Asia Cup Win (Telugu 28.09.2025 (GMT))

 ⚛️🪷🌳

దాయాది దేశాల
ఆటలో అటుఇటుగా 
సాగిన సమరంలో
ఉత్కంఠ ఉచ్ఛస్థాయిలో
ఆటలో అద్భుతంగా ఆడి
ప్రత్యర్థి పాకిస్తాన్ పై
పోరాట పటిమతో
వికెట్లు తీసిన వరుణ్ 
చక్రవర్తి, చక్కగా 
కులదీప్, అక్షర్ &
బూమ్రా, బ్యాటింగులో
నిలకడగా నిలబడి
పరుగులు పారించిన
తెలుగు తేజం తిలక్ 
వర్మ, వరమై
బలంగా భాగస్వామ్యాలను
సంజు శివంతో
కలుపుతూ కడదాకా
ఆడి, ఆటగాడికి &
అన్ని ఆసియాకప్పు 
ఆటలలో అద్భుతంగా
నిలకడగా నిలిచి
వేగంగా విలువైన 
పరుగులు పారించిన 
అభిషేక్ కు అభినందనలు

ఓకే ఖండంలోని 
బహుళ జట్లపై 
జయాల జైత్రయాత్రతో 
అద్వితీయంగా అజేయంగా 
ఆసియాకప్పు అందుకున్న 
భారతదేశానికి భవ్యంగా
శోభమైన శుభాకాంక్షలు.

💭⚖️🙂📝@🌳
📖 28.09.2025 ✍️ (GMT)



Comments

  1. చాలా బాగుంది మీ కవిత.💕🎉

    అందరూ తిలక్ వర్మా? అని సంశయించారు.
    అవును, తిలక్ వరమే.. అని నిరూపించాడు.
    ఆపరేషన్ సిందూర్ ను హేళన చేసిన పాకీలకు
    ఈ తెలుగు తిలకమే సమాధానంగా నిలిచాడు.

    ReplyDelete

Post a Comment

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)