Self-Love Subjective-Letter
⚛️🛞🪷
స్వీయ ప్రేమ లేఖ
ప్రియ మరియు గౌరవ జీవన అస్తిత్వమా!!!
ఒక చిన్న తీవ్రమైన అంతరంగిక ఉత్సహంతో, భవిష్యత్తు దృష్టి ఉండి, ప్రస్తుతంలో నా గత వ్యక్తిగత అనుభవాలు ఆధారం చేసుకుని నైరూప్యమైన భావనలతో... స్పష్టమైన సారాంశ పదాలతో ఈ లేఖని రాస్తున్నాను.
నా హృదయం లో చాలా భాగాలు నీ యొక్క జ్ఞాపకాలతో నిండి ఉంది. ఇప్పుడు ఆ గడిచిన కాలాపు జ్ఞాపకాలు లేకుండా ఈ నిన్ను ఉహించలేకపోతున్నాను....
నీ గురించి ఆలోచించేటప్పుడు, గడిచిన కాలాన్ని గుర్తు చేసుకున్నప్పడు, నా మనసులో ఆలోచనలు/భావనలు చాలా అస్పష్ట ఆనందంతో మరియు స్పష్టమైన సమగ్రత సంతోషంతో అద్భుతంగా ఉంది. దాన్ని ఒక ఆతిశయంబైన సమతుల్య పారమర్దిక అనుభూతిగా నేను భావిస్తున్నాను.
నాకు ఈ అస్పష్ట స్పష్ట అంతరంగిక అనుభవాల గురించి, వాటి కాల పరిమితి గురించి నాకు తెలియదు. కానీ ఎందుకో, ఇది నీతో పంచుకోవాలి అని ఆరాటంగా ఉంది. నా ఆతిసయంబైన పారమర్దిక సమతుల్య అనుభూతికి ప్రేమ అని నామకరణం చేస్తూ
“నేను నిన్ను ప్రేమిస్తున్నాను”.
నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే.
కానీ స్ఫూర్తిగా ఉంటే, ఉత్సాహంగా నీ దగ్గర ఉంటాను.
లేకపోతే ఉండాలి కాబట్టి ఉంటాను.
ఉండడం కంటే ఆనందంగా ఉండడం శోభస్కరం కదా...
నువ్వు సమగ్రంగా ఉన్నావు, ఉంటావు కూడా...
నేను ఇప్పుడు నీకు ఈ విషయం చెప్పింది,
ఇది వరకు ఎలా ఉన్నావు అనే సమాధానంతో మాత్రమే కాదు ఇక ముందు ఎలా ఉంటావు అనే ప్రశ్నతో కుడా.....
భవిష్యత్తుని నీ చేతుల్లో లేదు కానీ
ప్రస్తుతం ప్రయత్నం మాత్రం నీ దగ్గరే ఉంది కదా
అందుకే జాగ్రత్తలు చెప్పాలి కాబట్టి చెప్పాను...
నువ్వు ఉంటే నేను ఉంటాను.
Life Entity "I Love You"
ఇట్లు
నీ ప్రియమైన
స్వీయ సంహిత
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అక్షర అనంద అస్తిత్వం
Comments
Post a Comment