EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము ప్రకృతి, పదార్థం (పసుపు, పిండి), మానవుడు, మృగం (ఏనుగు, ఎలుక) దైత్యుడు దేవత (మూషికసుడు, మహేశ్వరి) ఇలా ప్రతికూల ప్రభావంలో పరమార్ధం గల ప్రతిపదార్ధంతో భవ్యంగా భావ్యంగా బాహ్యంగా ఏర్పడిన భవ భగవంతుడు, ఏకదంతుడు.. భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నంలా చతుర్భుజ ఏకదంతునీ భావిస్తున్నాను. గణాధిపత్యం కోసం గజాననుడు కుమారస్వామితో పాటు పోటీలో తల్లితండ్రులే సమస్తమని సంపూర్ణంగా విశ్వసించి, వారికి ప్రదక్షణ చేసి, భూ ప్రదక్షిణ ఘట్టంలో షణ్ముఖుడి కన్నా ముందు పుణ్యనదీ స్నానం పూర్తి చేసిన వాస్తవ విశ్వాస వ్యాఖ్యాన విగ్రహం వినాయకుడు....... ఉపమానం ఉపమేయ... అలంకారాలలోని అస్తిత్వాన్ని విశేషమైన విశ్వాసంతో అభివ్యక్తీకరించి ఆశాధృక్పథ "యద్భావం తద్భవతి" ఆనే సానుకూల సరళ సిద్ధాంతానికి, సాకారరూపంగా గణపతిని గుర్తిస్తూ ఆప్తులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖07.09.2024✍️ (⚙️) EnTREE కల్పవృక్షము https://bharghavashyam.blogspot.com/2022/08/blog-p...