Posts

Showing posts from September, 2025

Translation Day (అనువాద దినోత్సవం) (Telugu 30.09.2025)

Image
 ⚛️🪷🌳 భావం ఒక భాషలో పుట్టి, పదాల  పల్లకిలో ప్రయాణించి వాక్యమనే వేదిక ఎక్కి ఎగురుతూ పులకించే పరమార్థం భావం బహుముఖంగా  నిలబడుటకు నిచ్చెనయ్యే  సంకల్ప సాధనం  అనువాదం.  అనువాదం — అర్థానికి అర్ధాంగి భాష భేదాలను మనం మరుచుటకై,  అంతరంగాన అనువాదకులు మేధోమదనంతో మలిచి మురిపెంగా ముందుకు  తీసుకువచ్చే తత్వం  అనువాదం మాతృ భాషలో పుట్టిన పరమార్ధం, మరొక భాషను పరిమళింపజేసే  మహోన్నత మాధ్యమం  అనువాదం అనువాదం అనునది  పదాల పునఃకల్పన కాదు,   పదానికి పునర్జన్మ।   సంప్రదాయాల మధ్య సంభాషణ   సంస్కృతుల మధ్య సేతువు అనువాదం అంటే అనువాదంలో అర్థం  మారదు, రూపం మారుతుంది,   పలుకులు మారతాయి,  భావం నిలుస్తుంది. అనువాదం   వున్న విషయాల మార్పిడి మాత్రమే కాదు,   మనల్ని మరొకరితో  కృతజ్ఞతగా కలిపి   సంతృప్తినిచ్చే సాధనం మాట్లాడే భాష  మాత్రమే మారుస్తుంది   అని అనుకోగానే ఆస్కారం లేదు అంతకుమించి అందరిని  పులకరింపజేసే పరమార్థం  విభిన్న విశేష విషయాల మూలలతో మమేకమై  అంతర్లీన...

Asia Cup Win (Telugu 28.09.2025 (GMT))

Image
 ⚛️🪷🌳 దాయాది ద్వయ దేశాలు సాగించిన సమరంలో ఉత్కంఠ ఉన్న ఆటలో అద్భుతంగా ఆడి ప్రత్యర్థి పాకిస్తాన్ పై పోరాట పటిమతో వికెట్లు తీసిన వరుణ్  చక్రవర్తి, చక్కగా  కులదీప్, అక్షర్ & బూమ్రా, బ్యాటింగులో నిలకడగా నిలబడి పరుగులు పారించిన తెలుగు తేజం తిలక్  వర్మ వరమై బలమైన భాగస్వామ్యాలను సంజు శివంతో కలుపుతూ కడదాకా ఆడిన ఆటగాడికి & అన్ని ఆసియాకప్పు  ఆటలలో అద్భుతంగా నిలకడగా నిలిచి వేగంగా విలువైన  పరుగులు పారించిన  అభిషేక్ కు అభినందనలు ఒకే ఖండంలోని  బహుళ జట్లపై  జయాల జైత్రయాత్రతో  అద్వితీయంగా అజేయంగా  ఆసియాకప్పు అందుకున్న  భారతదేశానికి భవ్యంగా శోభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖 28.09.2025 ✍️ (GMT)

Priya Akka Birthday (Telugu 13.09.2025)

Image
⚛️🪷🌳  సుబ్బారావు పెద్దనాన్న  సుందరి పెద్దమ్మల పెద్ద పుత్రికగా భాద్రపద బహుళ  నవమి నాడు  నెల్లూరు నేపథ్యంగా పుట్టి పెరిగి నాగప్రియదర్శిని నామంతో  ఆరుద్రనికి అక్కగా  ఆమంచర్ల ఆడపడుచుగా మలిగి, ముంగమూరి కోడలిగా కదిలి  శాండిల్య శకంలో కుదురుకొని కష్టార్జితంతో విప్రో వ్రుత్తిలో చక్కగా చేసి ఆక్సెంచరుకు మారి అమెరికాకు మాకం  మార్చి, మెరుగై స్వదేశానికి సాగి బెంగళూరులో బావతో కైరాతో కుతూహలంగా పరవశిస్తున్న ప్రియక్కకు  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖 13.09.2025 ✍️