న వయస్కుడిగా  ప్రపంచ విజేత వై  చదరంగంలో చరిత్రగా   గెలిచిన గుకేష్ కు  ఆనందంగా అభినందనలు  💭⚖️🙂📝@🌳 📖12.12.2024✍️