Posts

Showing posts from October, 2024

Susmita Birthday (English 25.10.2024)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము Scholarly Source of  Professor Parents, With Bengali Background &  Worthy English Excellence  Entered into Education  At AzimPremji from BA. Education to MA Education  Made a Perfect Path  to Continue the Content  And becoming  One & Only Student to do so  In our Batch,  With Welcoming Wisdom Became Brilliant & Balanced the Bond  Of Civic & Ethnic  Culture among Class. Warm Blissful Blossom Birthday Wishes Susmita God bless with Gleefulness Bliss Hope Happiness Hails in your Heart. শুভ জন্মদিন তোমাকে সুস্মিতা 💭⚖️🙂📝@🌳  📖25.10.2024✍️

Real Vs Thoughts (Telugu 22.10.2024)

⚛️🪷🌳 ఆలోచనలకు అసలైనదానికి  వైవిద్యం వున్న  ప్రతిబింబాల ప్రభావం  తప్పక తాదాత్మ్యంగా ఉంటుందనిపిస్తోంది.  💭⚖️🙂📝@🌳  📖22.10.2024✍️ #ThroughThoughts  #ఆలోచనల_ఆధారం  #EnTREE_కల్పవృక్షము

Books & Expectations (Telugu 22.10.2024)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము పుస్తకాలను ప్రియమైన వారిని  అర్థం చేసుకోవాలి తప్ప  తప్పైన అపేక్ష చింతనలు  అక్కరలేదు అనిపించింది.  💭⚖️🙂📝@🌳 📖22.10.2024✍️

Kameshwara Rao Tataiya (Telugu 19.10.2024) (3)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము చెరుకుమూడి చంద్రశేఖరుని తాదాత్మ్య, తెలివైన తనయుడైన బాధ్యతలతో బాలాన్ని పెంచుకుని పంచుకుని లక్షణమైన లక్ష్మీని వివాహమాడి విలక్షనంగా పని, పరోపకారం, ప్రశాంతతలో శ్రీకారమైన శక్తిగా, త్రిసంతానానికి తండ్రిగా, భారత జీవిత బీమా సంస్థలో  అధికృతమైన అభివృద్ధి అధికారివై,  అన్నపూర్ణ నిత్యాన్నదానక్షేత్ర  ఆలయ నిర్వకునిగా నిలకడగా నడిపి  చమత్కారం చిరునవ్వు  మేళవించిన మనస్తత్వంగా,  ఉపనయనం, ఉపయోగాది చికిత్సలతో చతుర్ద్విజునిగా  చక్కగా చిద్విలాసంగా  తిరిగివచ్చిన తాతయ్యకు హృదయపూర్వక హార్దిక  పుట్టినరోజు పండుగ  శుభప్రద శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖19.10.2024✍️ ----------------- In Working, Philanthropy, Calmness I saw your energy Kameswar Rao Tataiya/Mamaiya.  As Workaholic doing the work with initiatives and without postponing is your trademark. As a philanthropist making house as Inn for some many people,  "After lots of unfavorables, coming back into life with calmness is your benchmark." 💭⚖️🙂📝...

Chamundeshwari (Telugu 17.10.2024)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము పోటీ ప్రపంచంలో  పట్టుబడి పోటీ పరీక్షలలో  కొన్ని కొలమానమైన అర్హతలను అందుకున్నావు, అయినా అలుపెరుగని  పట్టువిడవని ప్రయత్నాలలో  నిమగ్నమై నిన్ను నీవు నిరూపించే  ప్రయత్నాలకు నా ప్రణామాలు. కళాశాల క్షేత్రస్థాయి  పర్యటన ప్రయాణాల్లో  తగాదాలలో తగు సానుకూల స్వాంతన నీవు. రోమిక రోజులలో  తరగతుల్లో తగ్గకుండా  రాణించి ర్యాంకర్ గా  నికరంగా నిలిచావు.  మృదు మధుర మాటలతో  చమత్కారాన్ని చిరుకోపాన్ని  చిద్విలాసాన్ని చక్కగా  చూపించే చాముండేశ్వరి.... పుట్టినరోజు పర్వదినాన హార్దిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖 17.10.2024 ✍️

Satish Aarya (Telugu 16.10.2024) (2)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము ఈ శనివారం ఈ సుభాషితాన్ని "Focus on improving, not proving" చదివాను. "నిరూపించడం కంటే, మెరుగవ్వడం మీద దృష్టి పెట్టండి", దీని ఇలా "ప్రదర్శన కంటే పురోగమించడంపై కేంద్రీకరించు" అని కవితాత్మకంగా రాసుకున్నాను.  నేను తప్పు చేసినప్పుడు గొప్పవాళ్ళు, అనుభవజ్ఞులు హుందాగా గల వారి కోపానికి నేను కారణమైతే, ఆ ప్రతికూల ప్రతిస్పందనల బాధ దిగిన తర్వాత విచక్షణతో ఆలోచించినప్పుడు దానిని నా పురోగతికి ప్రేరణగా భావిస్తాను, ఎందుకంటే అలాంటి వారికి సాధారణంగా కోపం రాదు, అప్పుడు జరిగిన తప్పులకు కారణాలు చెప్పకుండా (కోపంలో ఉండేటప్పటి కారణాలు చెప్పాలనే గిలి కూడా ఉంటుంది, కానీ దానిని వారి ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పే ప్రయత్నం చేయడం బంధాన్ని బలపరుస్తుంది) మౌనంగా తప్పులను విశ్లేషించుకొని ముందడుగు వేయడం ఉన్నతంగా ఉంటుందనిపించింది. వారికి నామీద కలిగిన కోపంలో మరో సానుకూలత ఏమిటంటే నేను వారికి అది చేయగలను అని అంచనాలను వాళ్లకు కలిగించాను అని అర్థం కూడా వస్తుంది. కాబట్టి నాలో విషయం ఉంది అనే ఆనందం కూడా ఉంటుంది. ఆర్య ఆ అభిజ్ఞాను అన్వయించుకుని సంభావ్య సానుకూల సిద్ధా...

Valli Akka (Telugu 15.10.2024) (3)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము పద్మరాధయ్యల పుత్రికగా అన్నపూర్ణ అమ్మమ్మ  మనవరాలిగా మురిపెంగా  నెల్లూరు నేపథ్యంతో గోదావరి గలగలల రాజమండ్రిలో రాగాలను, ప్రాథమిక పాఠశాల  అభ్యాసాలు ఆర్జించి  కడపలో కృషిగా సంగీత సాధనను, ఉన్నతవిద్య అభ్యసించి  అనుబంధాల అనుసంధానంతో బెంగళూరుకు బయలుదేరి ఉద్యోగంలో ఉంటూ విశదమైన విషయంతో  వంశీబావతో వివాహమై  మాన్యకు మాతవై 'విద్య"తో విదేశం వెళ్లి  వృత్తితో వుంటు వికసించిన వల్లెక్కకు  పుట్టినరోజు పండగ శోభప్రద శుభాకాంక్షలు.  💭⚖️🙂📝@🌳 📖15.10.2024✍️ విద్యావంతురాలై   విశదమైన విషయంతో  వంశీబావతో వివాహమై  'విద్య"తో విదేశం వెళ్లి  వృత్తితో వుంటు  వికసించిన వల్లి అక్కకు  పుట్టినరోజు పండగ శోభమైన శుభాకాంక్షలు.  💭⚖️🙂📝@🌳  📖15.10.2023✍️

Amulya (Telugu 12.10.2024)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము మనస్తత్వశాస్త్ర మాధ్యమా  విద్యార్థినిగా వినమ్రతతో  పరిచయమై, పరమార్థికమైన రామకృష్ణ "పరమహంస" రమణాదుల పరజ్ఞాన పరిభ్రమణలో  సూక్ష్మ సారూప్య సంబంధం  కలిగిన కాంతా అమూల్య, అమూల్యమైన  అభిజ్ఞాశక్తి అన్వేషణలో  సంకల్పంతో సంతోషంగా సోదరి సదా సాగాలని  ప్రార్ధిస్తూ.. పుట్టినరోజు పండుగ  శోభప్రద శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖12.10.2024✍️  

Ratan Tata (Telugu 10.10.2024)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము రతన్ టాటా.. పారిశ్రామిక ప్రస్థానంలో  ఉప్పు ఉక్కు  వినోదం విద్యా  వసతి విమానం  ఆహారం ఆహ్లాదం సరదా సాంకేతికత వ్యాపారాలను విలువలతో  వికసింపజేసి విస్తరింపజేసి కంపెనీలను కొనుగోలుతో విలాసమైనవి విలీనంచేసిన దిగ్గజమైన ధీశాలి,  దాతృత్వ ధీర సంక్షోభ సమయాల్లో  సంక్లిష్ట సందర్భాలలో సంక్షేమానికి సంకల్పించిన టైకూన్ టాటాకు టాటా చెప్పడం చింతగా,   అనిపిస్తుంటుంది.  💭⚖️🙂📝@🌳 📖10.10.2024✍️

Good Morning/ప్రభాత ప్రణామాలు (03.10.2024)

⚛️🪷🌳 ☀️పరివారానికి ప్రభాత ప్రణామాలు🙏 అందరం అన్నింటిలోని ఆనందాన్ని ఆస్వాదిద్దాం 💭⚖️🙂📝@🌳 📖03.10.2024✍️ 📖21.10.2024✍️ Warm Morning Wishes World  🌍 ప్రపంచానికి ప్రభాత ప్రణామాలు🙏 💭⚖️🙂📝@🌳 📖21.10.2024✍️ Morning Warm Wishes Mutuals  ☀️పరస్పరులకు ప్రభాత ప్రణామాలు🙏 💭⚖️🙂📝@🌳 📖01.11.2024✍️

Shashikant Birthday (Telugu 02.10.2024)

Image
⚛️🪷🌳  కళాశాల తొలి రోజే   పరిచయమైన ప్రియ  సహచరునిగా,  దీర్ఘ దృష్టితో ఆశయంగా క్షణికమైన వాటిని వదులుకొని మన కళాశాల పరిధిలో అత్యంత క్రమశిక్షణ కలిగిన కుర్రాడిగా శశికాంత్ నువ్వు సదా జ్ఞాపకం ఉంటావు... 💭⚖️🙂📝@🌳 📖 02.10.2024 ✍️