Posts

Showing posts from July, 2025

Candid Click (Telugu 27.07.2025)

Image
⚛️🪷🌳 ఇలా ఇంత  అందగాడిగా అవుతానని  అసలు అనుకోలేదు,  కానీ కెమెరా  మాయ ముందు  నన్ను నేను  ఇలా ఇంతసేపు  చిత్రంలో చూసుకోలేదు… వాస్తవంగా వున్న  రూపాన్ని రూపాంతరం  చేసి చక్కని చిత్రంగా  చూపించిన చిత్తరువు చూస్తూ చిద్విలాసంగా  ప్రపంచానికి పంచుకుంటున్నాను. 💭⚖️😊📝@🌳 📖27.07.2025✍️ 📷08.06.2025📅

Poem on Past Memories (Telugu 22.07.2025)

⚛️🪷🌳  గడచిన గత క్షణాల కాలం మధురంగా మురిపించాయి,   అవి మళ్లీ మన ముందుకు  తిరిగి రావని తెలిసిన,  జ్ఞాపకాలు జ్ఞప్తికి  వచ్చినప్పుడు వచ్చే  భావనలు భలే ఊతంగా ఉంటాయి. ప్రస్తుతంలో వారు ప్రత్యక్షంగా  కనిపించినప్పుడు కలిగే భావనలు భవ్యంగా మనసుని మురిపెంగా  చల్లబరిచే చినుకులై   తడిపి తాదాత్మ్యం  చేసి చిద్విలాసాన్ని కమ్మగా కలిగిస్తాయి. 💭⚖️🙂📝@🌳 📖22.07.2025✍️ ------ మన జీవితంలో గడిచిన మధుర క్షణాలు మళ్ళీ తిరిగి రాకపోవచ్చు కానీ వాటికి సంబంధించిన జ్ఞాపకాలు ఎప్పటికీ మధురంగా మన హృదయంలో పదిలంగా ఉంటాయి.  గత స్మృతులు భావోద్వేగాలను కేవలం నియంత్రించగలవు. కానీ ఆ భావోద్వేగాలకు సంబంధిత వ్యక్తులను ప్రస్తుతంలో కలవడం వల్ల మనసు సంతృప్తి పడుతుంది. ఆ ఆనందమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ శక్తి పొందాలని భావిస్తూన్నాను. 💭⚖️🙂📝@🌳 📖 22.07.2022 ✍️

2) World Listening Day (Telugu 18.07.2025)

Image
⚛️🪷🌳 వ్యక్తులు వినడం వలన వ్యక్తులు  విషయాలను  వ్యక్తపరుస్తారు  వినే వారు  వుండడం  వ్యక్తికి వరం. వినే వారు వుండడం వల్ల  వ్యక్తి వర్చస్సు వికాసంతో వృద్ధిలో  వుంటుంది.  వాయిద్యకారుల  వినసొంపైన వాద్యంవినడం  విశ్రాంతికి  విశేష విధానం. ప్రపంచ వినే దినోత్సవ శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖18.07.2025✍️

Kota Srinivasa Rao (Telugu 13.07.2025)

Image
⚛️🪷🌳 సమన్యాయంతో సినిమాలలో  వైవిద్యమైన విలక్షణ  పాత్రలలో పరకాయ ప్రవేశమై పాత్రలకు ప్రాణం పోసి పాత్రకు పాత్రకు పోలిక  లేకుండా, లక్షణమైన తపించే తండ్రిగా, నేపథ్య నటుడిగా, ప్రతినాయకుడి పాత్రలలో నమ్మసక్యం కానీ నటనతో  నటనకు నిఘంటువుగా  ఉన్న ఉన్నతమైన  కోటా శ్రీనివాసరావు గారు కన్నుమూసిన కారణంగా  అంజలి అర్పిస్తున్నాను మృత్యోర్మ అమృతం గమయ  ఓం శాంతిః శాంతిః శాంతిః  💭⚖️🫡📝@🌳 📖13.07.2025✍️

Lesson from Kohli (Telugu 11.07.2025)

Image
⚛️🪷🌳 విరాట్ కోహ్లీ విషయాలలోని వాస్తవికత, విజ్ఞానం, వినయం క్రికెట్టుకు మించి విశేషంగా ఉంది. దానిలోని సారాన్ని అర్థం చేసుకుని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నాను. గెలుపు ఓటములు సహజం. ఒకరు గెలిస్తే, మరొకరు ఓడిపోతారు. కానీ, మనం చేసే పనిని నమ్మకంగా, నిజాయితీగా చేస్తే, ఫలితం ఎలా ఉన్నా సంతృప్తి ఉంటుంది.  బాగా కష్టపడతాం, తర్వాత జరగవలసినవి జరుగుతాయి, కష్టపడి ప్రయత్నించడమే మన చేతుల్లో ఉంటుంది, ఫలితం మన చేతుల్లో లేదు‌.  మనం ప్రతి సారి ఉత్తమ ప్రదర్శన చెయ్యడం సాధ్యం కాదు, దానికి అర్హులం కూడా కాదు, ఎందుకంటే ఎదుటివారికి బాగా రాణించాలనే ఆకాంక్ష ఉంటుంది, వారు చాలా కష్టపడతారు, వారికి కుటుంబం ఉంటుంది, వారికి స్నేహితులు ఉంటారు, వారు బాగా రాణించాలని ఇష్టపడే వ్యక్తులు ఉంటారు. వారు మనతో ఈ వేదికను పంచుకున్నారు, మనకు గెలవాలన్న ఆకాంక్ష ఎంత ఉంటుందో, వారికి కూడా అంతే ఆకాంక్ష ఉంటుంది. ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం సాధ్యం కాదు, ఒడుదుడుకులు ఉంటాయి, వారి స్థానం కంటే మన స్థానం గొప్పదనే విషయానికి ఎటువంటి హామీ లేదు. నిజానికి దానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు, ఎందుకంటే ఎంత అనుభవం ఉన్న ఆ రోజు మన మ...

Both Bharghav's Bhargava G (Telugu 06.07.2025)

Image
⚛️🪷🌳 భిన్నమైన భార్గవులం భిన్న ధ్రువాలమైన భవ ధోరణిలో  వున్న వాళ్లం కలిసి కూర్చుని  మరి మాట్లాడుకున్నాం, ఉపన్యాసంలో ఉన్న  సిద్ధాంతాలపై సంభాషణలు జరుపుకొని, జ్ఞాపకంగా తరువాత తీసుకున్న   చక్కని చిత్రం.  💭⚖️🙂📝@🌳 📖06.07.2025✍️ వ్యక్తి (Being) గురించి రాయడానికి అనుభవాలు చాలు. అనుకున్నవి చాలు.  అవ్వాలి అనుకున్నదాని (Becoming) గురించి రాయడానికి మాత్రం, నిన్ను నీవు సౌకర్య పరిధి లోంచీ తోసేసుకుని తాత్విక అగ్నిగుండం లోకి దూకవలసి వుంటుంది. ------------ అనుభూతిని ఆలోచనకు వ్యతిరేకంగా.. అనుభవాన్ని సిద్ధాంత స్పష్టతకు వ్యతిరేకంగా.. కల్పనా శక్తిని హేతుబుద్ధికి వ్యతిరేకంగా... నిలబెట్టడం నిష్ఫల క్రియ. ఒక తాత్విక బాల్య చేష్ట. -------- తెలివైన సేనాధిపతులు యుద్ధాన్ని (War) గెలవడం కోసం  చిన్న చిన్న పోరాటాల్లో (battles) ఓడిపోతారు. దేశమంతా హిందీ భాషే ఉండాలనే అమిత్ షా వ్యాఖ్యలను ఈ కోణంలోంచే చూడాలి. ఈ battle లో ఓడిపోతామని BJP కి తెలుసు.  కానీ హిందీ ప్రాంతంలో జరిగే కీలక యుద్ధంలో గెలవడం వారి అసలు లక్ష్యం. -------- మేడే అన్నది అంతర్జాతీయ కార్మిక హక్కుల పోరాట దినం. దేశద...

Doctor's Day (Telugu 01.07.2025)

Image
⚛️🪷🌳 వ్యాధి వేదనల వలలో వున్నప్పుడు వారితో  వెళ్లఋచ్చే వివరాలను  వారు వారి విశదమైన  విజ్ఞానంతో, వివిధ  వైద్య వస్తువులుతో విశ్లేషించి వెన్నుదన్నుగా  వ్యాధినిరోధకానికై వెల్లడించే వ్యాఖ్యాలు  వేదమై వుంటాయి. వ్యాధి వేదనల వేళ  వెలుగునిచ్చే వీరులు వైద్య వృత్తి వారు.  సంకట స్థితి  వచ్చే వరకు వారి వద్దకు వెళ్లకున్న  విపత్కర వేళ వెళ్ళిన వ్యాధిని నిరోధించి నిలువరించే  వైద్యులకు వందనాలు వైద్యం వ్యాపారమైన వాణిజ్యం విలువైనదైన లాభం, లాలన  వాత్సల్యం వున్న  వైద్యం వృత్తి వృద్ధిగా వెలుగుతూనే వుంది.  వైద్య వృత్తిలో వుండే వైద్యులకు వైద్య దినోత్సవ శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖01.07.2025✍️