Ambedkar Jayanti
EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము అంబేద్కర్ జయంతి నాకు అనిపించిన అభినవ పరుశురాముడు అంబేద్కర్.... వీరిరువురు ఏ ఒక్క తత్వానికి వ్యతిరేకులు కాదు. కేవలం పోరాటయోధులు. న్యాయం కోసం పోరాడారు తప్ప ప్రతీకారం కోసం కాదు. కార్తవీర్యార్జుని కుమారులు ఒకానొక సమయంలో జమదగ్ని మహాముని తలను శరీరం నుంచి వేరుచేసి తీసుకెళ్లిపోయారు. అప్పుడు ఆ జమదగ్ని మహర్షి పుత్రుడైన పరశురాముడు, ఆ పితృవియోగంలో కూడా లోతుగా తన తండ్రి మరణానికి గల కారణాలు ఆలోచించాడు. ఆ అధర్మానికి మూలం ఎక్కడుంది అని అన్వేషించాడు. క్షత్రియత్వంలో ఉన్న అధికార మదం కారణం అని తెలుసుకుని, ఆ అన్వేషణలో తను పడుతున్న బాధలు విస్మరించాడు, సమాజాన్ని పట్టి పీడిస్తున్న బాధలను తన బాధలుగా మార్చుకున్నాడు. ఆధర్మాన్ని ఆచరించే క్షత్రియ రాజులను హతమార్చి సమస్త ఆర్యవర్తన్ని పరిశుద్ధం చేయడమే జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు. తన తల్లి 21 సార్లు రోదించిందని, 21 సార్లు దండయాత్ర చేసి అధర్మాన్ని ఆచరించే క్షత్రియ రాజులను అంతమొందించాడు. పరశురామునిలో కేవలం ప్రతీకార వాంఛ ఉండి ఉంటే పరశురామ ప్రభువు అని మనం పూజించే వాళ్ళం కాదు. భార్గవ రాము...