Posts

Showing posts from April, 2025

Viewer-ప్రశాంత ప్రేక్షకుడిని (Telugu)

⚛️🪷🌳 నేను అజేయుడని కాదు, విజేయుడను కాదు, పరాజేయుడను కాదు, అసలు పోరాట యోధుడునే కాదు నేను ఒక ప్రశాంత ప్రేక్షకుడిని.  విజయం వల్ల కలిగే విలాసాలు వైఫల్యం వల్ల కలిగే విషాదాలు  విలీనం చేసి వీక్షీంచే వాడిని 💭⚖️🙂📝@🌳 📖20.04.2025✍️

My Impact (Telugu)

⚛️🪷🌳 నా ప్రతికూల ఆలోచనలను ఎవ్వరూ చూడలేరు (అసలు ఏ ఆలోచనలు నా నియంత్రణలో లేనివి) కానీ దాని ప్రభావం నా పైన ఉన్న  కానీ  మాటలు నా పరిధిలో ఉండేవే నా మాటలు వినగలరు, దానికి  నా విచక్షణ తోడుగా ఉంటుంది అందుకే మంచివాడిగా చలామణి అవుతున్నాను.  అలాగని నేను పూర్తిగా ప్రతికూలమైన వాడిని కాదు,   నకిలీ మనిషిని అంతకన్నా కాదు సాధారణమైన వాడిని,  ఉత్సాహంతో ఉద్వేగంతో కొన్నిసార్లు తెలిసి తెలియక కొన్నిసార్లు తప్పులు చేసేవాడిని,  ఒప్పుకునే వాడిని దాచుకునేందుకు దిద్దుకోనేందుకు ప్రయత్నించే వాడిని. 💭⚖️🙂📝@🌳 📖19.04.2025✍️

Train Window (Telugu)

Image
⚛️🪷🌳 వెలుపలి నుంచి వెలుగును వేగంగా వీచే గాలిని గణనీయంగా  రప్పించే రైలు కోచులోని కిటికీ  సమీపాన సంతోషంగా కూర్చుని కంటికి కనిపించే  నీలాకాశం, నేలపై పచ్చని పైరు చూస్తూ చిద్విలాసంగా చింతనతో  తోటి ప్రయాణికుని ప్రతిఫలంగా తీసుకున్న  తాజా తాదాత్మ్య చక్కని చిత్రం  💭⚖️🙂📝@🌳 📖20.04.2025✍️