Hindu Arabic Numeric System (English/Telugu)
⚛️🪷🌳 హిందూ-అరబిక్ వ్యవస్థ:- సున్నా - సమస్తం: ఘన గణిత విశ్వ విస్తృత విప్లవం మనం ఇప్పుడు 0-9 అంకెల పద్ధతి హిందూ అరబిక్ సంప్రదాయం ప్రకారం ఉపయోగిస్తూ ఉన్నాము. ఈ అంకెల పద్ధతి ప్రపంచంలో ప్రామాణికమైనది, సమర్థవంతమైన సంఖ్యా వ్యవస్థలలో విశేషమైనది. ఈ పద్ధతి భారత గణిత శాస్త్రవేత్తల ఆవిష్కారంగా ఆవిర్భవించింది. ఈ భారతీయ పద్ధతిని ఆరబ్ గణిత శాస్త్రజ్ఞులు అభ్యసించి వారి ప్రాంతాలకు తీసుకువెళ్ళారు, వారి ద్వారా యూరప్‌కు ఈ పద్ధతి పరిచయమయ్యింది. యూరప్ గణిత శాస్త్రజ్ఞులు ఈ పద్ధతిని అధ్యయనం చేసి అనేక గ్రంథాల ద్వారా ఘనమైన గణిత వ్యవస్థ మరింత ముమ్మరంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. మొదట భారతీయ గణిత శాస్త్రజ్ఞుల ద్వారా ప్రారంభమైన బ్రాహ్మీ పద్ధతి లో 1 నుండి 9 వరకూ అంకెలను ఉపయోగించేవారు. ఆర్యభట్టు శూన్యం (0) అనే అంకెను ప్రవేశపెట్టి గణితంలో మహత్తరమైన మార్పులతో ఒక కొత్త శకానికి శ్రీకారం చుట్టారు. సంఖ్యాలలో సున్నా లేకుండా సంఖ్యలను సమర్థవంతంగా వ్రాయడం అసాధ్యం. ఈ పద్ధతిలో ఒకే అంకెను విభిన్న స్థానాల్లో ఉపయోగించడం ద్వారా పెద్ద సంఖ్యలను సులభంగా రూపోందించగలడం, దశమాంశపు (Decimal) పద్ధతి (10) ఆధారంగా ఉండడం వల్ల పె...