Composed Songs from Childhood
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
10-Jan-2010
స్వాగతమయ్య ఓ శ్రీరామ
నీ దర్శనానికై వేచి ఉన్నమయ్య
నా మదిలొ నీ గుడిని నిలిపానయ్య
నీ దర్శనానికై రామకోటి రాస్తున్నయ్యు
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
10-Jan-2010
రామ నీవే దిక్కు అని నమ్మనయ్య
రామ నిన్ను చూడడమే జీవితాశయం అయ్య
రామ నిన్ను చుచే నా తుది శ్వాస వదులుతానయ్య
ఇది సత్యం అయ్యేల చేయి శ్రీరామ
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
12-Jan-2010
ఓ పరమాత్మ నీ దశావతారం అమోఘమయ్య ఆనందమయ్య
మత్స్యావతారం ఎత్తితివయ్యా వేదాలను రక్షించితివయ్యా
కూర్మ అవతారం ఎత్తితివయ్యా దేవతలకు అమృతం ఇచ్చితివయ్య
వరాహవతారం ఎత్తితివయ్యా భూమిని రక్షించితివయ్యా
నరసింహావతారం ఎత్తితివయ్యా భక్తుడ్ని రక్షించితివయ్యా
వామనవతారం ఎత్తితివయ్యా నింగి నేలను సొంతం చేసుకుంటివయ్యా
భార్గవరామావతారం ఎత్తితివయ్యా దుష్టలైన రాజులను శిక్షించితివయ్య
రామావతారం ఎత్తితివయ్యా అందరికీ ఆదర్శమై నిలిచాతివయ్యా
కృష్ణావతారం ఎత్తితివయ్యా భగవద్గీత బోధించితివయ్య
బుద్ధావతారం ఎత్తితివయ్యా అహింసను బోధించితివయ్య
కల్కి అవతారం ఎత్తుతావయ్య దుష్టులను శిక్షిస్తావయ్య
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
Mar 2010
రారా రామయ్య రారా రామయ్య
దీనులను కాపాడ రారా రామయ్య
దీనురాలు అయినా శబరిని నది చేశావయ్యా
దీనులైన సుగ్రీవ మకరధ్వజ విభీషణులను రాజులను చేశావయ్యా
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
16 Mar 2010
రామా తండ్రి నీవే దిక్కు
రామ నీ ఆశీర్వాదమే మాకు దిక్కు
నీ మార్గమే మాకు దిక్కు
నీ కరుణే మాకు దిక్కు
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
16 Mar 2010
రామా నిన్ను నమ్మితే మాకంత ధైర్యం
రామా నిన్ను శరణంబు వెడితే మాకంత ధైర్యం
రామా నీ నామం మాకెంతో ధైర్యం
రామా నిన్ను మనసులో ఉంచుకుంటే మాకెంతో ధైర్యం
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
16 Mar 2010
రామా నీవు నాకు దర్శనం ఇవ్వవయ్య
రామ మాకు నిన్ను చూడాలని ఉందయ్య
రామా ఎల్లప్పుడూ మాచెంత ఉండి మాకెందుకు దర్శనమివ్వవయ్య
రామ మేము నీ దర్శనానికి వేచి ఉన్నామయ్యా
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
16 Mar 2010
రామ తరము తరము అనంతము ఈ తరం నీదేనయ్య
ఈ తరమే నీదైనప్పుడు నిన్ను పూజించే వారికి దర్శనం ఎందుకు ఇవ్వవయ్యా
ఈ తరంలో నిన్ను పూజించే వారికి దర్శనమివయ్యా
రామ నిన్నే చూడాలని ఉందయ్య
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
08-Apr-2010
తులసి దాసుకు ప్రభు
సమర్థ రామదాసుకు ప్రభు
త్యాగరాజకు ప్రభు
మాకు దర్శనం ఇవ్వవయ్య
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
ఎత్తితివయ్యా
May-2010
రామ నీవు నాకు కనిపించుట ధర్మము
రామ నిన్ను ఆచరించుట ధర్మము
రామ నిన్ను కీర్తించుట ధర్మము
రామ నీవు ధర్మమూర్తివయ్య
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
May-2010
రామ నీ నామమే భవ్య నామము
రామ నీ నామమే ప్రమోద నామము
రామ నీ నామమే తారక నామము
రామ నీ నామమే విజయ నామము
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
May 2010
రామ నీవు మాకు దర్శనమివ్వుట నీ కర్తవ్యము
రామా నన్ను మంచి మార్గంలో నడిపించుట నీ కర్తవ్యము
రామ నీవు మా చేత మంచి పనులు చేయించుట నీ కర్తవ్యము
రామ మా నోట మంచి మాటలు పలికించుట నీ కర్తవ్యము
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
May 2010
రామా నీవు భవుడవు
రామా నీవు ప్రమోదుడవు
రామ నీవు విజయుడవు
రామ నీవు సౌమ్యుడవు
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
May 2010
రామ నీవు పరబ్రహ్మవు
రామ నీవు పరమాత్ముడవు
రామ నీవు పరంధాముడవు
రామా నీవు పరాత్పరుడవు
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
రామ నీవు నాకు దర్శనమివ్వవయ్యా
నేను ఏ పాపం చేసితినియ్య
రామర్పణమస్తు అన్న పదముతో
అన్ని పాపాలకు దూరమైతినయ్యా
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
Aug 2010
రామ తండ్రి శరణమయ్య
మాలో ఉన్న చెడు ఆలోచనలను శరమెత్తి సంహరించవయ్యా
రామ నీలో ఉన్న మంచి గుణాలను మాకివ్వవయ్యా
రామ మా చేత మంచి పనులు చేయించవయ్యా
ఓ శ్రీరామ ఓ పరమాత్మ
Comments
Post a Comment