Gayatri Mantram

🌈📧📜
"గాయత్రి మంత్రం"
"ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్"

"గాయత్రి మంత్ర భాష్యం"
గాయత్రి అనే పదము 'గయ', 'త్రాయతి' అను రెండు పదములతో కూడుకుని ఉంది. 'గయ' అనగా ప్రాణము అని అర్థము 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించేది గాయత్రీ.
"గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తన భాష్యములో వివరించారు.

మననాత్ త్రాయతే ఇతి మంత్ర, అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేదాన్ని మంత్రం అని అంటారు.
సూక్ష్మంగా చెప్పాలంటే మననం చేయడం వల్ల ప్రాణాలు రక్షించేదాన్ని గాయత్రీ మంత్రం అంటారు.

"ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్"

ఓం- ప్రణవం (స్వచ్ఛమైన స్పష్టమైన)
భూః = భూమి (భౌతిక).
భువః = అంతరిక్షం(మానసిక).
స్వః = స్వర్గం (దృగ్విషయ).
తత్ = సత్యం (తత్వం)
సవిత: = సూర్యుడు (తేజస్సు)
వరేణ్యం = పూజించదగినది (ఆరాధింపబడునది)
భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
దేవస్యః = దివ్యగుణములు కలిగిన దివ్యస్వరూపము.
ధీమహి - ధ్యానిస్తూ (ఏకమైతూ)
ధియో - బుద్ధి (ఆలోచనలను);
యోనః - మిమ్మల్ని
ప్రచోదయాత్ = ప్రేరేపించు గాగ

ప్రణవ (స్వచ్ఛమైన స్పష్టమైన) ఆధార స్వరూపమైన మూడు లోకాల (అవని (భౌతిక) అంతరిక్షం (మానసిక) మరియు స్వర్గం (దృగ్విషయ)) పూజనీయమైన తేజస్సు మన బుద్ధిని తత్వం యందు ప్రేరేపిస్తుండగా ఆ దివ్య మంగళ తేజస్సును ధ్యానిస్తూ ఉన్నాను.

"సర్వలోకాలను సత్యం వైపు నడిపించే దైవం మన బుద్ధిని తత్వబోధ యందు ప్రేరేపిస్తుండగా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానించున్నాను.

గాయత్రి మంత్రం లోని ప్రాణ పదాలు "విద్మహే ధీమహి, ప్రచోదయాత్." విద్మహే అర్థం తెలిసికొనుచున్నాము. ధీమహి అర్థం ధ్యానించుచున్నాము ప్రచోదయాత్ అర్థం ప్రేరేపించునుగాక.

వీటితోనే అనేక (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, శక్తి, వినాయక.....) గాయత్రీ మంత్రాలు ఉద్భవించాయి. వీటి ప్రమాణం చతుర్వింశతి (24) అక్షరాలు, వాటితో ఆ స్వభావాలు తెలుసుకుని/తెలిపి, ధ్యానం చేసి, ప్రేరేపితం అవ్వడం.

ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించే జీవన గాయత్రిలో ప్రణవాన్ని తెలుసుకుంటూ విశదాన్ని ధ్యానించుచు, అస్తిత్వాన్ని ప్రేరేపించాలి అనుకుంటున్నాను‌.

"ప్రణవాయ విద్మహే విశదాయ ధీమహి తన్నో అస్తిత్వ ప్రచోదయాత్

సంపూర్ణమైనది స్థిరమైనది ప్రశాంత ప్రమోదం ఓంకారాన్ని (ప్రణవాన్ని) తెలుసుకుంటూ, స్వచ్ఛమైన స్పష్టమైన విశద వివరణను ధ్యానించుచు, సహజమైన స్వతంత్రమైన వాస్తవికత (అస్తిత్వం) ప్రేరేపితమవ్వాలని మననం చేసుకుంటున్నాను.


సర్వేజనా సుఖినోభవంతు
సమస్త లోకా సుఖినోభవంతు
ఓం శాంతి శాంతి శాంతిః
 
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం
 


Reference:

Gayatrimantra (Wikipedia)


Comments

  1. చాలా చక్కటి వివరణ..

    🙏

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao