ఆదిశేషయ్య తాతయ్య మరియు ఆర్య & సాకేత్ (27.08.2021)
⚛️🪷🌳 ఈరోజు ఆమంచర్ల ఆదిశేషయ్య తాతయ్య ఆంగ్ల తేదీల ప్రకారంగా స్వర్గస్తులైన రోజు. అలాగే వారి ముని మనవడు మరియు మనవడు ఆమంచర్ల వంశోద్ధారకులు "నాగ సాయి సుందర కోవిద్ ఆర్య" మరియు "సాకేత్"ల జన్మదినం. నా ఆనందానికి గల అనేక కారణాలలో వారి ముక్కుసూటితనం, ఆత్మ నిర్భరం, మితంతో ఆనందం పొందే మనసు, దూరదృష్టి ప్రామాణికం. వారి తత్వ లక్షణ లక్షణాలను స్మరిస్తూ ఆమంచర్ల వంశోద్ధారకులు ఆర్య మరియు సాకేత్ కు దైవం మరియు పూర్వికుల ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖27.08.2021✍️