MS. Swaminathan

🌲✍️:🌈⚛️😊

బెంగాల్ క్షామం తర్వాత 
భారత క్షేమం తను
కోరుకుని, కలగన్న
వైద్య విద్యను, విశేష (పోలీస్) వృత్తిని 
వద్దనుకుని వ్యవసాయ వృద్ధికి వారధిగా 
మారి, మన వాతావరణానికి 
సరిపోయే వంగడాలను సృష్టించి, 
దిగుమతి దశ నుండి ఎగుమతి దిశగా ఎదిగి
రైతులకు రాబడులు రప్పించి
వ్యవసాయంలో హరిత విప్లవానికి పితామహుడైన 
మాన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ గారి 
నిర్యాణం నాడు నివాళులర్పిస్తున్నాను 

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity 



"నన్ను దేశమంతా హరిత విప్లవ పితామహుడిగా కీర్తిస్తున్నారు. కానీ ఆ ఘనత నాది కాదు. నేను ముగ్గురు మంచి అమ్మాయిలకు తండ్రిని మాత్రమే!" అని స్వామినాథన్ అనేవారు. మరియు హరిత విప్లవంతో పెరిగిన రసాయనాలు, ఎరువులతో భూసారం తగ్గించిందనే విమర్శలను తను అంగీకరించి, హరిత విప్లవం కంటే సతతహరిత (Evergreen) విప్లవం కావాలి" కోరుకున్నారు.  

అప్పటి సమస్యలకు హరిత విప్లవం పరిష్కారం, రాబోయే సమస్యలకు సతతహరిత విప్లవం శాశ్వత పరిష్కారం.

💭⚖️🙂📝@🌳

---------------
©️: Eenadu.net 

డాక్టర్ మాన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ కావాలనుకుంటే ఆయన తన కుటుంబంలో అందరిలా డాక్టరయ్యేవారు. కానీ తెల్లకోటును త్యజించేశారు. అనుకుంటే ఆయన ఐపీఎస్ అధికారిగా దేశంలో ఉన్నతస్థానంలో ఉండేవారు. వచ్చిన ఆ ఖాకీ సీటునూ కాదనుకున్నారు. సంపాదించాలనుకుంటే కేంబ్రిడ్జిలో ప్రొఫెసర్గా, శాస్త్రవేత్తగా ఉండిపోయేవారు. విదేశీ మోజును వదిలేసుకున్నారు. కారణం.. మాతృభూమి రుణం తీర్చుకోవాలని.

 అందరికీ మూడుపూటలా తిండిపెడుతున్న రైతుల కడుపునింపాలని.. ఈ జీవగడ్డలో సిరులు పండాలని.. ఈరోజు మనదేశంలో ఆహార భద్రత ఉందంటే, ఎన్నో దేశాలకు భారత్ తిండిపెడుతోందంటే ఆ మహానుభావుడి చలమే ఆయనే భారత హరిత విప్లవ పితామహుడు, ఎం.ఎస్. స్వామినాథన్ పిలుచుకునే డాక్టర్ మాన్ కొంబు సాంబశివన్ స్వామినాథన్.

మార్కులు బాగున్నాయి.. ఈ కోర్సు ఎందుకు?

తనకు 15 ఏళ్లు నిండకుండానే తండ్రి చనిపోవటంతో వైద్య వృత్తిని, ఆసుపత్రి నిర్వహణను కొనసాగించాల్సిన బాధ్యత స్వామినాథన్ దేనని కుటుంబం తీర్మానించింది. దానికి తగ్గట్లే ఆయన చదువు మొదలైంది. ఇంతలో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. గాంధీజీ పిలుపు ఆయన్నూ ప్రభావితం చేసింది. విద్యార్థిగా బెంగాల్ దారుణ క్షామాన్ని చూసిన స్వామినాథన్, ఆకలితో ఎవ్వరూ చనిపోయే పరిస్థితి ఉండకూడదని తపించారు. వైద్యవృత్తి చేపట్టబోనని కుటుంబానికి స్పష్టం చేసి వ్యవసాయ విద్యలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని మద్రాసు అగ్రికల్చర్ కాలేజీలో సీటుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిన్సిపాల్ పిలిచి 'మంచి మార్కులు వచ్చాయి. అనవసరంగా ఈ కోర్సులో ఎందుకు చేరాలనుకుంటున్నావు?' అని అడిగారు. ఆ సమయంలో అగ్రికల్చర్ కోర్సు చదవటమనేది నామోషీగా భావించేవారు. ఆ భావన తొలగించేందుకే చేరుతున్నానంటూ బదులు చెప్పారట. స్వామినాథన్!

ఈ చదువు నా దేశం కోసం: 
1944లో మొదలైన స్వామినాథన్ వ్యవసాయ విద్య ప్రస్థానం- జెనెటిక్స్ కి, పంటలు, దిగుబడుల మెరుగుదల వైపు సాగింది. చీడపీడలను తట్టుకొని ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలను తయారు చేస్తే రైతులకే కాకుండా యావత్ మానవాళికి మేలు జరుగుతుందనే తపనతో ఆయన అడుగులు వేస్తూ వెళ్లారు. పీజీ పూర్తయ్యాక యూపీఎస్సీ పరీక్షలో ఐపీఎస్ కు ఎంపికయ్యారాయన! అంతలోనే ఫెలోషిప్పై హాలండ్లో వ్యవసాయ విద్యలో ఉన్నత చదువుకు అవకాశం వచ్చింది. ఐపీఎస్ ను వదులుకొని ఐరోపాలో చదువుకు పయనమయ్యారు. బంగాళాదుంప జన్యు పరిణామంపై పరిశోధన చేశారు. తర్వాత అమెరికాకు వెళ్లి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ చేశారు. స్వామినాథన్ ఉత్సాహం, ప్రతిభను చూసిన విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ అక్కడే మంచి జీతంపై అధ్యాపక పోస్టు ఆఫర్ చేశారు. స్వామినాథన్ సున్నితంగా తిరస్కరించారు. 'నేనిక్కడికి నేర్చుకోవటం కోసమే వచ్చా. తిరిగి వెళ్లి నా దేశానికి సేవ చేయాల్సి ఉంది' అని చెప్పటంతో విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు సంతోషంతో భుజంతట్టి పంపించారు. భారత్కు వచ్చిన ఆయన 1954లో కటక్ లోని 'కేంద్ర వరి పరిశోధన సంస్థ'లో చేరి, తర్వాత భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థకు మారారు. వివిధ హోదాల్లో పనిచేస్తూ భారత వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించేందుకు నడుం బిగించారు.

అమెరికా నుంచి గోధుమలు: 
ఆంగ్లేయులు మన వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి వెళ్లారు. స్వాతంత్ర్య సమయానికి దేశంలో ఏటా 60 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే పండేవి. చేవలేనివారిగా భారత రైతులపై ముద్రవేశారు. విదేశాల నుంచి సరకు వస్తేగానీ పొట్టగడవని పరిస్థితి అమెరికా నుంచి గోధుమలను భారీగా దిగుమతి చేసుకునేవాళ్లం. 1960ల ఆరంభంలోనూ దేశంలో గోధుమల ఉత్పత్తి కోటి టన్నులు మాత్రమే. వరి దిగుబడి మరింత తక్కువ. 1966లో కరవు కారణంగా కోటి టన్నుల గోధుమల్ని అమెరికా నుంచి తెప్పించుకున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనంత చక్కని వాతావరణ పరిస్థితులు, జీవనదులతో కూడిన సారవంతమైన నేలలు, కష్టపడే మానవ వనరులు ఉండికూడా తక్కువ దిగుబడులతో డస్సిపోయిన భారత వ్యవసాయ రంగం ముఖచిత్రాన్ని మార్చాలని స్వామినాథన్ నడుం బిగించారు. ఇదే భూమిలో, సరైన నీటి నిర్వహణతో అధిక దిగుబడులనిచ్చే వంగడాల తయారీతోనే పరిస్థితిలో మార్పు తేవచ్చని భావించి ఆ దిశగా అడుగులు వేశారు. హరిత విప్లవానికి అలా బీజం పడింది. అధిక దిగుబడినిచ్చే వంగడాల తయారీ, ట్రాక్టర్లలాంటి ఆధునిక పరికరాల వాడకం, సాగునీటి సదుపాయాలు మెరుగుపర్చటం, ఎరువులు, పురుగుమందుల వాడకం, సాగు విస్తీర్ణం పెంచటం ఈ హరిత విప్లవంలో ప్రధానాంశాలు. 1967-68 నుంచి 1977-78 మధ్య పరిస్థితిలో భారీ మార్పు మొదలైంది. భారత సంప్రదాయ వంగడాలు ఏపుగా, సన్నగా పెరిగి గాలికి వాలిపోయేవి. కాస్త తక్కువ ఎత్తుతో దృఢంగా నిలిచి ఎక్కువ దిగుబడి నిచ్చే వరి వంగడాలపై స్వామినాథన్ బృందం చేసిన పరిశోధనలు కొంతమేరకు సత్ఫలితాలనిచ్చాయి. రెట్టించిన ఉత్సాహంతో గోధుమలపై దృష్టి సారించారు.

దిగుమతి నుంచి ఎగుమతుల దశకు:
వరి, గోధుమ తదితర పంటలపై స్వామినాథన్ జరిపిన విశేష కృషితో దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. దిగుమతి చేసుకునే పరిస్థితి మారి ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. భారతావని పండించే బియ్యంపై సగం ప్రపంచం ఆధారపడి ఉందంటే హరిత విప్లవం తెచ్చిన మార్పును అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన వరి రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి వాటినుంచి కొత్త రకాలను ఉత్పత్తి చేశారు. స్వామినాథన్ పరిశోధనల ఫలితంగా 1960ల నాటి కరవు పరిస్థితులను దేశం ఎదుర్కోగలిగింది. ఆకలి లేని భారతదేశమే నా కల అంటూ 1988లో ఆయన తన పేరుతో 'ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్'ను స్థాపించి ఛైర్మన్ గా వ్యవహరించారు. మొదటి 'ప్రపంచ ఆహార బహుమతి' కింద లభించిన 2 లక్షల డాలర్లను ఈ ఫౌండేషన్కు ఖర్చుపెట్టారు.

నార్మన్ బోర్లాగ్ ప్రశంసలు:
అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడాల కోసం శోధన మొదలైంది. ఈ క్రమంలో స్వామినాథను అమెరికన్ వ్యవసాయ శాస్త్రవేత్త ఒక్వలె వోగెల్ పరిచయమయ్యారు. ఆయన అప్పటికే ఓ మరుగుజ్జు గోధుమ వంగడాన్ని అభివృద్ధి చేశారు. కానీ తన వంగడం భారత వాతావరణ పరిస్థితుల్లో పనిచేయకపోవచ్చని అంటూ నార్మన్ బోర్లాగ్ను సంప్రదించాలని స్వామినాథన్కు సలహా ఇచ్చారు. ఆయన అప్పటికే మెక్సికోలో ఇలాంటి గోధుమ వంగడాలనే రూపొందించారు. అవి భారత వాతావరణానికి కూడా సరిపోయేలా ఉండటంతో బోర్లాగ్ను స్వామినాథన్ కలిసి పరిస్థితి వివరించారు. బోర్లాగ్ తాము తయారు చేసిన వంగడాలను ఇవ్వటమే కాకుండా బారత్కు పచ్చేందుకు అంగీకరించారు. అలా 1963లో నార్మన్ బోర్లాగ్ (ఈయనకు 1970లో నోబెల్ బహుమతి లభించింది) తయారుచేసిన పొట్టి గోధుమ వంగడాలను భారత్లో తయారు చేయటం మొదలు పెట్టారు. ఆ పరిశోధన ప్రయత్నాలు ఫలించి హెక్టారుకు నాలుగున్నర టన్నుల దిగుబడి వచ్చింది. దేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ జరిగింది. 1960కి ముందు హెక్టారుకు 2 టన్నులున్న వరి దిగుబడి రెట్టింపయ్యింది. హరిత విప్లవ పితామహుడిగా స్వామినాథన్ పేరు మారుమోగింది. బోర్లాగ్ సైతం స్వామినాథను కొనియాడటం గమనార్హం. "ఘనత అంతా స్వామినాథన్కే చెందుతుంది. మెక్సికో కోసం తయారు చేసిన ఈ వంగడాల విలువను ఆయన గుర్తించకుంటే, వాటి కోసం తపించకుంటే ఆసియాలో హరిత విప్లవమే వచ్చి ఉండేది కాదు" అని బోర్లాగ్ ప్రశంసించారు. తర్వాత స్వామినాథన్ సారధ్యంలో భారతీయ శాస్త్రవేత్తలు మరిన్ని మేలైన వంగడాలను సృష్టించారు.

హరితం కాదు సతత హరితం:
హరిత విప్లవం కారణంగా రసాయనాలు, ఎరువుల వాడకం పెరిగి భూసారం తగ్గిందనే విమర్శలనూ అంగీకరించటం స్వామినాథన్ వినమ్రతకు నిదర్శనం. "స్థానికంగా ఉండే వంగడాలను కోల్పోవచ్చు. భూసారాన్ని కాపాడుకోకుండా, నీటి యాజమాన్య పద్ధతులు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవసాయం చేస్తే ఎడారులను సృష్టించినవారమవుతాం. హరిత విప్లవంకంటే సతతహరిత (ఎవర్స్) విప్లవం కావాలి" అని ఆయన కోరుకున్నారు.

రైతులకు మద్దతు:
వంగడాల సృష్టితోనే స్వామినాథన్ ఆగిపోలేదు. భారత వ్యవసాయ రంగం అభివృద్ధికి, రైతుల జీవితాలు మెరుగవటానికి సామాజిక శాస్త్రవేత్తగా కూడా ఆలోచించారు. వాళ్వేయీ ప్రభుత్వ హయాంలో ఆయన సారథ్యంలో జాతీయ కమిషన్ ఏర్పాటైంది. దేశంలో రైతుల పరిస్థితి మెరుగుకు, వ్యవసాయం బాగుకు ఆయన ఎన్నో సూచనలు చేశారు. ఉత్పత్తి వ్యయంపై 150 శాతం రైతుకు దక్కేలా ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించాలనేది వీటిలో ప్రధానమైంది. దేశంలో రైతుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తమ కమిటీ సిఫార్సులే తగినవని చివరిశ్వాస వరకు ఆయన ఉద్ఘాటించారు. "ప్రస్తుత వ్యవసాయరంగానికి ప్రధానంగా రెండు సమస్యలున్నాయి. ఒకటి రుతుపవనాలు, రెండు మార్కెట్లు, ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర చాలా తక్కువ.. వ్యవసాయం అనేది ఉద్యోగ ఆధారిత అభివృద్ధి రంగం, పరిశ్రమలు- ఉద్యోగాలు తగ్గే రంగం. వ్యవసాయాన్ని ఆడుకోవాల్సిన, ఆధునికీకరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పెట్టుబడి వ్యయం కంటే ఎక్కువ మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. రుణాలు మాఫీచేస్తే సరిపోదు" అని నినదించిన సామాజిక విప్లవకర్త స్వామినాథన్:
----------
అంతా నన్ను భారత హరిత విప్లవ పితామహుడిగా కీర్తిస్తున్నారు. కానీ ఆ ఘనత నాది కాదు. నేను ముగ్గురు మంచి అమ్మాయిలకు తండ్రిని మాత్రమే! - స్వామినాథన్

గాంధీజీ స్వావలంబన, స్వదేశీ సిద్ధాంతాల ప్రభావం నాపై గాఢంగా ఉంది. నా పరిశోధనలకు అవే మూలస్తంభాలు. గాంధీజీ సిద్ధాంతాలు ఎప్పటికీ ఎవ్వరికైనా అవసరమే. ముఖ్యంగా మనలాంటి యువతరమున్న దేశానికి చాలా అవసరం.
- స్వామినాథన్

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao