Posts

Showing posts from May, 2025

Vivekananda Kendra PKPS (Telugu 29.05.2025)

Image
⚛️🪷🌳 భక్తితో బొమ్మలను  ఘనంగా గీసిన  చిత్రకారిణికి చిద్విలాసంతో  ఆదర అభినందనలు    💭⚖️🙂📝@🌳 📖29.05.2025✍️ ------- Standing people:   Surabhi didi, Bhagyalakshmi aunty ji, Amaresh ji, Arun ji,  Hari prakash ji, Srinivas ji,  Mukesh ji, Radhakrishna ji,  Bhargav ji,  Ravi ji. Sitting people: Rishita akka, Uma akka, Matru shree akka, Hindu akka, Snehalata akka, Sahil, Anish, Nithin. ------- కేంద్ర కార్యక్రమాలలో ఆత్మీయతతో అమ్మలు  అందించిన ఆహారం  అన్నిరోజులు ఆరగిస్తూ  అందిన ఆనందంతో  కృతజ్ఞతగా కుతూహలంతో  తీసుకున్న తాదాత్మ్య  చక్కని చిత్రం 💭⚖️🙂📝@🌳 📖29.05.2025✍️ -------- ఉన్నత ఉద్యోగులుగా ఉంటూ/ఉండి  విరామం తీసుకుని/విశ్రాంత తనంలో  యశస్సు గడించి మరచి మరి  యోగ గురించి మరింత మీమాంసతో తెలుసుకోవాలనే తాపత్రయంతో  వివేకానంద కేంద్ర కౌశలానికి వచ్చి పిల్లలైన పెద్దవారు  హరి ప్రకాష్ గారు/రాధాకృష్ణ గార్లలో  చక్కని చిత్రం 💭⚖️🙂📝@🌳 📖29.05.2025✍️ ----- సద్వినియోగంగా సమయాన్ని  సార్...

NTR Birthday (Telugu 28.06.2025)

Image
⚛️🪷🌳 నటన తారా రాజు నట తత్త్వ రమణీయత నందమూరి తారక రామారావు తెలుగు తెరకు తేజస్సు  తెచ్చిన తాత్త్వికుడు  తలుపులు తెరిచిన  నిండైన నటనా నిఘంటువు.. అశేష అభిమానుల్ని అందుకుని అలరించిన అలనాటి అభినయం రాజకీయాల్లో రాణించిన  సంక్షేమ స్వాప్నికుడు NTR 💭⚖️🙂📝@🌳 📖 28.05.2025✍️

Rama Narasimhulu Marriage (Telugu 23.05.2025)

Image
⚛️🪷🌳 కళ్యాణం కుదిరిన కుతూహలంతో  పెళ్లి పత్రికతో   ఆహ్వానాన్ని అందించడానికి  వచ్చిన వాడు  నా నేస్తం  రామ నరసింహులుకు  అభినందనలను అందించి  తర్వాత తీసుకున్న చిత్రం‌.  💭⚖️🙂📝@🌳 📖23.05.2025✍️

Vivekananda Kendra Summer Camp (Telugu 22.05.2025)

Image
⚛️🪷🌳 వివేకానందకేంద్ర తరపున  వ్యక్తిత్వవికాస తరగతులకు స్వచ్ఛందంగా సూర్య  నమస్కారాలు నేర్పించడానికి వేసవి శిక్షణ శిబిరానికి వెళ్లి  నేర్పించి నేర్చుకొని  పిల్లలు పంచిన‌  ఆనందంతో ఆహ్లాదంగా  ఇరవై మూడు రోజులు  ఇప్పుడు మిగిల్చిన రమణీయ  జ్ఞాపకాలను జప్తూ జేయగలిగే చక్కని చిత్ర ఇతివృత్తం ఇది.  💭⚖️🙂📝@🌳 📖22.05.2025✍️

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Image
⚛️🪷🌳 విరాట్ వీడ్కోలు వర్ణించడానికి  పదాలు పలకలేకపోతున్నాను కానీ క్రికెట్టుకు మించి, ఓ మంచి మహా మనిషి  ------ శ్వేతవస్త్రంలో శౌర్యంగా  క్రికెట్ క్రీడా క్షేత్రమున పొరాట పటిమతో  నిదానంగా నిలకడగా  పరాక్రమంతో పరుగుల  ప్రవాహం పారించి  మైదానంలో మార్గదర్శిగా  సహచర సభ్యులకు స్ఫూర్తిగా జ్వలించే ఆ జయగర్జనుడు విరాట్ కోహ్లీ వీడ్కోలుకు  భావోద్వేగంతో భావాలను  విచారంతో వ్యక్తపరుస్తున్నాను 💭⚖️🙂📝@🌳 📖12.05.2025✍️

Naresh - Sailaja Marriage (Telugu 11.05.2025)

Image
⚛️🪷🌳 నరేషన్న నీ నీడలో నడిచే  అర్ధాంగి అడుగుపెడుతున్న  సందర్భంలో సంతోషంగా  వివాహ వేడుకకు  హార్దిక హృదయపూర్వక  శోభమైన శుభాకాంక్షలు.. కుదిరిన కళ్యాణంలో కన్యాదానం కుతూహలంగా పొంది  శైలజా శకంతో  శైలిగా నీ జీవితం జాబిల్లి జ్ఞాపకంగా  మారుతుందని మనసులోననుకుంటూ అక్షరాన్ని అందుకుని  మరో మారు పెళ్లి పండుగ  శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖12.05.2025✍️

1) Rajeshwari Pedda Amma (Telugu 10.05.2025)

Image
⚛️🪷🌳 పాతపాటి నుండి పలుకూరికి పెళ్లితో పయనమైన  భర్తకు భరోసాగా,  పుట్టింటికి ప్రాముఖ్యతనిస్తూ పుత్రికలను పరివారాన్ని ప్రవృత్తిని  అద్భుతంగా అనుసంధానం చేసి  కిరణక్క కల్పనక్కలకు  విద్య వికాస విషయాల వంటి వాటిలో శిక్షణ ఇస్తూ, శిక్షకురాలిగా విశేషమైన వృత్తిలో విద్యార్థులకు  ఉతంగా ఉంటూ ఉన్నతంగా  పాఠశాలలో పాఠాలతో  విషయాలను విశేషంగా  నేర్పించి నేపథ్యాన్నందించి ప్రేరేపించిన పెద్దమ్మ  హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖10.05.2025✍️

Ramesh Jyothi (Marriage) (Telugu 08.05.2025)

Image
⚛️🪷🌳 పరిచయ ప్రయాణం  ప్రేమై పరమానందంతో  కళ్యాణాన్ని కుతూహలంగా  స్థిరమైన సరళ సరళిలో  సఫలమైన స్నేహానికి సాక్షిగా  పెళ్లి పీటలపై పెళ్లయిన  వధూవరులను వీక్షించి  దాంపత్య దారిలో ధైర్యంగా అడుగులిడే ఆలుమగలును  అభినందించి ఆశీర్వదించి అనంతరం, ఆంధ్రజ్యోతి  సహఉద్యోగులతో సరదాగా  తీసుకున్న తీపిచిత్రం.  💭⚖️🙂📝@🌳 📖08.05.2025✍️

Operation Sindoor (Telugu 07.05.2025)

Image
⚛️🪷🌳 పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు హరించిన  ఉన్మాద ఉగ్రవాద తీవ్రవాదులు తీరుకు  ప్రతిఘటనగా ప్రభుత్వం  ఆరంభించిన ఆపరేషన్  సింధూర్ ను సాయుధ బలగాలు బాధ్యతాయుతంగా  పాకిస్థాన్ పౌరులు &  సైనిక స్థావరాలపై  కాకుండా కేవలం ఉగ్రస్థావరాలపై ఉక్కుపాదంతో  వ్యవహరిస్తూ వస్తున్న  సైన్యానికి సంపూర్ణ  మద్దతుగా మాట్లాడుతూ  జై జవాన్ అంటూ జేజేలు  పలుకుతున్నాను  💭⚖️🙂📝@🌳 📖07.05.2025✍️

Pandu Gari (VIP) Birthday (Telugu 06.05.2025)

Image
⚛️🪷🌳 ఆగస్టులో ఆంధ్రజ్యోతిలోకి  ప్రవేశించి ప్రవాహంగా  ప్రకటనలను ప్రీతిగా పోటీగా  రమణీయంగా రచిస్తూ  అలకరాని, అలసిపోని  అనువాదాన్ని ఆనందాన్ని అందించే అస్తిత్వం వేముల పాండుగారికి హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పర్వదినాన శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖06.05.2025✍️

Kumarswamy Birthday (Telugu 05.05.2025)

⚛️🪷🌳 జన్మదినాన్ని జరుపుకోకుండా  పుట్టిన పర్వదినాన్ని  సాధారణమైనదిగా భావించే  స్థితప్రజ్ఞ్య భావనతో వయసులో పెద్దవాడైనా పసివాడిగా వికసిస్తూ  బాబాయ్ ని బబ్బిగా  పిలిచే పిల్లవాడు కానీ పిల్లవాడు  యవ్వనంగా కనిపిస్తూ  యుక్తంగా కదిలే  కుమారస్వామి అన్నకు  కుతూహలంతో అక్షరరూపంలో హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు.  💭⚖️🙂📝@🌳 📖05.05.2025✍️