EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము స్వీయ ప్రేమ లేఖ ప్రియమైన భార్గవ శ్యామనికి నీ జీవన అస్తిత్వం రాయునది!!! ఒక చిన్న తీవ్రమైన అంతరంగిక ఉత్సహంతో, భవిష్యత్తు దృష్టి ఉండి, ప్రస్తుతంలో నా గత వ్యక్తిగత అనుభవాలు ఆధారం చేసుకుని నైరూప్యమైన భావనలతో... స్పష్టమైన సారాంశ పదాలతో ఈ లేఖని రాస్తున్నాను. నా హృదయం లో చాలా భాగాలు నీ యొక్క జ్ఞాపకాలతో నిండి ఉంది. ఇప్పుడు ఆ గడిచిన కాలాపు జ్ఞాపకాలు లేకుండా ఈ నిన్ను ఉహించలేకపోతున్నాను.... నీ గురించి ఆలోచించేటప్పుడు, గడిచిన కాలాన్ని గుర్తు చేసుకున్నప్పడు, నా మనసులో ఆలోచనలు/భావనలు చాలా అస్పష్ట ఆనందంతో మరియు స్పష్టమైన సమగ్రత సంతోషంతో అద్భుతంగా ఉంది. దాన్ని ఒక ఆతిశయంబైన సమతుల్య పారమర్దిక అనుభూతిగా నేను భావిస్తున్నాను. నాకు ఈ అస్పష్ట స్పష్ట అంతరంగిక అనుభవాల గురించి, వాటి కాల పరిమితి గురించి నాకు తెలియదు. కానీ ఎందుకో, ఇది నీతో పంచుకోవాలి అని ఆరాటంగా ఉంది. నా ఆతిసయంబైన పారమర్దిక సమతుల్య అనుభూతికి ప్రేమ అని నామకరణం చేస్తూ “నేను నిన్ను ప్రేమిస్తున్నాను”. నేను నీ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నువ్వు నీ స్వీయ స...